ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీరాజ్‌ వ్యవస్థకు పూర్వ వైభవం

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:09 AM

గాడి తప్పిన పంచాయతీరాజ్‌ వ్యవస్థకు చికిత్స మొదలైంది. పూర్వ వైభవం సంతరించేలా కూటమి ప్రభుత్వం వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నది.

గాడి తప్పిన పంచాయతీరాజ్‌ వ్యవస్థకు చికిత్స మొదలైంది. పూర్వ వైభవం సంతరించేలా కూటమి ప్రభుత్వం వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులను సర్దుబాటు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే సచివాలయ కార్యదర్శులను పంచాయతీ కార్యదర్శులుగా బదిలీ చేసి, డీడీవోలుగా గుర్తింపునిచ్చింది. వారికి చెక్‌ పవర్‌ బాధ్యతలను అప్పగించి, సిబ్బంది వేతనాలను డ్రా చేసే అధికారాలను కల్పించింది.

సచివాలయ సిబ్బంది సర్దుబాటు

కార్యదర్శులకు పంచాయతీ బాధ్యతలు

మిగిలిన సిబ్బంది మాతృశాఖకు బదిలీ

ఇప్పటికే వలంటీర్‌ విధులు అప్పగింత

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 20: గత వైసీపీ ప్రభు త్వం పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలను ఏర్పాటు చేసి వాటిని నిర్వీర్యం చేసింది. సచివాలయాలే పౌర సేవలకు ఏకైక మార్గం అంటూ ప్రకటనలు చేస్తూ వచ్చింది. కానీ సచివాలయాలల్లో ఉన్న పది మంది సిబ్బందికి సరైన విధులు లేవు. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లు, డిజిటల్‌ అసిస్టెంట్లు వంటి కొందరికి మాత్రమే పూర్తిస్థాయిలో పని ఉండేది. వీరు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, నకళ్లు, ఇతర పౌరసేవలు నిర్వహించేవారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్‌లకు పూర్తిస్థాయి పనులను కల్పించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు పం పించింది. ఒక్క మహిళా పోలీస్‌ అసిస్టెంట్‌లను ఏం చేస్తారనే దానిపై స్పష్టత లేదు. మిగిలిన వారిపై స్పష్టత ఉంది. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో ప్రణాళిక సిద్ధం చేశారు.

మాతృశాఖలకు బదిలీ

పశ్చిమ గోదావరిలో 530 గ్రామ, వార్డు సచివాలయాల్లో నాలుగు వేల 200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీ నెల ఇంటింటికి పెన్షన్‌ పంపిణీలో సచివాలయ సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థపై స్పష్టత రావాల్సి వుంది. ప్రభత్వం వలంటీర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సచివాలయ సిబ్బందికి తమ మాతృశాఖలకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నా రు. దీనివల్ల అక్కడ సిబ్బంది కొరత తీరు తుంది. నాణ్యమైన సేవలందే అవకాశం ఉం టుంది. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లను పంచాయతీరాజ్‌, హౌసింగ్‌, ఆర్‌అండ్‌బీ శాఖలకు అగ్రికల్చర్‌ సిబ్బందిని వ్యవసాయ శాఖకు, వీ ఆర్వోలను రెవెన్యూ శాఖకు, ఫిషరీస్‌ అసిస్టెం ట్లను మత్స్య శాఖకు, సర్వే అసిస్టెంట్లను సర్వే శాఖకు, ఏఎన్‌ఎంలను వైద్య శాఖకు, వె టర్నటీ అసిస్టెంట్లను పశు సంవర్ధక శాఖకు హార్టికల్చర్‌ అసిస్టెంట్‌లను ఉద్యానవన శాఖ లకు పంపే ఆలోచనలో ఉన్నారు.

వలంటర్లీపై స్పష్టత కరువు

వలంటీర్లతోనే పాలన అంటూ కొత్త వర వడి సృష్టించిన వైసీపీ.. ఎన్నికల్లో బోల్తా పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థను సంస్కరించే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాలో తొమ్మిది వేల 200 మంది వలంటీర్లు విధులు నిర్వహించే వారు. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నాయకుల ఆదేశాలతో ఐదు వేల 200 మం ది రాజీనామా చేశారు. మిగిలిన నాలుగు వేల మంది విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్లు చేపట్టే పెన్షన్‌ పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలను సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్నారు. వలంటీర్ల లాగిన్‌లోని నివాసితుల వివరాలు, ఆవాస వివరాలను సచివాలయ సిబ్బంది లాగిన్‌లోకి మార్చేశారు. దీంతో ఇప్పుడు వలంటీర్లకు ఏ విధమైన పనులు అప్పగిస్తారనే దానిపై చర్చ నడుస్తోంది.

Updated Date - Sep 21 , 2024 | 12:11 AM