ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వృద్ధులకు ఊరట

ABN, Publish Date - Jun 25 , 2024 | 12:07 AM

వచ్చే నెల 1వ తేదీ న ప్రతి పేదవాడికి రూ.7 వేలు పింఛ న్‌ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

జూలై పింఛన్‌ రూ.7 వేలు

ఇంటి వద్దకే పంపిణీ.. జిల్లాకు రూ.150 కోట్లు

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, మెగా డీఎస్సీ

అన్నక్యాంటీన్ల పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

(భీమవరం–ఆంధ్రజ్యోతి):

పేదవర్గాలు ఆశతో ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. వచ్చే నెల 1వ తేదీ న ప్రతి పేదవాడికి రూ.7 వేలు పింఛ న్‌ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం చంద్రబాబు సంతకా లు చేసిన తొలి ఐదు పథకాలకు రాష్ట్ర కేబినెట్‌ చర్చించి ఆమోదముద్ర వేసింది. ప్రతీ నెలా వృద్ధులకు అందించే మూడు వేల రూపాయల పింఛన్‌ను వెయ్యి పెంచి నాలుగు వేలు అందించ నుంది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు కూడా వెయ్యి చొప్పున పెంచి జూలైలో ఏడు వేలు అందజేస్తామని చెప్పిన విధంగానే ఇవ్వనుంది. జిల్లాలోవున్న 4 వేల 200 మంది సచివాలయ సిబ్బంది ద్వారా వీటిని ఇంటింటికి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లాలో రెండు లక్షల 34 వేల మంది పెన్షన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులకు రూ.నాలుగు వేలు చొప్పున ఇస్తారు. దివ్యాంగుల పింఛన్‌ ఆరు వేలు చేశారు. ఏప్రిల్‌ నుంచి పెంచిన పెన్షన్‌ను అందజేస్తారు. దీంతో ఒక్కో దివ్యాంగునికి జూన్‌లో రూ.12 వేలు అంద నుంది. జిల్లావ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.69 కోట్ల వరకు పెన్షన్‌ కోసం ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వంలో పెంచిన పెన్షన్‌తోపాటు ఏరియర్స్‌తో కలిపి రూ.150 కోట్లు ఒకే నెలలో లబ్ధిదారులకు అందించనున్నారు.

మెగా డీఎస్సీ అమలులో భాగంగా జిల్లాలోని 16 వేల 137 పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రి మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే జోష్‌ మీద వున్న బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులంతా కోచింగ్‌ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గడిచిన ఐదేళ్ళలో ఒక్క డీఎస్సీ కూడా లేకపోవడంతో కోచింగ్‌ సెంటర్లు మూతపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ కోచింగ్‌ సెంటర్లు తెరుచుకుంటున్నాయి. జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లులోని తొమ్మిది అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కూడా ఆమోదముద్ర పడింది. కేవలం ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం పెడతారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని మంత్రి మండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో జగన్‌ బొమ్మలతో వున్న పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు చిరిగిపోనున్నాయి. కొత్తపాస్‌ పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇక మండల కేంద్రాలు, పట్టణాల్లోని యువత కోసం వృత్తి నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 25 , 2024 | 12:07 AM

Advertising
Advertising