ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మామిడి చేదు

ABN, Publish Date - Nov 20 , 2024 | 01:05 AM

నూజివీడు పేరు చెప్తే గుర్తుకు వచ్చేది నవ రసాల మామిడి. నూజివీడు మామిడికి మంచి గిరాకీ. కానీ ఇక్కడ మామిడి తోటలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.

తొలగిస్తున్న మామిడి తోటలు

పూత సీజన్‌లో మామిడి తోటల తొలగింపు

విస్తరిస్తున్న పామాయిల్‌, కొబ్బరి, మొక్కజొన్న

(నూజివీడు టౌన్‌)

నూజివీడు పేరు చెప్తే గుర్తుకు వచ్చేది నవ రసాల మామిడి. నూజివీడు మామిడికి మంచి గిరాకీ. కానీ ఇక్కడ మామిడి తోటలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్‌ పరిధిలో దాదాపు 40 వేల హెక్టార్ల లో మామిడి సాగులో ఉంది. దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న తెగుళ్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతు నష్టాల్లో కూరుకుపోయాడు. ఫలితంగా మామిడిస్థానంలో పామాయిల్‌, కొబ్బరి, మొక్కజొన్న సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలో ఏటా దాదాపు 500 ఎకరాల మామిడి తోటలను తొలగిస్తున్నారు.

తొలగింపు కారణాలు ఎన్నో

నూజివీడు మామిడి నాణ్యత క్రమేణా తగ్గడంతో మార్కెట్లో గిరాకీ తగ్గింది. నూజివీడు ప్రాంతంలో బంగినపల్లితో పాటు తోతాపురి (కలెక్టర్‌) చెరుకు రసం, చిన్న, పెద్ద రసాలు విస్తారంగా సాగులో ఉన్నాయి. మామిడిపై రాతిమంగు, బూడిదతెగులతో పాటు ఇటీవల కోడిపేను ఉధృతితో దిగుబడి పై తీవ్ర ప్రభావం పడింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మామిడి పేరు చెప్తే నూజివీడుతో పాటు చిత్తూరు, పలాస ప్రాంతాలు మాత్రమే మామిడి సాగుకు కేంద్రంగా ఉండేవి. అనంతరం తెలంగాణ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మామిడిసాగును విస్తారంగా చేపట్టడంతో నూజివీడు ప్రాంత మామిడికి గిరాకీ తగ్గింది.

పెరుగుతున్న ఇతర పంటలు

మామిడి రైతులు పామాయిల్‌, కొబ్బరిసాగుకు ఆసక్తి కనబ రుస్తున్నారు. పామాయిల్‌కు గతంలో తెలుగుదేశం పాలన, ప్రస్తుత కూటమి పాలనలో మద్దతు ధర లభిస్తుండడంతో మామిడి స్థానంలో పామాయిల్‌ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహ కాలతో ప్రతి మండలంలో ఏటా 500పైగా ఎకరాల్లో మామిడి తోటలు కనుమరుగై పామాయిల్‌ సాగులోకి వస్తుంది. కొబ్బరి సాగు, ఖాళీగా ఉన్న భూముల్లో మొక్కజొన్న సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. నూజివీడు ప్రాంతం విత్తన ఉత్పత్తికి అనుకూల ప్రాంతంగా కంపెనీలను గుర్తించడంతో విత్తన మొక్కజొన్న, విత్తన పత్తి సాగుకు కంపెనీల పెట్టుబడితో నూజివీడు మామిడికి వ్యతిరేకంగా ప్రభావం చూపుతోంది.

Updated Date - Nov 20 , 2024 | 01:05 AM