ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద వైద్యాధికారుల ధర్నా

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:47 AM

పీజీ వైద్య విద్య అడ్మిషన్లలో ఇన్‌సర్వీస్‌ కోటా కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యాధికారులు ఈనెల 14 నుంచి చేపట్టిన దశలవారీ ఆందోళనను తాజాగా జిల్లా స్థాయికి విస్తరించారు.

డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్న వైద్యాధికారులు

ఏలూరు అర్బన్‌, సెప్టెంబరు 20 : పీజీ వైద్య విద్య అడ్మిషన్లలో ఇన్‌సర్వీస్‌ కోటా కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యాధికారులు ఈనెల 14 నుంచి చేపట్టిన దశలవారీ ఆందోళనను తాజాగా జిల్లా స్థాయికి విస్తరించారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రధానంగా ఆటంకంగా వున్న జీవో 85ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ జిల్లా లోని గ్రామీణ ప్రాంత పీహెచ్‌సీల వైద్యాధికారులు శుక్రవారం నుంచి ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయితే కార్యాలయ విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ డీఎంహెచ్‌వో కార్యాలయ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్నా లేదా నిరసన ప్రదర్శనలకు అనుమతిలేనందున టెంట్‌లను తొలగించాల్సిందిగా పోలీసులు హెచ్చరించడంతో బహిరంగ ప్రదేశంలోనే వైద్యాధికారులు నినాదాలతో ప్రదర్శనలు నిర్వహించారు. మరోవైపు డాక్టర్ల సమ్మె కొనసాగుతుండడంతో పల్లెప్రాంతాల్లో వైద్యసేవలు స్థంభిస్తున్నట్టు సమాచారం అందు కున్న వైద్యఆరోగ్యశాఖ ఎట్టకేలకు అప్రమత్తమైంది. అందుబాటు లో వున్న డాక్టర్లను మండలానికి ఒకరు వంతున డిప్యుటేషన్లపై తాత్కాలికంగా విధులు కేటాయించింది. శుక్రవారం జిల్లాలో మొత్తం 128 వైద్యాధికారులకు గాను కేవలం 36 మంది విధు లకు హాజరయ్యారని, మిగతా వారంతా సమ్మెలో పాల్గొంటు న్నట్టుగానే భావిస్తున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ శర్మిష్ట తెలి పారు. అయితే మండలానికి ఒకరు వంతున తాత్కాలికంగా విధులు కేటాయించిన డాక్టర్లు ఆయా పీహెచ్‌సీల్లో ఎప్పుడు అందుబాటులో ఉంటారో స్పష్టతలేదు. క్షేత్రస్థాయి నుంచి అందు తున్న సమాచారం ప్రకారం రోగాలు, జబ్బులతో వచ్చేవారికి పీహెచ్‌సీల్లో స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లతోనే ‘వైద్య సలహాలు’ ఇప్పిస్తున్నారని తెలుస్తోంది. .

నేటి నుంచి కార్యాచరణ అమలు

డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద వైద్యాధికారులు చేపట్టిన ధర్నాలో ఏపీ పీహెచ్‌సీల డాక్టర్ల సంఘం (ఏపీపీహెచ్‌సీడీఏ) జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూర్ణచంద్రకుమార్‌ మాట్లాడుతూ ఆందోళనను రాష్ట్రస్థాయి నుంచి అన్ని జిల్లాలకు వికేంద్రీకరించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని వివరించారు. ఇందులో భాగంగా శనివారం నుంచి ప్రభుత్వానికి పంపాల్సిన అన్ని వైద్య కార్యక్రమాలు, పథకాల నివేదికలను సస్పెండ్‌ చేస్తామని, ఇప్పటివరకు పీహెచ్‌సీల్లో అందించిన అత్యవసర వైద్యసేవలను సైతం నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు. డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద చేప ట్టిన ఆందోళనను శాంతియుతంగానే నిర్వహిస్తున్నా అనుమతు లు లేవంటూ వైద్యాధికారులను అణగదొక్కాలని ప్రయత్నించ డం హాస్యాస్పదమన్నారు. ఇటువంటి చర్యలు ఆందోళనను మరింత ఉధృతం చేయడానికే దారి తీస్తాయని హెచ్చరించారు. ఆదివారం కూడా ధర్నా కొనసాగుతుందని, సోమవారం చలో విజయవాడ నిర్వహిస్తామని, ప్రభుత్వం అప్పటికీ స్పందించ కుంటే 24న అత్యవసర సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఇన్‌సర్వీస్‌ ఎంబీబీఎస్‌ వైద్యాధికా రులకు కొనసాగిస్తున్న కోటాప్రకారమే పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. శనివారం నుంచి ఆందోళనకు జిల్లాలోని ఏజెన్సీప్రాంత మండలాల పీహెచ్‌ సీల వైద్యాధికారులు కూడా హాజరవుతారని వివరించారు. కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయ కుండా విధులు నిర్వర్తించిన వైద్యాధికారులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ధర్నా అనంతరం డీఎంహెచ్‌వో డాక్టర్‌ శర్మిష్టకు వినతిపత్రాన్ని అందజేశారు.

Updated Date - Sep 21 , 2024 | 12:47 AM