పోలీసు శాఖలో పదోన్నతి పరీక్షలు
ABN, Publish Date - Nov 26 , 2024 | 12:04 AM
జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం(డీటీసీ)లో పోలీస్ ఉద్యోగుల పదోన్నతులకు అర్హత పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.
పరీక్షల నిర్వహణ పరిశీలించిన ఐజీ
పెదవేగి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం(డీటీసీ)లో పోలీస్ ఉద్యోగుల పదోన్నతులకు అర్హత పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ. అశోక్‌కుమార్ పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. రేంజ్ పరిధిలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా లు, ఉమ్మడి కృష్ణా జిల్లాల సిబ్బందికి పదోన్నతి పరీక్షలు రెండు రోజులపాటు జరుగుతాయని ఆయన తెలిపారు. హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు 115 మంది పరీక్షలకు హాజరయ్యారని ఆయన తెలిపారు. పటిష్ట భద్రత నడుమ, ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షల నిర్వహిస్తున్నామ న్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అధికా రుల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఉదయం, సాయంత్రం రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఆయన వెంట ఏలూరు ఎస్పీ కె.కి శోర్, పోర్త్ బెటాలియన్ కమాండెంట్ సీవీఏ.రా మకృష్ణ, ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, డీటీసీ డీఎస్పీ సీహెచ్‌వీ.ప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వుడ్ ఏఎస్పీ చెంచురెడ్డి, ఏఆర్ ఏఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్.శేఖర్, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, మహిళా ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Updated Date - Nov 26 , 2024 | 12:04 AM