ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్తి వివాదం.. తల్లీ కొడుకు దారుణ హత్య

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:57 AM

మండవల్లి మండలం గన్నవరంలో శుక్రవారం రాత్రి తల్లి, కొడుకు దారుణ హత్యకు గురయ్యారు.

జంట హత్యలతో ఉలిక్కిపడిన గన్నవరం

మండవల్లి నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండవల్లి మండలం గన్నవరంలో శుక్రవారం రాత్రి తల్లి, కొడుకు దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదాలు కారణమని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. స్ధానికులు, పోలీసులు తెలిపిన వివరాలివి.. గ్రామానికి చెందిన రొయ్యూరు భ్రమరాంబ (60), ఆమె కుమా రుడు సురేష్‌ (35) శనివారం వేకువజామున వారి నివాసం వద్ద విగతజీవులు గా పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌, సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ రామచంద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. పోలీసు జాగిలాలను రప్పించగా అవి గ్రామంలోని పలు ప్రాంతాల్లో కలియదిరిగాయి. డీఎస్పీ మాట్లాడు తూ శుక్రవారం అర్ధరాత్రి గొంతును కత్తితో కోసి దుండుగులు హత్య చేసినట్టు గుర్తించామన్నారు. సమీప బంధువులతో ఆస్తి తగాదాలే హత్యకు కారణమని అనుమానిస్తు న్నట్టు తెలిపారు. మృతదేహాలను కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తర లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. సురేష్‌ భార్య, కుమార్తె ఊరెళ్లారు. ఇంట్లో తల్లి, కుమారుడు మాత్రమే ఉండడం గమనించి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. జంట హత్యలతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Updated Date - Nov 24 , 2024 | 12:57 AM