కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:25 AM
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ పెద్దఎత్తున నిధుల కేటాయిస్తోందని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపా రు.
యలమంచిలి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ పెద్దఎత్తున నిధుల కేటాయిస్తోందని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపా రు. మండలంలోని బూరుగుపల్లి, దొడ్డిపట్ల గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడా రు. ఈ రెండు గ్రామాల్లో రూ.35లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల పనులకు జడ్పీ ఛైర్‌పర్సన్ జి.పద్మశ్రీ, కలెక్టర్ నాగరాణిలతో కలిసి ఆయన భూమిపూజ నిర్వహించారు. అనంతరం దొడ్డిపట్ల హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యంచేసి సర్పం చ్‌లను భిక్షాటన చేసేలా చేస్తే.. నేటి ఎన్డీఏ ప్రభుత్వం పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి నిచ్చిందన్నారు. పోలవరం కాల్వపై జగన్ ఐదేళ్ల పాలనలో ఒక అరబస్తా సిమెంటుగానీ, ఒక రూపాయి గానీ ఖర్చుపెట్టని జగన్‌కు పోలవరం కాల్వపై మాట్లాడే అర్హత ఎక్కడుందని ప్రశ్నిం చారు. ఎంతఖర్చు అయినా వెనుకాడకుండా ఉత్తరాంరఽధకు తాగునీరు, సాగునీరు అందించా లనే లక్ష్యంతో చంద్రబాబు పోలవరం కెనాల్ పనులను ప్రారంభిస్తున్నా రన్నారు. ప్రధాని మోదీ సహాయసహకారాలతో ముఖ్యమంత్రి చం ద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకు సాగుతోందన్నారు. అనంతరం జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ గ్రామాల ప్రగతే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పల్లెసీమలను ప్రగతిబాటలో నడిపేందుకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఆర్డీవో దాసి రాజు, సర్పంచ్‌లు చెల్లుబోయిన ప్రమీల, చెల్లింకుల లక్ష్మి, మామిడిశెట్టి పెద్దిరాజు, బోనం నాని, బన్ని వాసు, బోనం చినబాబు, ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆరుమిల్లి రామశ్రీనివాస్, మాతా రత్నంరాజు, బొప్పన హరికిషోర్, పీతల శ్రీను, రుద్రరాజు సత్యనారాయణరాజు, ఎంపీడీవో ఎన్.ప్రేమాన్విత, తహసీల్దార్ జి.పవన్‌కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 12:25 AM