ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అధికార బృందాల విస్తృత తనిఖీలు

ABN, Publish Date - Mar 26 , 2024 | 12:59 AM

జిల్లావ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక వైపు పోలీసులు, మరోవైపు ఎన్నికల తనిఖీల అధికార బృందాలు విస్తృతంగా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

ఏలూరు క్రైం, మార్చి 25 : జిల్లావ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక వైపు పోలీసులు, మరోవైపు ఎన్నికల తనిఖీల అధికార బృందాలు విస్తృతంగా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లాకు ఆనుకుని ఉన్న తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో ఉన్న చెక్‌పోస్టుల్లో 24 గంటలు నిరంతరం అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. చింతలపూడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అల్లిపల్లి, లింగగూడెం, టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లంకపల్లి, జీలుగుమిల్లి పరిధిలో తాటిఆకులగూడెం, వేలేరుపాడు పరిధిలో మేడేపల్లి, కుక్కునూరు పరిధిలో వేలేరు, చాట్రాయి పరిధిలో కృష్ణారావుపాలెం, పార్వతీపురం వద్ద చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు రహదారులు కలిపేవిగా ఉండడంతో అక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు ఆదేశాలతో ఎస్‌ఈబీ ప్రత్యేక బృందాలు జిల్లాలో అక్రమ మద్యం, సారా తయారీ, గంజాయి రవాణా కాకుండా ముందస్తుగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు తనిఖీలు చేస్తూ మద్యం కల్గిన పలువురిని అరెస్టు చేస్తున్నారు.

ఎన్నికల కోడ్‌ ఈనెల 16వ తేదీ నుంచి అమల్లోకి రావడంతో జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి. ఎన్నికల అధికారులుగా ఉన్న జిల్లా అధికారులు తమ బృందాలతో ఆకస్మికంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న ఎనిమిది చెక్‌ పోస్టులే కాకుండా జిల్లాలో పలు ప్రధానమైన రహదార్లలో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. వీటి వద్ద పోలీసులు, పలు శాఖల అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఎస్పీ పర్యవేక్షణలో ఇప్పటికే నిఘా బృందాలను రంగంలోకి దించారు. సమాచార సేకరణను చేపట్టారు. ఇంకోవైపు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌ వంటి మీడియా మాధ్యల్లో ఎవరైనా తప్పుడు సమాచారం పెడితే వెంటనే వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 24 గంటలు నిరంతరం మీడియా మాద్యమాలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో తనిఖీలు చేపట్టడమే కాకుండా వాహనాల రికార్డులు పరిశీలించడంతో పాటు, ఎవరైనా రూ.50 వేలకు మించి ఎక్కువ నగదు తీసుకువెళితే ధ్రువపత్రా లను చూపించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఏప్రిల్‌ 18 నుంచి తనిఖీలు ముమ్మరం

రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న వచ్చిన తరువాత తనిఖీల ప్రక్రియ వేగవంతం చేపడతానికి ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేశారు. జిల్లాకు వచ్చిన కేంద్ర పారామిలటరీ బలగాలను గ్రామాల్లో కవాతులు నిర్వహించారు. జిల్లా ఆర్మ్‌డ్‌ విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్‌ గార్డ్సును చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారుల్లో సంబం ధిత పోలీస్‌స్టేషన్‌ సీఐలు, ఎస్‌ఐలు తనిఖీలు చేపడుతున్నారు. ఏలూరు నగరంలో ఈ తనిఖీలను విస్తృతం చేశారు.

ఎనిమిది చెక్‌ పోస్టుల్లో నిరంతర సోదాలు : ఎస్పీ

జిల్లాలో గత ఏడాది డిసెంబరు డిసెంబరు 26 నుంచి 8 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సోమవారం రాత్రి తెలిపారు. ఆ చెక్‌పోస్టుల వద్ద 53 లక్షల 97 వేల రూపాయల నగదు, 1154.1 లీటరు మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎనిమిది లక్షల 87 వేల రూపాయలు విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 31 ఫ్లయింగ్‌ సెర్వెలన్స్‌ టీమ్‌లు జిల్లా మొత్తం తిరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకు పది లక్షల 36 వేల 710 రూపాయలు నగదు, 1,398 లీటర్ల మద్యం సీజ్‌ చేశామన్నారు. చెక్‌పోస్టుల ఏర్పాటు చేయడం లేదని దుష్ఫచారం జరుగుతుందని ఇది పూర్తిగా అవాస్ధమన్నారు.

సరిపల్లిలో రూ.87 వేలు స్వాధీనం

ఉంగుటూరు, మార్చి 25 : ఉంగుటూరు నియోజకవర్గంలోని సరిపల్లి గ్రామం వద్ద కర్నాటకకు చెందిన ఓ వ్యకి కారులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరాజు అనే వ్యక్తి నుంచి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం తనిఖీ చేయగా రూ.82 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రిటర్నింగ్‌ అధికారి ఖాజావలి తెలిపారు.

Updated Date - Mar 26 , 2024 | 12:59 AM

Advertising
Advertising