ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లాభాల కిక్‌ రివర్స్‌

ABN, Publish Date - Nov 25 , 2024 | 12:11 AM

మద్యం వ్యాపారం జోలికి వెళ్లిన వారి ఆశలు గల్లంతయ్యాయి. చేసిన అప్పులే ఇప్పుడు మిగులుతున్నాయి. లైసెన్స్‌దారులకు 20 శాతం కమీషన్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తీరా అమ్మకాలు నిర్వహించిన తర్వాత తత్వం బోధప డింది. కమీషన్‌ ఇప్పుడు 9.5 శాతమే వస్తోంది. షాపులు దక్కించుకున్న వారికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

నష్టాల బాటలో మద్యం షాపుల లైసెన్స్‌దారులు

20 శాతం కమీషన్‌ ఆశిస్తే.. వస్తున్నది 9.5 శాతమే..

డిపో అమ్మకాలపై ఇవ్వాలంటున్న లైసెన్స్‌దారులు

ఆశలు తల్లకిందులు.. అప్పులు చేసి లైసెన్స్‌ ఫీజు చెల్లింపు

ఇలాగైతే ఏడాదికి కోటి వరకు నష్టం

మద్యం వ్యాపారం జోలికి వెళ్లిన వారి ఆశలు గల్లంతయ్యాయి. చేసిన అప్పులే ఇప్పుడు మిగులుతున్నాయి. లైసెన్స్‌దారులకు 20 శాతం కమీషన్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తీరా అమ్మకాలు నిర్వహించిన తర్వాత తత్వం బోధప డింది. కమీషన్‌ ఇప్పుడు 9.5 శాతమే వస్తోంది. షాపులు దక్కించుకున్న వారికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం విధానాన్ని అమలుచేసింది. అంతే పార్టీల నాయకులు, వ్యాపారులు, మద్యం షాపుల కోసం ఎగబడ్డారు. లక్షల రూపాయలు సమర్పించుకుని షాపులు దక్కించుకు న్నారు. లైసెన్స్‌ ఫీజులు చెల్లించడానికి ప్రతి ఒక్కరూ అప్పు లుచేశారు. ఒక్కో షాపునకు ఏకంగా రూ.50 లక్షలు వెచ్చిం చాల్సి వచ్చింది. లైసెన్స్‌లు పొందిన వారు కొందరు ముందు గానే విక్రయించేవారు. ఆ షాపులను ఇతర లైసెన్స్‌దారులు ఎగబడి కొనుగోలు చేశారు. తీరా కమీషన్‌ తగ్గిపోవడంతో లైసెన్స్‌దారులు గగ్గోలు పెడుతున్నారు.

రోజుకు రూ.4.50 కోట్లకు పెరిగిన అమ్మకాలు

ప్రైవేటు మద్యం విధానంలో అమ్మకాలు పెరిగాయి. ఇతర రాష్ర్టాల నుంచి అక్రమ మద్యం దిగుమతులు నిలిచిపోయా యి. నాణ్యమైన మద్యం క్వార్టర్‌ రూ.99లకే విక్రయిస్తున్నారు. దాంతో మద్యం ప్రియులు ఒకటికి రెండు బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాదికంటే ఈ సారి జిల్లాలో 20 శాతం అమ్మకాలు పెరిగాయి. వ్యాపారులు అధికంగా ఉంటే లైసెన్స్‌ దారులకు ఊరట లభిస్తుంది. కమీషన్‌ రూపంలో లాభం ఉంటుంది. కానీ, ప్రభుత్వం అనుకున్న రీతిలో కమీ షన్‌ ఇవ్వడం లేదు. కేవలం 9.5 శాతం మాత్రమే వస్తోంది. గతంలో జిల్లావ్యాప్తంగా రోజుకు రూ.3.80 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయేది. ఇప్పుడు రూ.4.50 కోట్ల మేర అమ్మకాలు సాగుతున్నాయి. అందులో 9.5 శాతం కమీషన్‌ రూపంలో లైసెన్స్‌దా రులకు లభిస్తోంది. జిల్లాలో 175 షాపులున్నాయి. కొన్నిచోట్ల షాపుల అద్దె నెలకు రూ. లక్ష చెల్లిస్తున్నారు. నిర్వహణ వ్యయం తడిసి మోపెడైంది. దీంతో లైసెన్స్‌దారులు తలలు పట్టుకుంటున్నారు.

బెల్టుకు నో..

బెల్టు షాపులు పెట్టుకోవడానికైనా అవకాశం ఉంటుందని ఆశించారు. సిండికేట్‌ అయితే బాటి ల్‌పై కాస్త ఎక్కువ సొమ్ము చేసుకోవ చ్చని భావించారు. వీటన్నింటిపైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అధిక ధరలకు విక్రయాలు సాగిస్తే అధికారుల నుంచి, నేతల వరకు ము డుపులు చెల్లించాలి. దొంగ వ్యాపారం అన్న ముద్ర పడుతుంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన 20 శాతం కమీషన్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో లైసెన్స్‌దారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కాకుంటే రెండేళ్లలో ప్రతి షాపుకు కోటి రూపాయల మేర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.

పెదవి విప్పని నేతలు

కొన్నిచోట్ల 25 నుంచి 30 శాతం వరకు భాగస్వామ్యాన్ని ప్రజాప్రతినిధులు తీసుకున్నారు. వచ్చే కమీషన్‌లో వారికి కొంత చేరిపోతోంది. అయితే లైసెన్స్‌ దక్కించుకో వడానికి వెచ్చించిన రూ.50 లక్షలతో ప్రజా ప్రతినిధులకు సంబంధం లేదు. షాపులు దక్కించుకున్న తర్వాత మాత్రమే అందులో వంతు కావాలంటూ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీనికి లైసెన్స్‌దారులు అంగీకరించాల్సి వచ్చింది. తీరా ఇప్పుడు కమీషన్‌ రూపంలో చేదు అనుభవం ఎదురైంది. దీనిపై వాటాలు దక్కించుకున్న ప్రజా ప్రతినిధులు పెదవి విప్పడం లేదంటూ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత విధానంలో ప్రభుత్వానికి ఆదాయం బాగుంది. వ్యాపారులకు నష్టం చేకూరుతోంది.

బార్‌ల ఆశలు తల్లకిందులు

వైసీపీ హయాంలో బార్‌ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొందింది. ప్రభుత్వ షాపుల్లో నాసిరకం మద్యం ఉండేది. బార్‌లకు బ్రాండ్‌లు సరఫరా అయ్యేవి. క్వార్టర్‌ బాటిల్‌పై రూ.40 అధికంగా విక్రయించేవారు. ఎంఆర్‌పి ధరకే బార్‌లకు మద్యాన్ని సరఫరా చేస్తారు. ఆ పైన ధర వేసుకుని విక్రయించే వెసులుబాటు బార్‌లకు ఉంది. బ్రాండెడ్‌ రకాలు బార్‌లలో లభ్యం కావడంతో వ్యాపారాలు జోరుగా సాగాయి. మంచి లాభాలు వచ్చాయి. కూట మి ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం ప్రైవేటు మద్యం షాపుల్లో దొరుకుతోంది. దీంతో బార్‌లో అమ్మకాలు సగానికి పడిపోయాయి. ధరలు తగ్గించాల్సి వచ్చింది. ఫలితంగా నష్టా లు చవిచూస్తున్నా మంటూ బార్‌ యజమా నులు గగ్గోలు పడుతున్నారు. మొత్తంగా ప్రైవే టు మద్యంతో మద్యపాన ప్రియులకు ఊరట లభించింది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపె డుతోంది. కానీ వ్యాపారానికి లాభం రావడం లేదంటూ లైసెన్స్‌దారులు ఘొల్లుమంటున్నారు.

నేడు విజయవాడలో వ్యాపారుల సమావేశం

లైసెన్స్‌దారులంతా విజయవాడలో సోమవారం సమావేశం కావాలని నిర్ణయించారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయపోరాటం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి సలహాలు తీసుకునే ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం న్యాయపోరాటంలోనూ లైసెన్స్‌దారులకు చుక్కెదురు కానుందని అధికారులు తేల్చేశారు. ప్రభుత్వం ఇష్యూ ధర మీద 20 శాతం కమీషన్‌ ఇస్తామని జీవోలో స్పష్టం చేసింది. అంటే డిస్ట్రలరీల నుంచి డిపోలకు ఇచ్చే ధరపై 20 శాతం అంటూ అధికారులు తేల్చేశారు. తక్కువ ధరకే డిపోలకు మద్యం సరఫరా అవుతుంది. దానివల్ల 20శాతం కమీషన్‌ ఇస్తున్నా సరే లైసెన్స్‌దారులకు 9.5శాతం మాత్రమే లభిస్తోంది. అదే గతంలో డిపోల నుంచి ఇచ్చే ఇన్‌వాయిస్‌ ధరలో కమీషన్‌ ఉండేది. అంటే రూ.99ల మద్యానికి 20 శాతం కమీషన్‌ అన్నమాట. ఈ లెక్కన క్వార్టర్‌ బాటిల్‌ రూ. 80లకు లైసెన్స్‌దారులకు రావాలి. కానీ రూ.90 పడుతోంది. దీనివల్ల లైసెన్స్‌దారులు న్యాయపోరాటం చేయడానికి అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

Updated Date - Nov 25 , 2024 | 12:11 AM