ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా మావుళ్లమ్మ జ్యేష్టమాస జాతర

ABN, Publish Date - Jun 28 , 2024 | 12:15 AM

నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, మావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అమ్మవారి జ్యేష్టమాస జాతరను వైభవంగా నిర్వహించారు.

ఆలయం వద్ద సందడి

ఉత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు

ఆకట్టుకున్న కళాకారుల వేషధారణలు

భీమవరంటౌన్‌, జూన్‌ 27 : నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, మావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అమ్మవారి జ్యేష్టమాస జాతరను వైభవంగా నిర్వహించారు. ఆసాదుల నృత్యాలు, బుట్టబొమ్మలు, డప్పు కళాకారులు, వేంకటేశ్వరస్వామి వేషధారణ, ఫుల్‌ బ్యాండ్‌ ట్రూపుతో ఉత్సవాన్ని నిర్వహించారు. తొలుత ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. అనంతరం గ్రామోత్సవానికి ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని అలంకరించి ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. కొబ్బరికాయ కొట్టి ఉత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దేవస్థానం తరపున రెండు లక్షల రూపాయలను ఉత్సవాల నిమిత్తం నిర్వాహకులకు ఆయన అందజేశారు. ఆయనతో పాటు జనసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు పూజలు చేశారు. కార్యక్రమంలో కోళ్ళ నాగేశ్వరరావు, రామాయణం గోవిందరావు, తూటరాపు ఏడుకొండలు, కొప్పుల రంగారావు, రామాయణం సత్యనారాయణ, రామాయణం సత్యనారాయణ, మానేపల్లి భాస్కరరావు, రామాయణం శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణమూర్తి, వబిలిశెట్టి రామకృష్ణ, కాగిత వెంకటరమణ, బుద్ధ మహాలక్ష్మి, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామోత్సవం మోటుపల్లి వారి వీధి మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగి ఆలయానికి చేరుకుంది.

Updated Date - Jun 28 , 2024 | 12:15 AM

Advertising
Advertising