ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సరుకు దిగింది..

ABN, Publish Date - Apr 21 , 2024 | 12:02 AM

గోదావరి జిల్లాల్లో ఎన్నికల సమయంలో అందరికి ఓటు పండగే. పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి కొదువ లేకుండా చూసుకుంటేనే అసలు సిసలైన ఫలితం. దీనికోసమే ఎంతైనా ఇస్తారు. ఈ ఐదేళ్ల పాటు ‘జే’ మార్కు మద్యంతో జనం తిప్పలు పడ్డారు.

కావాల్సిన వారికి.. కావాల్సినంత కిక్‌

రహస్య ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మద్యం నిల్వలు

మూడు నెలలుగా ఎక్కడ దొరికితే అక్కడి నుంచి సేకరణ

సర్కారు దుకాణాల నుంచే అత్యధికంగా డంప్‌

వైసీపీలో అనుకూలురుకి ఎక్కువ అందుబాటు..

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఎన్నికలు వచ్చాయంటే చాలు కార్యకర్తలు దగ్గర నుంచి సామాన్య ఓటరు వరకు ఫుల్‌ ఖుష్‌.. నేతలు వెంట జై జైలు కొడుతూ వీధుల్లో పార్టీల నినాదాలు చేస్తూ వచ్చి పోయే వారిని తమ నేతకు అనుకూలంగా ఓట్లు అడుగుతూ ఫుల్‌ బిజీగా ఉండే కార్యకర్తలకు ఇంతకుముందు అయితే పోటీ చేసే అభ్యర్థి అంతా చూసుకునేవారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నేతలకు జేబు నిండా పని తగిలేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నా గుర్తించిన వారికి మాత్రమే. ‘జే’ మార్కుతో గొంతు తడపడం లేదంటే జేబు నింపడం ఈ రెండే లక్ష్యాలుగా ఈ సారి ఎన్నికల కథ నడుస్తోంది.

గోదావరి జిల్లాల్లో ఎన్నికల సమయంలో అందరికి ఓటు పండగే. పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి కొదువ లేకుండా చూసుకుంటేనే అసలు సిసలైన ఫలితం. దీనికోసమే ఎంతైనా ఇస్తారు. ఈ ఐదేళ్ల పాటు ‘జే’ మార్కు మద్యంతో జనం తిప్పలు పడ్డారు. ఎక్కడా అమ్మకాలు జోరు తగ్గనేలేదు. దేశంలో ఎక్కడా వినిపించని, కనిపించని రకరకాల బ్రాండ్‌లు అన్ని సర్కారు దుకాణాల్లో దర్శనం ఇచ్చాయి. మద్యం ఏమాత్రం నాణ్యత లేదని విమర్శలు వెల్లువెత్తినా అమ్మకాలు ఆగలేదు. బ్రాండ్‌లు మార్చలేదు. ఇదే పనిగా చీప్‌ లిక్కర్‌ కూడా దాదాపు అన్ని చోట్ల యఽథావిధిగానే అమ్మకాలు సాగాయి. ఇప్పటికే అవే బ్రాండ్‌లను గడిచిన మూడు నెలలుగా దఫదఫాలుగా సేకరిస్తూ వచ్చారు. అధికార వైసీపీ వర్గానికి చెందిన మద్యం ఎత్తుగడ వేరే. ఎవరికి అనుమానం కలగకుండా కొంచెం కొంచెం ఆ తర్వాత ఇంకొంచెం పెంచి స్టాక్‌ను మండలాల వారీగా తమకు అనుకూల నేతలు గృహాల్లో, చేపలు చెరువుల పాకల వద్ద, కొందరు సామాన్య కార్యకర్తల ఇళ్లల్లోనూ దాచేశారంటూ ఇప్పటికే ప్రచారం గుప్పుమంటోంది. ప్రత్యేకించి ఈ ఎన్నికల వేళ తమ వెంట నడిచేవారిలో అత్యధికులకు క్వార్టర్‌ + 500 చేతిలో పెడుతూ జెండాలు పట్టించి బలనిరూపన చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో ఈజోష్‌ ఎక్కువగా ఉంది. ఏలూరు జిల్లా ప్రాంతాల్లో వీలైనంత మేర మద్యంను ఎక్కడిక్కక్కడ నిల్వ చేసేందుకు ప్రయత్నించారు.

ఒక్కొక్క నియోజకవర్గానికి అరకోటి పైనే..

అయా నియోజకవర్గంల్లో ప్రధాన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే మద్యం నిల్వలకు పాల్పడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడూ మాదిరిగానే తొలి విడతలోనే ఎన్నికలు పూర్తవుతాయని భావించి ఆ మేరకు టిక్కెట్‌ ఖాయమనుకున్నవారంతా షెడ్యూలుకు ముందే ‘మందు జాగ్రత్త’లు తీసుకున్నారు. ఎక్కడా కాలు కదపకుండా మద్యం దుకాణాల్లోనే ఏరోజు కారోజు తక్కువ మొత్తంలో క్వార్టర్‌ బాటిళ్లను నిల్వ చేస్తూ వచ్చారు. ఎవరికి అనుమానం రాకుండా మండల స్థాయి నేతలు ఎక్కడికక్కడ సరి చేసుకునేలా జాగ్రత్తపడినట్టు ఆరోపణలు లేకపోలేదు. ఈ క్రమంలోనే ఖమ్మం సరిహద్దున, తెలంగాణ ప్రాంతాల్లోనూ అధికారులు నిఘా ఉంచినా చీకటి మాటున వ్యవహారం సరిపెట్టారు. చింతలపూడి నియోజకవర్గానికి ఖమ్మం జిల్లా నుంచి ఎటువంటి ఆధారాలు లేకుండా రఽశీదులు లేకుం డా వచ్చిన మద్యం వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభు త్వం మద్యం దుకాణానికి సంబంధించిన సరుకుగా అప్పట్లో వదంతులు విన్పించాయి. అవి నిజమో కాదో తెలియక ఆ వ్యవహారం ముగిసింది. ఇంకోవైపు నూజివీడు ప్రాంతా ల్లోనూ ఈ తరహా మద్యం భారీ ఎత్తున సరిహద్దును దాటుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితిని గమనించి ఎస్‌ఈబీ అధికారులు నియోజక వర్గాల్లో తరచూ దాడులు నిర్వహించారు. ఇంత చేస్తున్న సరే మా సరుకు మాకు వచ్చేసింది.. అంటూ కొందరు నేతలు ఇప్పటికే సంతృప్తిగా ఉన్నారు. మే 13న పోలింగ్‌ జరగనున్నందున అప్పటికి అవసరమైన సరుకును గ్రామాలు వారీగా తరలిస్తారని చెబుతున్నారు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇప్పుడిప్పుడే నేతలు కొందరు విలక్షణ వేషాలకు దిగుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలో ్ల ఓటర్ల ఆకర్షించడానికి శ్రీరామ నవమి రోజున కొందరు పుచ్చకాయలు, కూల్‌డ్రింక్‌లు ఎలా పంపిణీ చేశారో ఆ తరహాలోనే పోలింగ్‌కు ముందు నాడు ఓటర్లకు ప్రత్యేకించి తమ అయిన వారికి, పార్టీకి అత్యంత ఇష్టులకు పంపించేలా మద్యం అందించబోతున్నట్టు చెబుతున్నారు. ఈ లెక్కన ప్రతీ నియోజకవర్గంలో ఒక్క అభ్యర్థి 25 నుంచి 45 లక్షలు మేర ఒక్క మద్యం నిల్వలకే బడ్జెట్‌ పెట్టుకున్నట్టు ఇప్పటికే గుప్పుమంటోంది. సాధారణంగా కొన్నివర్గాల వారికి ప్రచారంలోనూ, ఆఖరికి పోలింగ్‌ కౌంటింగ్‌ రోజున కిక్‌ ఉండాల్సిందే. ఈ తరహా పద్ధతి అనుసరించడానికి అన్ని పార్టీ అభ్యర్థులు ముందుకు దూకుతున్నారు.

Updated Date - Apr 21 , 2024 | 12:02 AM

Advertising
Advertising