కొల్లేరులో మరో వివాదం
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:55 PM
కొల్లేరు గ్రామమైన మొండికోడులో చేపల చెరువు విషయంపై వివాదం నెలకొంది.
చేపల పట్టుబడిని అడ్డుకున్న అధికారులు
ఏలూరు రూరల్, నవంబరు 5 (ఆంధ్ర జ్యోతి): కొల్లేరు గ్రామమైన మొండికోడులో చేపల చెరువు విషయంపై వివాదం నెలకొంది. నాలుగేళ్ళుగా చేపల సాగు చేస్తుండగా చేపల పట్టుబడి విషయంలో వివాదం తలెత్తింది. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు ఇది బిలో కాంటూరు పరిధిలో ఉందని, చేపలు పట్టడం నిషేధమంటూ చేపలు పట్టుబడిని అడ్డుకుని కేసులు నమోదు చేశారు. మొండికోడులో 22 ఎకరాలను ఏలూరు ఎంపీపీ శ్రీనివాసరాజు ఎకరాకు రూ.60వేలు చొప్పున నాలుగేళ్ళ పాటు లీజుకు తీసుకున్నారు. మూడు సంవత్సరాల రెండునెలలు పూర్తి అయింది. మొన్నటి వరకు శ్రీని వాసరాజు వైసీపీలో ఉండి ఇటీ వల ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. లీజుకు ఇచ్చిన వ్యక్తులు చెరువు ఖాళీచేసి ఇమ్మనడంతో మంగళ వారం ఉదయం చేపలు పట్టుబడి పడుతుండగా, రెవె న్యూ, ఫారెస్ట్ అధికారులు మొండి కోడు చేరుకుని చేపల పట్టుబడిని అడ్డుకు న్నారు. ఇది బిలో కాంటూరులో ఉందంటూ చేపల పట్టుబడి నిషేధమని శ్రీనివాసరాజు పై కేసు నమోదు చేసి వలలు, పడవను సీజ్ చేశారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి తదితరులు అక్కడకు చేరుకుని వివాదంపై ఆరా తీశారు. అయితే అదే ప్రాంతంలో 120 ఎకరాలు సాగులో ఉండగా, కేవలం తాను తీసుకున్న 22 ఎకరాల చెరువు విషయం పై పట్టుబడి పట్టక పోవడం కేవలం రాజకీయ కక్షలేనని ఎంపీపీ ఆరోపించారు.
Updated Date - Nov 05 , 2024 | 11:55 PM