రక్తదానం.. ప్రాణ దానమే
ABN, Publish Date - Oct 29 , 2024 | 12:27 AM
రక్తదానం చేయడం ఆపదలో ఉన్న వారి ప్రాణం కాపాడడమేనని ఎస్పీ కేపీఎస్ కిశోర్ అన్నారు.
ఏలూరు క్రైం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రక్తదానం చేయడం ఆపదలో ఉన్న వారి ప్రాణం కాపాడడమేనని ఎస్పీ కేపీఎస్ కిశోర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ స్వయంగా రక్తదానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. 18 నుంచి 55 ఏళ్ల వయసు ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చని సూచించారు. ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు 40 మంది, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు 15 మంది, ఆదిత్య కాలేజీ విద్యార్థులు 15 మంది, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆరుగురు, పోలీసు అధికారులు, సిబ్బంది 42 మంది రక్తదానం చేశారు. వీరందరికి జిల్లా ఎస్పీ కెపిఎస్ కిషోర్ ప్రశంసా పత్రాలను అందించారు. డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్, త్రి టౌన్ సీఐ ఎస్ కోటేశ్వరరావు, అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ 18 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
Updated Date - Oct 29 , 2024 | 12:27 AM