ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెట్రోల్‌ బంకుల్లో తనిఖీలు

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:13 AM

జిల్లాలోని పలు పెట్రోల్‌ బంకుల్లో ఏకకాలంలో అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.

మొగల్తూరులో తనిఖీలు నిర్వహిస్తున్న లీగల్‌ మెట్రాలజీ ఏసీ సాయిరాం

మొగల్తూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): లీగల్‌ మెట్రాలజీ శాఖ రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా జిల్లాలోని పలు పెట్రోల్‌ బంకుల్లో ఏకకాలంలో అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఏలూరు జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ బోణం సాయిరాం ఆధ్వర్యంలో 7 బృందాలు ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని ఆచంట, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు తదితరు ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకుల్లో తనిఖీలు నిర్వహించి ఒక కేసు నమోదు చేసినట్టు సాయిరాం తెలిపారు. ఈ తనిఖీల్లో తాడేపల్లిగూడెం ఇన్‌స్పెక్టర్‌ అప్పల నాయుడు, అమలాపురం ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన పెట్రోల్‌ అందించాలి

ఉండి: వినియోగదారులకు ఖచ్చితమైన తూకంతో నాణ్యమైన పెట్రోల్‌, డీజిల్‌లను అందించాలని కోనసీమ జిల్లా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ కె.రాజేష్‌ సూచించారు. గురు వారం ఎన్‌ఆర్‌పిఅగ్రహారంలో సాయి పెట్రోల ్‌ బంక్‌ను తనిఖీ చేశారు. రాజేష్‌ మాట్లా డుతూ పెట్రోల్‌ బంక్‌ల సాధారణ తనీఖ లలో భాగంగా జంబ్లింగ్‌ విధానాన్ని అనుస రించి కోనసీమ జిల్లాకు చెందిన తాను భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాలలోని పెట్రోల్‌ బంకులను తనీఖీ చేయడం జరిగి ందన్నారు. బంకుల్లో ఉచిత సౌకర్యాలైన గాలిపంపు, మంచినీరు, టాయిలెట్స్‌ తనిఖీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తూని కలు కొలతలు శాఖ భీమవరం ఇన్‌స్పెక్టర్‌ టి.రాంబాబు, సాయి పెట్రోల్‌బంక్‌ మేనేజరు కాళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 12:14 AM