ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నామినేటెడ్‌ పదవులపై అసంతృప్తి

ABN, Publish Date - Nov 16 , 2024 | 12:50 AM

నరసాపురం తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్‌ పదవుల అసం తృప్తి రాజుకుంటున్నది. సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు.

నరసాపురం టౌన్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): నరసాపురం తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్‌ పదవుల అసం తృప్తి రాజుకుంటున్నది. సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. వైసీపీ హయాంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి కేసులు ఎదుర్కొంటే పార్టీ అధికారంలోకి వచ్చినా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొన సాగుతున్న ఆ పార్టీ రాష్ట్ర అగ్ని కుల క్షత్రియ సాధికార కన్వీనర్‌ కొప్పాడ రవి రెండు విడతల నామినేటెట్‌ పదవుల జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు శుక్రవారం నియోజకవర్గ నేతలకు తెలియజేశారు. వారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. శనివారం తన రాజీనామాను పార్టీ అధిష్థానానికి పంపనున్నట్లు రవి తెలిపారు. మరోవైపు పార్టీ సీనియర్‌ నేత వాతాడి ఉమాకు అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి దక్కింది. దీనిపై ఆసక్తి చూపించడం లేదు. తనకు ఈ పదవి వద్దంటూ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రామరాజుకు స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానానికి తెలియజేశారు.

సర్వేల పేరిట పశు వైద్యానికి దూరం

భీమవరం రూరల్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): పశు సంవర్ధక శాఖలో పనిచేసే సహాయకులు సర్వేల పేరిట వెళుతుండడంతో పశు వైద్యానికి ఇబ్బందిగా మారింది. జిల్లావ్యాప్తంగా 180 మంది పనిచేస్తున్నారు. వీరికి గ్రా మాల వారీగా స్కిల్‌ సెన్సెక్స్‌ మాటాగింగ్‌, జియో హౌస్‌హోల్డ్‌ టాగింగ్‌, అపార్‌ సర్వేలను అప్పగించారు. ఫలితం గా వీరు పశువుల వైద్యానికి దూరమయ్యారు. గ్రామాల వారీగా పశువులకు పశు సంవర్ధకశాఖ సహాయకులు చేయాల్సిన ప్రాథమిక పనులు సగం సగంగానే జరుగుతున్నాయి. గ్రామాల్లో పశువులకందించే ప్రథమ చికిత్స, కృతిమ గర్భదారణ, సీజనల్‌ వ్యాక్సిన్‌లకు వారు అందు బాటులో ఉండడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:52 AM