ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పట్టణ స్వరూపం మార్చేలా..

ABN, Publish Date - Oct 27 , 2024 | 01:04 AM

పట్టణాల్లో ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వార్డుల వారీగా మ్యాప్‌లను రూపొందించనుంది.

వార్డుల వారీగా సర్వేలు, రోడ్లు, రిజర్వ్‌ స్థలాలు, డోర్‌ నెంబర్ల గుర్తింపు

భీమవరం టౌన్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వార్డుల వారీగా మ్యాప్‌లను రూపొందించనుంది. అధికారులు రహదారులను సర్వే చేసి ప్రణాళికల్లో నమోదు చేస్తారు. ప్రతీ ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలలో 30 అడుగుల రోడ్లు ఉండేలా చూస్తారు. ప్రస్తుతం విస్తరించి వున్న రోడ్ల విస్తీర్ణాన్ని పరిశీలిస్తారు. విస్తీర్ణం తక్కువగా వున్న వాటిని అదే వార్డులో ప్రధాన రోడ్లకు అనుసంధానమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తారు. తద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరనుంది. ప్లాన్‌ల అనుమతి సులభరతరం కానుంది.

పట్టణ ప్రణాళికదే భాధ్యత

భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాల కొల్లు, నరసాపురం మునిసిపాల్టీల్లో సర్వే చేసే బాధ్యత పట్టణ ప్రణాళిక విభాగాలకే అప్పగించారు. ఈ అధికారులు వార్డుల వారీగా పదడుగుల రహదారిని నమోదు చేస్తారు. వీధులతోపాటు ప్రధాన జంక్షన్‌లను గుర్తిస్తారు. గతంలోనే ఈ సర్వే నిర్వహించినప్పటికి అధికారికంగా నమోదు చేయలేదు. ఇప్పుడు మరోసారి సర్వే చేస్తున్నారు. ఆ దిశగా పట్టణ ప్రణాళిక సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ప్లాన్‌లు సులభతరం

ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి ద్వారా స్థల యజమానులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది. రహదారి చిన్నగా ఉన్నప్పుడు 30 అడుగులు తీసుకుని ప్లాన్‌ ఇచ్చేవారు. ఉదాహరణగా పదడుగులు ఉంటే ఇరు వైపుల 10 అడుగులు మునిసిపాల్టీకి రిజిస్ట్రేషన్‌ చేయాలి. అప్పుడే ప్లాన్‌ ఇచ్చేవారు. ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలో పదడుగుల రహదారికి అనుమతి లభిస్తే మునిసిపాల్టీకి రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే నిర్మించిన ఇళ్ళను క్రమబద్దీకరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. అందుకోసమే సమగ్ర సర్వే నిర్వహించి ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయనున్నారు.

భీమవరంలో పైలెట్‌ ప్రాజెక్టు

ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (ఏడీపీ) తయారు విషయంలో భీమవరం మునిసిపాల్టీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు గతంలోనే గునుపూడిలో 17వ వార్డులో మాజీ కౌన్సిలర్‌ వేలూరి సుబ్రహ్మణ్యశర్మకు సం బంధించిన ఒక భవన నిర్మాణం ఆమోదం కోసం ఉన్నతాధికారులు ఏడీపీ చేసి బీపీ ఎస్‌కు అనుమతి ఇవ్వాలని అప్పట్లో అధికారులు ఆదేశాలు జారీచేశారు. మునిసిపల్‌ అధికారులు చేసిన సర్వేకు ఉన్నతాధికారుల నుంచి ఆమోదం లభించింది. అదే ఇప్పుడు సర్వేకు మార్గదర్శకంగా నిలు స్తోంది. అప్పట్లో ప్రతీ అంశాన్ని గుర్తించి ఏడీపీని అధికారులు సిద్ధం చేశారు. దీనిపై ఉన్నతాధికారులుఒకటికి రెండుసార్లు పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఆమోదం లభించింది. దీంతో ఆ వార్డులో చిన్న రహదారుల్లోను ప్లాన్‌ మంజూరయ్యే అవకాశం లభించింది.

Updated Date - Oct 27 , 2024 | 01:04 AM