ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్ధరాత్రి చక్కర్లు కొట్టిన కారు

ABN, Publish Date - Nov 29 , 2024 | 12:28 AM

అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో కారులో ముగ్గురు యువకులు అనుమానా స్పదంగా తిరుగుతున్నారు.

ఏలూరులో గస్తీ పోలీసుల తనిఖీ

కారులో ముగ్గురు యువకులు, ఒక గన్‌

పోలీసుల అదుపులో యువకులు

రాజకీయ ఒత్తిడితో ఒకరిని వదిలేశారు?

కేసు నమోదు కాలేదు..!

ఏలూరు క్రైం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో కారులో ముగ్గురు యువకులు అనుమానా స్పదంగా తిరుగుతున్నారు. రాత్రి గస్తీ నిర్వహించే మహిళా ఎస్‌ఐకు అనుమానం వచ్చింది. సిబ్బందితో కారును చుట్టు ముట్టారు. ఆ కారులో ముగ్గురు యువకులు ఉండడం, వారి వద్ద ఒక గన్‌ కూడా ఉండడంతో అవాక్కయ్యారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు ఎవరు, అర్ధరాతి వేళ కారులో అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏమిటనే కోణంలో దర్యాప్తు చేపడుతున్న తరుణంలోనే రాజకీయ ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం.

అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఏలూరు కొత్తపేట ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఒక కారు అనుమానాస్పదంగా ఆగి ఉండడంతో మహిళా ఎస్‌ఐ తన సిబ్బందితో చుట్టుముట్టారు. ముగ్గురు యువకులు ఉండడం చూసి కారును తనిఖీ చేశారు. యువకుల వద్ద ఒక గన్‌ ఉండడంతో వెంటనే వారిని స్టేషన్‌కు తరలించారు. అది ఏ గన్‌ అన్నది పోలీసులు విచారణ జరపా ల్సి ఉంది. ఏ గన్‌ అయినప్పటికీ అర్ధరాత్రి వేళ ముగ్గురు యువకులు గన్‌తో తిరగడం చట్టరీత్యా నేరం. అది ఏ గన్‌ అనేది నిర్ధారించడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాజకీయ ఒత్తిళ్లతో ఆ ముగ్గరిలో ఒక యువకుడిని పంపించి వేసినట్లు సమాచారం. ఆ ముగ్గురు ఏలూరు రూరల్‌ ప్రాంతానికి చెందనివారై ఉండి అర్ధరాత్రి వేళ 1.30 గంటల సమయంలో కొత్తపేట ప్రాంతంలో మాటువేసి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. ఎవరినైనా కిడ్నాప్‌ చేయడానికి వచ్చారా, బెదిరించడా నికి వచ్చా మరేఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలను పోలీసులు బహిర్గతం చేయాల్సి ఉంది. ఆ గన్‌ కథ ఏమిటో ఉన్నతాధికారులే తేల్చాల్సి ఉంది. ఈ సంఘటనతో నగరంలో ఒక్కసారిగా నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏలూరు టూటౌన్‌ ప్రాంత పరిధిలో హోటల్‌లో ఒకరిని బెదిరించి, కిడ్నాప్‌ చేసి ఊరి చివరకు తీసుకువెళ్ళి గాలిలో కాల్పులు జరిపిన సంఘట నలు ఉన్నాయి. ఆ కేసులో నకిలీ ఐపీఎస్‌ అధికారిని, అతని ముఠాను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఎవరు, ఎందుకు ఆగన్‌ కలిగి ఉన్నారనేది ఉన్నతాధికారులే తేల్చి ప్రజలల్లో ఉన్న భయబ్రాంతులను తొలగించాల్సి ఉంది.

Updated Date - Nov 29 , 2024 | 12:28 AM