ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శిశువు మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు: సీఐ

ABN, Publish Date - Dec 10 , 2024 | 12:30 AM

అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతదేహం ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏలూరు టూటౌన్‌ సీఐ వైవి రమణ తెలిపారు.

ఏలూరు క్రైం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతదేహం ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏలూరు టూటౌన్‌ సీఐ వైవి రమణ తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు అశోక్‌ నగర్‌లోని ఒక నవజాత శిశువు మృతదేహం ఉందని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశామన్నారు. దర్యాప్తు చేయగా సెయింట్‌ జోసఫ్‌ కాన్వెంట్‌లో ఉన్న బాలిక డెలివరీ అయినట్లు గుర్తించామన్నారు. 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత ఆమెకు డెలివరీ జరిగిందని ఆమె పరిస్థితి క్షీణించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. ఆ శిశువు మరణానికి కార ణాలు తెలుసుకోవడానికి పోస్టుమార్టం జరిపి స్తున్నామని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తు న్నామన్నారు. కొన్ని సోషల్‌ మీడియా మాధ్య మాల ద్వారా కొంతమంది ఊహాగానాలతో దర్యా ప్తునకు ఆటంకం కలిగించేలా వ్యాఖ్యానం చేస్తూ దర్యాప్తును పక్కదారి పట్టించేలా ప్రచారం జరు గుతుందన్నారు. ఏదైనా అనుమానాలు ఉంటే తనను సంప్రదించాని సీఐ వైవి రమణ ఒక ప్రకటనలో తెలిపారు.

సమగ్ర విచారణ చేయండి

ఏలూరు అశోక్‌నగర్‌లో ఉన్న మిషనరీ వసతి గృహం నుంచి ఓ శిశువును బయటకు విసిరేసిన సంఘటనపై రాష్ట్రబాలల హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కేసలి అప్పారావు, సభ్యులు డాక్టర్‌ జంగం రాజేంద్రప్రసాద్‌ స్పందించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదికను మూడు రోజుల్లో రాష్ట్ర కమిషన్‌కు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ సంఘటనను సుమోటోగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ స్వీకరించి ఆదేశాలు జారీ చేసింది. బాధ్యులపై శాఖాపరమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. వసతి గృహం సిబ్బంది, తల్లిదండ్రులు నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాలలకు సంబంధించిన చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు విధిగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని వారు తెలిపారు.

Updated Date - Dec 10 , 2024 | 12:30 AM