ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివాహం.. ఆడంబరం

ABN, Publish Date - Dec 08 , 2024 | 12:53 AM

రెండు జీవితాలు కలయిక వివాహ బంధం. యుక్త వయస్సు వచ్చిన అమ్మాయి అబ్బాయి కలిసి పయనించడానికి పెద్దలు చూపిన మార్గమే వివాహం.

వివాహాలకు మూడేళ్లలో 50 శాతం పెరిగిన ఖర్చు

కనిష్ఠం రూ.5 లక్షలు.. గరిష్ఠం రూ.30 లక్షలు

ధనిక వర్గాల ఇళ్లలో పెళ్లి ఖర్చులకు ఎల్లలు లేవు

ఎగువ, మధ్య తరగతుల్లో పిల్లలదే పెళ్లి పెత్తనం

పెళ్లి భోజనాల ఖర్చు తడిసిమోపెడు

రెండు జీవితాలు కలయిక వివాహ బంధం. యుక్త వయస్సు వచ్చిన అమ్మాయి అబ్బాయి కలిసి పయనించడానికి పెద్దలు చూపిన మార్గమే వివాహం. మనసు ఎదిగిన వ్యక్తితో నడవాలని అమ్మాయిలు అనుకూలమైన యువతి కావాలని అబ్బాయిలు భాగస్వామి ఎంపికలో పరిణతితో వ్యవహరిస్తారు. కన్నవారిని కష్టపెట్టకుండా తాము ఇష్టపడ్డవారిని వివాహం చేసుకుంటూ నేటి వ్యవస్థలో అధిక శాతం యువత ఆదర్శంగా నిలుస్తున్నారు. అదే సమయంలో వివాహ వేడుకల్లో ఆధునిక పోకడలు ఆడంబరంగా మారాయి. జీవితంలో గుర్తుండిపోయేలా వివాహ వేడుకకు స్తోమతుకు మించి ఖర్చు చేస్తున్నారు. ఉన్నత వర్గాల వారి పెళ్లి వేడుక, ఖర్చు అంబరాన్ని అంటుతోంది. మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలతో పాటు పేదింట వివాహ ఆడంబరాలపై ఈ ఆదివారం ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

పాలకొల్లు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు వివాహంతో ఆయా కుటుంబాల ఆర్థిక నేపథ్యాల అనుగుణంగా జరిగేది. ఇప్పుడు విపరీత పోకడలతో పేద, మధ్య తరగతుల కు టుంబాలలో పిల్లల వివాహలు ఆడంబరంగా చేసి అప్పులు పాలవుతున్నారు. కార్మిక వర్గాలలో కని ష్ఠంగా వివాహ ఖర్చు రూ.5 నుంచి 10లక్షలు అవుతోంది. దిగువ మధ్య తరగతి కుటుంబాలలో వివాహానికి రూ.10 నుంచి 15లక్షలు ఖర్చు చేస్తు న్నారు. మధ్య తరగతి కుటుంబాలలో రూ.15 నుంచి రూ.20 లక్షలు, ఎగువ మధ్య తరగతి కుటుంబాలలో పెండ్లి ఖర్చు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు అవుతోంది. సంపన్న వర్గాలలో పెళ్లి ఖర్చుకు ఎల్లలు ఉండడం లేదు.

పెళ్లి వేడుక కూడా హోదా..

నేటి ఆధునిక పోకడలలో వివాహం అనేది సాంప్రదాయమే కాకుండా స్టేటస్‌ సింబల్‌గా మారింది. తమకు నచ్చినట్లు పెళ్లి చేయాలని వధూవరులు కోరుతుంటే తల్లిదండ్రులు వ్యతిరే కించినప్పటికీ చివరకు పిల్లలు అభీష్టం మేరకు వివాహాలు చేస్తున్నారు. గడిచిన మూడేళ్లలో పోలిస్తే వివాహ ఖర్చు 50శాతం పెరిగింది. వివిధ సర్వేలు ప్రకారం ఏటా దేశంలో కోటి పైగా వివాహాలు జరుగుతుంటే రూ.6లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

యువతదే ఇష్టం

మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలలో వివాహ ఖర్చులను విశ్లేషిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రంగాలలో రెండు చేతులా సంపాదిస్తున్న యువత తామే ఖర్చును భరిస్తూ, వివాహ కన్వెన్షన్‌ సెంటర్లను తీసుకొని దగ్గరుండి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తగ్గేదేలే..

వివాహం, రిసెప్షన్‌ భోజనాలలో తగ్గేదే లేదంటూ ఖర్చు చేస్తున్నారు. ఉన్నత వర్గాల వివాహ విందు డైనింగ్‌ రూమ్‌లు కళ్లు చెదిరే హంగులతో ఉంటాయి. పలు రకాల ఖరీదైన పదార్థాలతో విందు సిద్ధం చేస్తారు. పేద వర్గాలలో సైతం జీడిపప్పు లేనిదే వంటకం లేదని పెళ్లి భోజనంలో నిరూపిస్తున్నారు. జీడిపప్పు వినియోగించడంతో ఇప్పుడు కిలో జీడిపప్పు ధర రూ.600 నుంచి రూ.వెయ్యికి పెరిగింది. స్వీటు, హాటు తాహతు మించి ఏర్పాటు చేస్తున్నారు. ఈవిధంగా పేదవర్గాలలో పెళ్లి విందుకు కేవలం ఒక జీడిపప్పుకే 5కిలోలు కొనుగోలు చేస్తే గరిష్ఠంగా సంపన్న శ్రేణులతో 100 కిలోలు జీడిపప్పును వినియోగిస్తున్నారు. విందు సమయంలో ఆహార వృథాను అరికట్టలేకపోతున్నారు. నలుగురూ గొప్పగా చెప్పుకోవాలనే భావనతో స్తోమతను మించి ఖర్చు చేస్తున్నారు.

ఆనక అప్పులే..!

ఇప్పుడు పేద వర్గాలు మొదలుకొని మద్య తరగతి స్థాయి వరకూ పెళ్లి వేడుకలు అయిన తర్వాత చిట్టా తీస్తే అప్పులే మిగులుతున్నాయి. రైతువారీ కుటుంబాలలో పొలాలు అమ్మితే ఉద్యో గులు వ్యక్తిగత రుణాలు, వ్యాపారులు ప్రైవేటు అప్పుల వైపు దృష్టి సారిస్తున్నారు. మొత్తంగా నవంబరు, డిసెంబరు నెలల్లో దేశవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న అర కోటి పైబడిన వివాహాలలో 60శాతం పెండ్లి వేడుకలు అప్పులతోనే మిగులుతున్నాయి.

విందు వైభవం

వివాహాలకు నవకాయ వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. పొటోగ్రఫీ పెళ్లి మండపం అలంకరణలకే లక్షలాది రూపా యలు వెచ్చిస్తున్నారు. పేద మధ్య తరగతి వర్గాలలో విందు భోజనానికి ప్లేటుకు రూ.200 ఖర్చు చేస్తుంటే ఎగువ మధ్య తరగతి సంపన్న వర్గాలలో ఒక ప్లేటు భోజనానికే రూ.2వేలు ఖర్చు చేస్తున్నారు. ఒకరు పాతిక రకాలు వంట కాలు వడ్డించామంటే మరొకరు 50 పైబడే వంటకాలు వడ్డించామని గొప్పలు చెప్పుకుం టున్నారు. భోజనశాల అలంకరణ కూడా జిగేల్‌మనాల్సిందే. పెండ్లి ఆహ్వాన పత్రికలు సైతం లక్షలు ఖర్చు చేస్తున్నారు. వివాహ పత్రిక వివాహ వేడుక దర్జాను ముందుగానే చాటుతాయి. బహుమతులు అందజేస్తున్నారు. వరుడికి కట్నం ప్రసక్తి మాట ఎలాగున్నా అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు సమాన వాటా డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రి వెడ్డింగ్‌ షూట్‌

ఇటీవల గ్రామాలకు చేరువగా ఉన్న పట్టణాలలో సైతం ప్రి వెడ్డింగ్‌ షూట్‌ సాధారణం అయింది. వధూవరులకు ఫొటోలు తీయడం మాత్రమే కాదు. ప్రి వెడ్డింగ్‌ షూట్‌కు ఖర్చుకు వెనకాడడం లేదు. కొన్నిచోట్ల భారీ సెట్టింగ్‌లు వేస్తుంటే.. మరి కొందరు షూటింగ్‌ నిమిత్తం లక్షలు ఖర్చు చేస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలు వినియోగించి ప్రత్యేక ఫొటోలు, వీడియోలు తీయిస్తున్నారు. ముందుగా వివాహ నిశ్చితార్ధం ఖర్చులు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇక బ్యాచిలర్‌ పార్టీ, మెహెందీ, పెళ్లి రిసెప్షన్‌ ఖర్చు సరేసరి. ఇదంతా హోదా చాటుకునే ప్రయత్నమే. సంప న్న వర్గాలు ఎగువ, మధ్య తరగతి వర్గాలలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ పేరుతో విదేశాలలో రిసార్ట్‌లలో వివాహ వేడుకలు నిర్వహిస్తు న్నారు. దగ్గరి బంధువులు, స్నేహితులతో వేడు కగా నిర్వహిస్తున్నారు.

అమ్మాయి పెళ్లికి అర ఎకరం అమ్మకం..!

పాలకొల్లు మండలంలోని ఒక గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (పేరు మార్చడమైనది) డిగ్రీ చదివిన తన కుమార్తె వివాహం కాస్త ఆడంబరంగానే చేశారు. రూ.30లక్షలు ఖరీదు చేసే అర ఎకరం పొలం అమ్ముదామంటే సమయానికి బేరాలు రాలేదు. పొలంపై రూ. 15 లక్షలు నూటికి రూ.3 చొప్పున అప్పు తె చ్చారు. అప్పు ఇప్పించిన మీడియేటర్‌కు 5 శాతం కమీషన్‌, అప్పు ఇచ్చిన ఆసామికి భూమి అమ్మినట్టు రిజిష్ట్రేషన్‌ చేయడానికి రూ.50 వేలు, రెండు నెలల ముందస్తు అడ్వా న్స్‌ రూ.90వేలు. మొత్తం కలిపి రూ.2.15 లక్షలు మినహాయించుకుని రూ.12.85 లక్షలు సొమ్ము చేతిలో పడింది. పెళ్లి తంతు పూర్తి చేశాక మొదలయ్యాయి వెంకటేశ్వర్లు కష్టాలు. రూ.30లక్షలు ఖరీదు చేసే పొలం కొనే నాథుడు లేడు. అప్పు తీరే మార్గమూ లేదు.

పెళ్లికోసం పర్సనల్‌ లోన్‌!

భీమవరం ప్రాంతానికి చెందిన నాలుగో తరగతి ఉద్యోగి కనకారావు కుమార్తె వివాహా నికి రూ.10 లక్షలు బ్యాంకులో పర్సనల్‌ లోన్‌ తీసుకున్నాడు. ఒకవైపు హౌసింగ్‌ లోన్‌ ఈఎంఐ. మరోవైపు పర్సనల్‌ లోన్‌ ఈఎంఐ, ఇంకా పెళ్లికి తెచ్చిన చిల్లర అప్పులపై వడ్డీలు వెరసి అనారోగ్యం పాలు చేశాయి. ఇప్పుడు ఆ కుటుంబం తీవ్ర మనోవేదనలో ఉంది. పేద మధ్య తరగతి వర్గాలలో పెండ్లి వేడుకలకు స్థాయికి మించి ఖర్చు చేసి అప్పులు పాలై ఆనక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పుడు జరుగు తున్న కళ్యాణ వేడుకలలో 30శాతం పైబడి వివాహలు అప్పులతోనే నడుస్తున్నట్లు వివిద సర్వేలు ద్వారా వెల్లడయ్యింది.

Updated Date - Dec 08 , 2024 | 12:53 AM