ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తాగు.. ఊగు..

ABN, Publish Date - Nov 29 , 2024 | 12:33 AM

రోజు ఏదైనా.. ఆనందం.. విషాదం.. సందర్భం ఏమైనా కానీ.. సరదా అంటే ముందు గుర్తొచ్చేది మందు..

జిల్లా అంతటా భారీగా మద్యం విక్రయాలు

గతంతో పోలిస్తే అమ్మకాలు ఎక్కువ.. లాభాలు తక్కువ

కొన్ని బ్రాండ్‌లు ధర తగ్గించడమే కారణం

కమీషన్‌ పెంచాలంటూ దుకాణదారుల డిమాండ్‌

జిల్లా అంతటా బారులు ఢమాల్‌

సగానికి పడిపోయిన అమ్మకాలు

రోజు ఏదైనా.. ఆనందం.. విషాదం.. సందర్భం ఏమైనా కానీ.. సరదా అంటే ముందు గుర్తొచ్చేది మందు.. కార్తీకమాసం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో చాలామంది నిష్టగా ఉంటారు. మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు పరిశీలిస్తే మద్యం విక్రయాలు భారీగానే ఉన్నాయి. మందు బాబులు తాగి ఊగారు. గతంకంటే మించి ఈసారి అమ్మకాలు నమోదవుతున్నాయి. లాభం విషయం పక్కనపెడితే అమ్మకాల్లో మాత్రం జోరుగానే ఉందని అంటున్నారు అధికారులు. తాగేయ్‌.. చిందేయ్‌ మందు బాబులు ఖుషీగా ఉన్నారు. మరో వైపు బారులన్నీ ఢమాల్‌. రోజువారి అమ్మకాలు తగ్గి నష్టాలు పెరిగి ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఏలూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన నెలన్నర రోజుల్లోనే గతంకంటే మించి అమ్మకాలు భారీగా నమోదవుతున్నట్టు ఎక్సైజ్‌ అధికారుల అంచనా. కొత్త మద్యం విధానం అమలు లోకి రావడం, దీనికి తగ్గట్టుగానే ఎక్కడికక్కడ మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు జారీ చేయడం, అమ్మకాలు ప్రారంభించడం జరిగిపోయింది. ఫీజు పెంచినా ఎవరూ ఖాతరు చేయకుండా మద్యం దుకాణాల కోసం పోటీలు పడ్డారు. నిర్దిష్ట ప్రదేశంలో దుకాణాలు పెట్టే అవకాశం లేక లైసెన్సు పొందిన పదిహేను రోజుల్లో కూడా సాధించలేక పోయారు. ఇంకొందరు ఉన్న ప్రదేశం నుంచి ఏదొక ప్రాంతానికి దుకాణం మార్చేందుకు ప్రయత్నించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 144 మద్యం దుకాణాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ దుకాణాల సంఖ్య పెరిగింది. గత నెల 15 తరువాత అత్యధికంగా మద్యం దుకాణాల్లో అమ్మకాలు ఆరంభించారు. మద్యం పాలసీ మారడం, కూటమి ప్రభు త్వం సరికొత్త విధానాలు అమలుపర్చడం, కొత్త బ్రాండ్‌లకు ఆస్కారం కల్పించడం వంటి పరిణామాలక్రమంలో దుకాణాలకు ఈనెల మొదటి నుంచే సరైన మద్యం బ్రాండ్‌లన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఇంకేముంది ఎక్కడపడితే అక్కడ ఒక నిర్ధిష్ట సమయంలోనే అమ్మకాలు కొనసాగించడం, ఇంకొందరేమో చాటుమాటుగా అమ్మకాలు సాగిస్తూనే వచ్చారు. తొలి నెల రోజుల వ్యవధిలోనే మద్యం విక్రయాలు ఆశించిన దానికంటే భారీగానే పుంజుకున్నాయి.

ఈ నెలలో లక్ష కేసుల విక్రయం

ఈనెల 1 నుంచి 25 వరకు ఐఎంఎల్‌ రకం మద్యం లక్షా 4 వేల కేసుల విక్రయాలు సాగాయి. బీర్ల విషయంలో 30 వేల కేసులను అధిగమించాయి. గతంలో ఈ అమ్మకాల సంఖ్య కాస్తంత తక్కువగా ఉంది. అప్పట్లో ధరలు రెట్టించి అమ్మడం, ప్రస్తుతం కొన్ని రకాల బ్రాండ్‌లపై ధరలు తగ్గించడంతో ప్రభుత్వానికి ఆదాయం మాత్రం స్వల్పంగానే పెరిగినట్టయింది. దీనికితోడు నూరు శాతం దాటి 150 శాతం వరకు అమ్మకాలు పెరిగినట్టు విశ్లేషిస్తున్నారు. గతం తో పోలిస్తే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండేవి. ఆలోపే మద్యం విక్రయాన్ని పూర్తి చేసేవారు. ఆ తదుపరి సమయమంతా జనం బారులవైపే దూసుకుపోయేవారు. ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు సాగిస్తుండడంతో అమ్మకాలు పుంజుకున్నాయి.

లాభాలు లేవు..!

ప్రసుత మద్యం విధానం మందు బాబులకు సంతృప్తి కలిగిస్తున్నా అమ్మకాల్లో మాత్రం ఆశించిన లాభాలు లేవని మద్యం దుకాణాల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. మద్యం విక్రయాలపై కమీషన్‌ను పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం దానికి సిద్ధంగాలేదని, ఈ కారణంగా తాము తొలి నెలలోనే నిర్వహణ చార్జీల భారాన్ని అదనంగా మోయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఏలూరు నగర పరిధిలో ఒక్కొ దుకాణంలో సరాసరిన సాగాల్సిన అమ్మకాల్లో ఎగుడు దిగుడు కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యేకించి కార్తీకమాసం కావడంతో ప్రతీ ఏటా అమ్మకాల శాతం తగ్గుతూనే ఉంటుందని, ఈసారి మాత్రం అమ్మకాలు తగ్గలేదని, లాభాల విషయానికి వచ్చేసరికి ఆశించినట్టుగా లేనేలేదని మద్యం విక్రయదారులంతా ఆందోళనలో ఉన్నారు. ఈనెల 25 రోజుల్లోనే సుమారు రూ.38 కోట్లు అమ్మకాలు సాగించారు. ఏలూరు నగరంలో లైసెన్సు పొందిన దుకాణా లు 21 ఉండగా, వీటిలో అమ్మకాల శాతం కూడా జిల్లాలో మిగతా వాటికంటే నగరంలోనే అత్యధికంగా ఉన్నాయి. భీమడోలు, చింతలపూడి, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కైకలూ రు, నూజివీడు, పోలవరం ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో నెలవారీ విక్రయల టార్గెట్‌లలో అందరూ ముందు వరుసలోనే ఉన్నట్టు కనిపిస్తుంది.

బార్లు.. ఢమాల్‌

గడిచిన వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ మద్యం దుకాణాలకంటే బార్లలోనే అమ్మకాలు గరిష్ఠ స్థాయికి చేరేవి. అప్పట్లో బార్‌కు ఏటా కోటి రూపాయలకుపైగా లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉన్నందున దీనిని సాకుగా తీసుకుని ఎంఆర్‌పీ మించి మరీ అమ్మకాలు సాగించే వారు. క్వార్టర్‌ ఒక్కింటికి రూ. 40 చొప్పున అదనంగా ధర పెంచి మరీ అమ్మకాలు సాగించేవారు. రాత్రి 9 గంటలకే మద్యం దుకాణాలు మూసివేయడంతో రాత్రి 11 గంటల వరకు ఉండే బారులవైపే అందరూ పరుగులు తీసేవారు. రోజువారి అమ్మకాలు కూడా గరిష్ఠ స్థాయిలో జరిగేవి. ఇప్పుడు కొత్త మద్యం విధానంతో ఎక్కడికక్కడ ప్రైవేటు లైసెన్సు దుకాణాలు తెరవడం, వీటిలో ప్రత్యేకించి కొన్ని బ్రాండ్‌లను అందుబాటులో ఉంచడంతో ఒక్కసారిగా బారువైపు వెళ్ళడానికి జనం మొహం చాటేశారు. దీంతో కొత్త మద్యం విధానం గత నెలలో ప్రారంభమైన నాటి దగ్గర నుంచి బారులలో అమ్మకాలు పూర్తిగా క్షీణించాయి. దీనితో బార్ల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. గతంలో అమ్మకాలపై ఎంఆర్‌పి కంటే రూ.40 అదనంగా ధర వసూలు చేయగా ప్రస్తుతం పది రూపాయలకు కుదించుకున్నారు. క్వార్టర్‌ ఒక్కింటికి సరాసరి రూ.30 తగ్గించారు. గతంలో ఒక బారులో రోజుకు 15 నుంచి 20 కేసులు మద్యం విక్రయించగా ఇప్పుడు అది సరాసరి పది కేసులకు పడిపోయింది. రోజువారి ఒక్క బారుకు రూ.35 వేల నుంచి రూ.40 వేల నష్టం వస్తున్నట్లు ఆయా యాజమాన్యాలు లబోదిబోమంటున్నాయి. బార్‌ లైసెన్సు గడువు వచ్చే ఏడాది ఆగస్టుతో ముగియనుంది. ఈలోపు రోజుకి జరిగే నష్టం లెక్కేసుకుంటే లైసెన్సు ఫీజుకంటే ఎక్కువే అవుతుందని లబోదిబోమంటున్నారు. మద్యం ప్రియులు మాత్రం నెలల తరబడి బారులు తమ జేబుల కు చిల్లులు పెట్టాయని, ఇప్పుడా పరిస్థితి లేదని, ధరలు తగ్గడమే కాకుండా ఇష్టపడే బ్రాండ్‌లు అందుబాటులోకి వచ్చాయని సంతృప్తి పడుతున్నారు. ఇంకోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలు అన్ని బ్రాండ్‌లపై ధర తగ్గుముఖం పడుతుందని ఆశిం చామని, దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోలేకపోయిందని అసంతృప్తి మందుబాబుల్లో ఉంది.

Updated Date - Nov 29 , 2024 | 12:33 AM