ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం.. ధరహాసం

ABN, Publish Date - Nov 05 , 2024 | 12:52 AM

ధాన్యం తూచిన రైతులకు నాలుగు గంట ల్లోనే సొమ్ములు జమ అవుతుండటంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు 4 (ఆంధ్ర జ్యోతి): ధాన్యం తూచిన రైతులకు నాలుగు గంట ల్లోనే సొమ్ములు జమ అవుతుండటంతో వారి ఆనందానికి అవధుల్లేవు. గత ప్రభుత్వ హయాం లో నెలల తరబడి ధాన్యం సొమ్ముల కోసం ఎదు రుచూసేవారు. ఇప్పుడు కూటమి సర్కారు రైతుల కు సకాలంలో సొమ్ములు వేస్తూ వారికి ఆసరాగా నిలుస్తోంది. పంట పెట్టుబడి, అప్పులు తీర్చుకు నేందుకు ఇదెంతో దోహదపడుతుందని భావిస్తు న్నారు. రానున్నది మంచి రోజులని భావిస్తున్నా రు. తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెం కు చెందిన రైతులు దేవళ్ల సుబ్బారావు 117 బస్తాలు ధాన్యం కొనుగోలు కేంద్రానికి సోమవా రం తూచిన నాలుగు గంటల్లోనే ఖాతాలో రూ. లక్షా ఏడు వేల 640 జమయ్యాయి. అతని భార్య వరలక్ష్మి పేరున 159(40 కేజీల) బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. ఆమె ఖాతా లో రూ.లక్షా 46 వేల 280 జమయ్యాయి. పెద తాడేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్ర యించిన రైతులకు తూసిన 12 గంటల్లోనే జమ కావడంతో ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సొమ్ములు వేయడానికి సిద్ధం

జిల్లాలో నాలుగు లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ 200 టన్నులు కొనుగోలు చేశారు. సొమ్ము సిద్దంగా ఉంచి మరీ కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రూ.20 కోట్ల వరకూ మిల్లర్లకు అందించారు. ప్రభుత్వం క్వింటాకు రూ.2,300 కనీస మద్దతు ధర అందించేందుకు 17 తేమశా తం కనిష్టంగా ఉండాలని అధికారులు సూచిస్తు న్నారు. కానీ తేమ శాతంలో కొంత వెసులుబాటు కల్పిస్తున్నారని రైతులే చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు తూసే బస్తాలు 40 కేజీల బస్తాలకు మద్దతు ధరకు అనుగుణంగా అందిస్తున్నారు.

‘ధాన్యం తూచిన నాలుగు గంటల్లోనే సొమ్ము జమ కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే పరి స్థితి కొనసాగిస్తే రైతులకు అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి తగ్గుతుంద’ని రైతు దేవళ్ల సుబ్బారావు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘తాడే పల్లిగూడెం మండలంలో తొలి ధాన్యం కొను గోలు కేంద్రాలను ప్రారంభించాం. ఇప్పటికే 124.5 టన్నులు కొనుగోలు చేసి సొమ్ములు జమ చేశాం. రాబోయే కాలంలో రైతులకు 48 గంటల్లోపు సొమ్ము అందించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మండల వ్యవసాయాధికారి ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ చెప్పారు.

Updated Date - Nov 05 , 2024 | 12:52 AM