ఉండి కేవీకేలో సేంద్రియ వ్యవసాయంపై ఆన్‌లైన్ కోర్సులు
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:10 AM
ఉండి కృషి విజ్ఞానకేంద్రంలో సేంద్రియ వ్యవసాయంపై ఆన్‌లైన్ ద్వారా నెలరోజులపాటు సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించడం జరుగు తుందని ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ మల్లిఖార్జునరావు తెలిపారు.
ఉండి సెప్టెంబరు 4 :ఉండి కృషి విజ్ఞానకేంద్రంలో సేంద్రియ వ్యవసాయంపై ఆన్‌లైన్ ద్వారా నెలరోజులపాటు సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించడం జరుగు తుందని ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ మల్లిఖార్జునరావు తెలిపారు. ఈ కోర్సు వ్యవధి నాలుగు వారాలు వుంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.1500 ఫీజు చెల్లించి కోర్సుకు పేరును నమోదు చేయించుకోవాలన్నారు. నమోదు చేయించుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ సదుపాయం కంప్యూటర్, సెల్ ఫోన్ కలిగి వుండాలన్నారు. ఈ సర్టిఫికెట్ కోర్సులు చేయాలనుకునే వారు సెప్టెంబరు 20వ తేదీలోపు పేర్లును నమోదు చేసుకోవాలని కోరారు. ఈకోర్సుకు సంబంధించి పూర్తి వివరాలు వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ సందర్శించి తెలు సుకోవచ్చుని తెలిపారు. .80087 88776, 83096 26619, 80960 85560. నంబ ర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వివరాలు తెలుసు కోవచ్చని మల్లికార్జునరావు తెలిపారు.
Updated Date - Sep 05 , 2024 | 12:10 AM