ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ రహదారి విస్తరణకు చర్యలు

ABN, Publish Date - Dec 11 , 2024 | 12:33 AM

జాతీ య రహదారి విస్తరణకు కృషి చేస్తున్నామని, ప్రజలు, రైతులు సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి అన్నారు. భుజబలపట్నం, గోపవరం గ్రామాల్లో 165వ జాతీయ రహదారి విస్తరణ పనులను మంగళవా రం ఆమె పరిశీలించారు.

భుజబలపట్నంలో జాతీయరహదారి పరిశీలిస్తున్న జేసీ ధాత్రిరెడ్డి

జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి

కైకలూరు, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): జాతీ య రహదారి విస్తరణకు కృషి చేస్తున్నామని, ప్రజలు, రైతులు సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి అన్నారు. భుజబలపట్నం, గోపవరం గ్రామాల్లో 165వ జాతీయ రహదారి విస్తరణ పనులను మంగళవా రం ఆమె పరిశీలించారు. భుజబలపట్నంలో నివాసాలకు ఇబ్బందులు లేకుండా రహ దారి వెడల్పును కుదించినట్లు ఎన్‌హెచ్‌ అధికారులు జేసీకి వివరించారు. 2021 నుంచి పలుచోట్ల రైతులు కోర్టులు ఆశ్రయించడంతో పనులు ఆలస్యమైనట్లు తెలిపారు. కోర్టు పరిధిలో వివాదాలన్నీ తొలగి నట్లు వివరించారు. భుజబలపట్నంలో రహదారి విస్తరణకు పలు గృహాలకు ఇబ్బందులు కలుగు తోంది. స్వచ్ఛందంగా రహదారి అభివృద్ధికి సహక రిస్తామని స్థానికలు హామీ ఇచ్చారు. జేసీ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ పామర్రు నుంచి దిగమర్రు వరకు మూడు భాగాలుగా విభజించి ముగ్గురు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని, త్వరలోనే పనులను ప్రారంభిస్తారన్నారు. గృహ యజమా నులకు ప్రభుత్వం నుంచి పరిహారం కావాల్సి ఉం టే మూడు రోజుల్లో సమగ్ర వేదికను అందజే యాలని ఎన్‌హెచ్‌ అధికారులను జేసీ ఆదేశిం చారు. శింగాపురం నుంచి భుజబలపట్నం వరకు పనులు జరిగేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా భూసమస్య ఉంటే వెంటనే పరిష్కరి స్తామన్నారు. భూములు అప్పగించిన రైతులు, ఇళ్ల యజమా నుల నుంచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్‌ డీఈ సత్య నారాయణ, తహసీల్దార్‌ ఎండీ ఇబ్రహీం, పెన్మెత్స త్రినాఽథరాజు, కృష్ణంరాజు, పేరిచర్ల ప్రసాదరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2024 | 12:33 AM