ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిరసన హోరు

ABN, Publish Date - Nov 05 , 2024 | 12:34 AM

బ్యాంకు అధికారుల తీరుతో ఒకసారి తీసుకున్న రుణానికి రెండుసార్లు నగదు కట్‌ చేయడం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతు న్నారని ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్‌, జిల్లా నాయకులు ఎం.వెంకటాచారి ఆవేదన వ్యక్తం చేశారు.

ఏలూరు రూరల్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు అధికారుల తీరుతో ఒకసారి తీసుకున్న రుణానికి రెండుసార్లు నగదు కట్‌ చేయడం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతు న్నారని ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్‌, జిల్లా నాయకులు ఎం.వెంకటాచారి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులు రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. తొలుత కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. 2017లో తీసుకున్న రుణాలకు సంబంధించి పోలవరం నిర్వాసిత రైతుల నుంచి ఎస్‌బీఐ బూర్గంపాడు బ్రాంచ్‌ రుణాలను భూసేకరణ డబ్బుల నుంచి రికవరీ చేశారన్నారు. భూసేకరణ డబ్బులు రాకముందే రికవరీ చేసిన బ్యాంకు మళ్ళీ భూసేకరణ డబ్బుల నుంచి రికవరీ చేసిందన్నారు. 130 మంది రైతుల నుంచి రెండుసార్లు రికవరీ చేసిన దానికి వడ్డీతో సహా రైతులకు చెల్లించాలన్నారు.

వృత్తి చెరువులపై అధిక లీజు

రజకులకు కేటాయించిన చెరువుల్లో అధికా రులు లీజుల రూపంలో అధిక మొత్తం వసూలు చేస్తున్నారని కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామానికి చెందిన రజకులు కలెక్టరేట్‌ వద్ద సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చాటపర్తి బోసిబాబు మాట్లాడుతూ రజకులు వృత్తి చేసుకునే చెరు వుల్లో అధిక మొత్తం లీజు కట్టాలని పంచాయతీ కార్యదర్శి ఒత్తిడి చేస్తున్నారన్నారు. జీవో 343 ప్రకారం లీజు కట్టించుకునేలా చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేశారు. రాచకొండ రత్తయ్య, మోతే అప్పారావు, ఎం.సోమయ్య, గంగరాజు, ఆర్‌.రాఘవులు, రుద్రపాక దుర్గారావు, ఎం.రా మారావు, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ నియమకాలు చేపట్టాలి

బుట్టాయగూడెం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్‌ ప్రాంత ఉద్యోగ నియమకాల చట్టాన్ని చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించాలని కోరుతూ సోమ వారం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో బుట్టా యగూడెం నుంచి జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ నియమకాల చట్టం కోసం 10 రోజులుగా వివిధ రూపాల్లో ఆదివాసీలు ఆందోళన చేస్తు న్నారు. మెగా డీఎస్సీలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆదివాసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు మొడియం శ్రీనివాసరావు, తెల్లం లక్ష్మణరావు, సోదెం ముక్కయ్య, తెల్లం రవిప్రసాద్‌, కుంజా ప్రసాద్‌, పట్ల రమేష్‌, తెల్లం శ్రీనివాసరావు, కోటం లక్ష్మణరావు, సర్పంచ్‌లు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డివోకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Nov 05 , 2024 | 12:34 AM