ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

83.68

ABN, Publish Date - May 16 , 2024 | 12:53 AM

జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్‌ శాతం నమోదైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సగ టున 83.68 శాతం నమోదైంది.

పెరిగిన పోలింగ్‌ శాతం

పోస్టల్‌ బ్యాలెట్‌తో మరో 1.15 శాతం పెరుగుదల

జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో పోలింగ్‌ శాతంపై ప్రభావం

ఏలూరు సిటీ, మే 15 : జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్‌ శాతం నమోదైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సగ టున 83.68 శాతం నమోదైంది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో 16లక్షల 37వేల 430 మంది ఓటర్లు ఉండగా ఇందులో 13 లక్షల 70వేల 153 ఓట్లు పోలయ్యా యి. అదే విధంగా 7లక్షల 99వేల 241 మంది పురుషులకు 6లక్షల 77వేల 056 ఓట్లు నమోదు కాగా , 8లక్షల 38వేల 063 మంది మహిళా ఓటర్లు ఉండగా వారిలో 6లక్షల 93వేల 045 మంది తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఇతరులు 126 మంది ఉండగా వారిలో 52 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గాల వారీగా పోస్టల్‌ బ్యాలెట్‌లు పరిశీలిస్తే 18 వేల 201 అంటే 1.15 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 1,614, దెందులూరు–2,165, ఏలూరు– 3,123, పోలవరం– 2,872 , చింతలపూడి– 2,267, నూజివీడు– 1,923 , కైకలూరు – 1,651 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించు కున్నారు. వారిలో ఎన్నికల విధులకు హాజరయ్యే 15 వేల 615 మంది సిబ్బంది కాగా, 43 మంది సర్వీస్‌ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. 85 ఏళ్లు దాటిన వారు 500 మంది, విభిన్న ప్రతిభావంతులు 369 మంది, అత్యవసర సర్వీస్‌కు సంబంధించి సిబ్బంది 1,674 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated Date - May 16 , 2024 | 12:53 AM

Advertising
Advertising