నేటి నుంచి స్పెషల్ డ్రైవ్..
ABN, Publish Date - Jun 02 , 2024 | 12:45 AM
ఈనెల నాలుగో తేదీన ఓట్ల కౌంటింగ్ నేప థ్యంలో పోలీసు శాఖ అప్రమత్త యింది. జిల్లాలో శాంతి భద్రత లకు ఎలాంటి విఘాతం రాకుండా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే జిల్లా ఎస్పీ అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. శాంతి భద్రతల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వాహనాల నంబరు ప్లేట్లపై రాతలు, గుర్తులు ఉన్నా కేసులే..
జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు
ఏలూరు క్రైం, జూన్ 1 : ఈనెల నాలుగో తేదీన ఓట్ల కౌంటింగ్ నేప థ్యంలో పోలీసు శాఖ అప్రమత్త యింది. జిల్లాలో శాంతి భద్రత లకు ఎలాంటి విఘాతం రాకుండా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే జిల్లా ఎస్పీ అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. శాంతి భద్రతల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కార్డన్ సెర్చ్‌లను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆదివారం నుంచి స్పెషల్ డ్రైవ్‌ను పోలీసులు, రవాణాశాఖ అధికారులు చేపట్టనున్నారు. వాహనాల నంబర్ ప్లేటుపై నంబర్ మినహా ఏమైనా కొటేషన్లు ఉన్నా పార్టీ పేరు, ఎమ్మెల్యే పేర్లు ఉన్నా అలాంటి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు. స్టిక్కర్లు ఉన్నా ఆ వాహనాలకు జరిమానాలు విధించడానికి చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి పికెట్లను నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి కేసులు నమోదైన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. పోలీస్ యాక్ట్ 30, సీఆర్పీసీ 144 సెక్షన్ అమలులో ఉండడంతో ఎవరైనా గుమ్మిగూడి ఉన్నా గుంపుగా వెళ్ళినా వారిని అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు నమోదు చేయ డానికి రంగం సిద్ధం చేశారు. ఏలూరులో సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లను డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో కొనసాగిస్తున్నారు. టూటౌన్ సీఐ ఎం.ప్రభాకర్ శని వారం రాత్రి గన్‌బజార్‌లో ఏర్పాటు చేసి పికెట్లను పరిశీలించి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. గతంలో ఆ ప్రాంతాల్లో కేసుల్లో ఉన్నవారిని పిలిచి కౌన్సెలింగ్ చేశారు. ఎవరైనా అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. కాగా ఇప్పటికే ఈవీఎం బాక్సులను భద్రపర్చిన ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజ నీరింగ్ కాలేజీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కాలేజీ పైన ఎలాంటి డ్రోన్లు ఎగరడానికి వీలులేదని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. చుట్టు పక్కల ప్రాంతాలకు ఎవ్వరు రాకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
Updated Date - Jun 02 , 2024 | 12:45 AM