ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అవే కష్టాలు..!

ABN, Publish Date - May 16 , 2024 | 12:52 AM

ఓటు వేసేందుకు ఉత్సాహంగా స్వస్థలాలకు తరలివచ్చిన ఓటర్లకు తిరిగి వెళ్ళేందుకు చుక్కలు కనిపిస్తున్నాయి. రైళ్ళల్లో రిజర్వేషన్‌లు పుల్‌ అయ్యా యి.

ఏలూరు కొత్త బస్టాండులో విజయవాడ నాన్‌స్టాప్‌ టికెట్లు ఇచ్చే చోట బారులు తీరిన ప్రయాణికులు

తిరుగు ప్రయాణంలో ఓటర్లకు తప్పని తిప్పలు

సరిపడ బస్సులు ఏర్పాటు చేయని ఆర్టీసీ

ప్రైవేట్‌ బస్సులు ఛార్జీల బాదుడు

ఏలూరు రూరల్‌, మే 15 : ఓటు వేసేందుకు ఉత్సాహంగా స్వస్థలాలకు తరలివచ్చిన ఓటర్లకు తిరిగి వెళ్ళేందుకు చుక్కలు కనిపిస్తున్నాయి. రైళ్ళల్లో రిజర్వేషన్‌లు పుల్‌ అయ్యా యి. ఆర్టీసీ సరిపడా బస్సులు నడపడంలో విఫలమైంది. ప్రైవేట్‌ బస్సుల్లో ఛార్జీలు ఏకంగా 200 శాతంకు పైగా పెరిగాయి. ఓటు వేసేందుకు గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా ఓటర్లు తమ స్వస్థలాలకు తరలివచ్చారు. హైదరా ాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా తదితర నగరాలతో పాటు పలు రాష్ర్టాల్లో వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాల రీత్యా ఉంటున్న వారంతా ఓటు వేసేందుకు వచ్చారు. శని, ఆదివారాలు సెలవు కావడం, సోమవారం పోలింగ్‌ అవ్వడంతో ఓటు వేయడంతో పాటు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో గడిపే అవకాశం ఉంటుందనే భావనతో జిల్లాకు వచ్చారు. మంగళవారం తిరిగి వెళ్ళకూడదనే సెంటి మెంట్‌తో చాలామంది బుధవారం తిరుగుముఖం పట్టారు. ఏలూరు జిల్లాలోనే సుమారు 40 వేల మందికి పైగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు తరలి వచ్చినట్లు అంచనా. అయితే తిరిగి వెళ్లే సమయంలో వారికి ప్రయాణ పాట్లు తప్పలేదు. రైళ్ళల్లో రిజర్వేషన్లు పుల్‌ అయ్యాయి. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. స్వస్థలాలకు ఓటు వేసేందుకు వచ్చేవారి కోసం బస్సులు నడిపిన ఆర్టీసీ తిరిగి హైదరాబాద్‌ తదితర ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు సరిపడా బస్సులు నడపడంలో విఫలమైంది. ఏలూరు కొత్త బస్టాండు బుధవారం విజయవాడ, హైదరాబాద్‌ వెళ్ళేవారితో నిండి పోయింది. సరిపడా బస్సుల్లేక అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. దీంతో ప్రైవేట్‌ బస్సులపై ఆధారపడాల్సి వచ్చింది. ఇదే అదనుగా ప్రైవేట్‌ బస్సుల ఛార్జీలు భారీగా పెంచేశారు. సాధారణంగా రూ.వెయ్యి ఉండే హైదరాబాద్‌ టిక్కెట్‌ ధరను రూ.2 వేలకు పెంచేశారు.

Updated Date - May 16 , 2024 | 12:52 AM

Advertising
Advertising