ప్రభుత్వ స్కూళ్లలో సరికొత్త ప్రయోగం
ABN, Publish Date - Dec 04 , 2024 | 12:07 AM
విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాఽ ద్యాయుల మధ్య ఓ ఆత్మీయ వారఽథి నిర్మించా లన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లల్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
7న ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం
విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేత
జిల్లా వ్యాప్తంగా 1375 స్కూళ్లలో సమావేశాలు
నరసాపురం/భీమవరం రూరల్, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాఽ ద్యాయుల మధ్య ఓ ఆత్మీయ వారఽథి నిర్మించా లన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లల్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆదే ప్రతి విద్యార్థికి తల్లిదండ్రుల సమక్షంలో సమగ్ర ప్రగతి పత్రం (ప్రోగ్రెస్‌కార్డు) అందించా లని నిర్ణయించింది. దీనికి ఈనెల 7న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ అని నామకరణం చేశారు. దీన్ని జిల్లా వ్యాప్తంగా పండుగలా నిర్వహించేందుకు జిల్లా విద్యశాఖ అన్ని ఏర్పాట్ల ను చేపట్టింది. మొత్తం 1375 స్కూళ్లలో 99784 మంది విద్యార్థులకు ఆ రోజున పేరెంట్స్ సమ క్షంలో ప్రోగ్రెస్ కార్డులు అందించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు స్కూళ్లల్లో చురు గ్గా సాగుతున్నాయి. దీన్ని పండుగలా నిర్వహిం చేందుకు జిల్లా విద్యాశాఖ రూ.26.18లక్షలను మంజూరు చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అంటూ అందించడం లేదు. దీని వల్ల పిల్లలు ఎలా చదువుతున్నారు... ఏఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారు? ఎన్ని మార్కులు వస్తున్నా యి? అసలు విద్యార్థులు స్కూళ్ళకు రెగ్యులర్‌గా వెళుతున్నారా లేదా అన్న విషయాలు తల్లిదం డ్రులకు పూర్తిగా తెలియడం లేదు. వీటిని విద్యార్థి సమక్షంలోనే తల్లిదండ్రులకు తెలియజే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మ ధ్య ఓ ఆత్మీయ వారధి ఏర్పడేందుకు దోహదప డుతుందని ప్రభుత్వం భావించింది.
అన్ని వివరాలతో ప్రోగ్రెస్ కార్డు
ఇక విద్యార్థులకు అందించే ప్రోగ్రెస్ కార్డులో చదువుకు సంబంధించి అన్ని వివరాలు ఉంటా యి. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేరు, క్లాస్, వచ్చిన మార్కులు, హాజరుశాతం, బ్లడ్ గ్రూప్, ఎత్తు, ఆధార్‌నెంబర్, రోల్ నెంబర్, అడ్మిషన్ నెంబర్, పుట్టిన తేదీ, బరువు, పుట్టుమచ్చలు, అపార్ ఐడీ, పర్మినెట్ ఎడ్యుకేషన్ నెంబర్, తల్లిదండ్రుల ఇద్దరి ఫోన్ నెంబర్లు, శాశ్వత అడ్రస్ తదితర అంశాలు ఉంటాయి. ఎనిమిది పేజీలతో ఇచ్చే ఈ ప్రోగ్రెస్ కార్డు విద్యార్థి జీవి తాతం గుర్తుంచుకునే విధంగా ముద్రించారు.
రాజకీయాలకు అతీతంగా
సమావేశం
ఏ సమావేశం జరిగినా ప్రజాప్రతినిధులను పిలుస్తారు. కానీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో రాజకీయాలకు అతీతంగా సాగనుంది. పాఠశాల అలంకరణలో పర్యావరణహిత సామగ్రిని ఉపయోగించనున్నారు. మామిడి తోరణాలు, అరటి మొక్కలు ఇలా ఆకట్టుకునేలా అలంకరణ చేయాల్సి ఉంది. తల్లులకు ముగ్గుల పోటీలు, తండ్రులకు తాడు లాగే పోటీలు నిర్వహిస్తారు. ప్రధానంగా పాఠశాలల వద్ద సమావేశాలు జరిగేటప్పు డు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని నిబంధన పెట్టారు.
Updated Date - Dec 04 , 2024 | 12:07 AM