ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాన్‌స్టాప్‌ ప్రయత్నం

ABN, Publish Date - Dec 06 , 2024 | 12:09 AM

ఒకప్పుడాయన కాంగ్రెస్‌లోను, ఆ తరువాత వైసీపీలోను తిరుగులేని నేతగా ఉన్నారు. ఏలూరు కేంద్రంగా ఆయన 1999 నుంచి ప్రతిసారి అసెంబ్లీ బరిలోకి దిగి మూడుసార్లు గెలుపొందారు.

నాని టీడీపీలో చేరికకు ఎందుకింత ఆదుర్దా

కేడర్‌ వ్యతిరేకిస్తున్నా బెజవాడలోనే మకాం

ఇంకా ముహూర్తం ఖరారు చేయని టీడీపీ

ఆచితూచి నిర్ణయానికి మొగ్గు

సీఎం చంద్రబాబుకు అన్నీ వివరించిన ఎమ్మెల్యే చంటి

శనివారం జరగాల్సిన భేటి వాయిదా?

ఒకప్పుడాయన కాంగ్రెస్‌లోను, ఆ తరువాత వైసీపీలోను తిరుగులేని నేతగా ఉన్నారు. ఏలూరు కేంద్రంగా ఆయన 1999 నుంచి ప్రతిసారి అసెంబ్లీ బరిలోకి దిగి మూడుసార్లు గెలుపొందారు. జగన్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవితో ఉమ్మడి జిల్లానే దాదాపు శాసించారు. కాని రాజకీయాల్లో అదృష్టం కలిసొచ్చి ఇన్నాళ్ళు ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట. అలాంటి నేత ఒక్కసారిగా వైసీపీ నుంచి రాజీనామా చేయడమే కాకుండా ఇకముందు క్రియాశీలక రాజకీయాల్లో నేనుగాని, నా కుటుంబంగాని ఉండరంటూ వీర శపఽథం చేశారు. కాని ఎందుకో.. ఏమో ఆయన మనస్సు మార్చుకున్నారు. సైకిలెక్కేందుకు ఉబలాటపడుతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఎడతెరపిలేకుండా చేస్తున్న ఆయన ప్రయత్నాలకు తెలుగు తమ్ముళ్ళు ససేమిరా వీల్లేదంటూ మోకాలడ్డారు. నాని టీడీపీలో చేరాలన్న తన నాన్‌స్టాప్‌ ప్రయత్నాలు సక్సెస్‌ అవుతాయా, విఫలమవుతాయో మరికొద్ది రోజుల్లోనే తేలబోతుంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా అప్పటిదాకా అధికార పార్టీలో ఓ వెలుగు వెలిగిన వారంతా అమాంతం ప్లేటు తిప్పే స్తారు. కొత్త పార్టీల్లోకి జంప్‌ చేస్తారు. సీని యర్లకైతే ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని పార్టీలు తలుపులు బార్లా తీసి ఉంచుతాయి. అదీ ప్రత్యేకంగా బలమైన సామాజిక వర్గనే తలైతే ఇక చెప్పనక్కర్లేదు. ఎదురేగి మరీ స్వాగతం పలుకుతారు. ఈ వ్యవహారం మాత్రం సీనియర్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి మాత్రం రివర్స్‌ అయ్యింది. ఆయన లోపాయికారిగా కొందరి ప్రయత్నాలతో టీడీపీ వైపు తొంగి చూశారు. ఆయనను ఏదొక రూపంలో పార్టీలోకి రప్పించేందుకు కొందరు నేతలు తెరవెనుక చక్రం తిప్పారు. టీడీపీ అధినాయకత్వాన్ని ఒప్పించి పని చక్కబెట్టేం దుకు అంతరంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే నాని చేరిక దాదాపు ఖరారైంది. అంతలోనే ఆయన చాన్నా ళ్ళుగా ఏలిన ఏలూరులో టీడీపీ కేడర్‌ ఒక్క సారిగా రివర్స్‌ అయ్యింది. ఆయనేంటి.. పార్టీ లోకి తీసుకోవడం ఏమిటంటూ ఏకంగా పార్టీ అధినాయకత్వానికి పుంకానుపుంకాలుగా ఫిర్యా దులు పంపారు. సోషల్‌ మీడియాలో ఆళ్ల నాని రాకను అపహాస్యం చేస్తూ పోస్టులు పెట్టారు. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండగా వైసీపీకి పూర్తి న్యాయం చేసేందుకు తెలుగు దేశం కేడర్‌ను అన్ని విధాలా దెబ్బతీసి తొక్కేయ డానికి ప్రయత్నించిన సంఘటనలను వరుసగా పేర్కొంటూ కొన్ని వీడియోలను కూడా తెలుగు దేశం అధిష్టానానికి చేరవేశారు. అన్నీ అనుకు న్నట్టుగా జరిగితే మంగళవారం నాడే నాని టీడీపీలో చేరిక జరిగిపోయి ఉండేది. కాని దీనికి విరుద్దంగా అనేక పరిణామాలు చోటు చేసుకు న్నాయి. మిగతా నియోజకవర్గాల్లో మాదిరిగానే ఏలూరులో కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హోదాలో నాని చేరిక సులభ తరమే అనుకున్నారు. అంతకుముందు ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను, ఏలూరు నగర మేయర్‌ను, మరికొంతమంది కార్పొరే టర్లను అలవోకగా టీడీపీలో ఆహ్వానించడమే కాకుండా వారిని సగౌరవంగా పార్టీలో చేర్చు కుని సముచిత స్థానం ఇచ్చారు. అదీకాక రెండు దశాబ్దాలకుపైగా రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన ఆళ్ల నాని విషయంలో ఎలాంటి అడ్డంకులు ఉండబోవని భావించినా దీనికి విరుద్దంగానే టీడీపీలో కొత్త కొత్త సమస్యలు తలెత్తాయి.

వస్తే.. అవమానమే..

తెలుగుదేశం కేడర్‌ నిర్ణయానికి భిన్నంగా పార్టీ అధినాయకత్వం ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకున్నా ఆ తరువాత ఆయనకు అవమా నాలు తప్పవంటూ ఏకంగా తెలుగుదేశం సీనియర్‌ నేతలు కొందరు వ్యక్తిగత సందే శాలు పంపారు. ఏలూరులో ఎమ్మెల్యేగా, వైసీపీ నేతగా మీరు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. అప్పుడేమో కారుకూతలు, ఇప్పు డేమో నీతి కబుర్లా అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి తరుణంలోనే మంగళవారం ఆళ్ల నాని చేరిక కాస్తా వాయిదా పడింది. సీని యర్‌ అయిన ఆళ్ల నాని తొలిసారిగా ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొంటున్నారు. ఆయన విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్‌లో మకాంవేసి టీడీపీ నుంచి ఎప్పుడు కబురొస్తు ందా అని ఏకంగా మూడు రోజుల నుంచి ఎదురుచూస్తూనే వచ్చారు. ఆయనను పార్టీ లోకి చేర్చేందుకు చక్రం తిప్పిన నేతలు.. అందుబాటులో ఉండండి ఎప్పుడైనా మీకు కబురు రావొచ్చంటూ ఇచ్చిన సందేశాలతోనే ఆళ్ల నాని విజయవాడలో మకాం వేశారు. కాని సీనియర్‌ నేత క్రియాశీలక రాజకీయాల్లో ఉండనని చెప్పి మళ్ళీ ఇలా పడిగాపులు పడా ల్సిన స్థితికొచ్చారంటూ ఏలూరులో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉన్నన్నాళ్ళు తిరుగులేకుండా కధ నడిపి ఇప్పుడు టీడీపీలో చేరేందుకు ఎందుకు పాకులాడాల్సి వచ్చిందంటూ ఆయ నకు ఒకప్పటి సన్నిహితులు కాస్తంత చీత్కా ర ధోరణిలోనే ఉన్నారు. కాని టీడీపీలోకి చేరడానికి బలమైన కారణమే ఉందని, అందు కోసమే పార్టీలోకి చేరేందుకే ఇప్పుడు అనేక మెట్లు దిగి ఎదురు చూడాల్సిన పరిస్థి తి వచ్చిందని మరికొందరు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బుధవారం ఏ లూరు ఎమ్మెల్యేల బడేటి చంటి ముఖ్య మంత్రి చంద్రబాబును కలిశారు. ఆళ్ల నాని పార్టీలోకి రాక విషయాన్ని ప్రస్తావిస్తూ పార్టీ కేడర్‌ వద్దంటున్నారు. వాళ్ళిష్టమే నా ఇష్టం కూడా. కాని మీరన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నామని తమ అభిప్రా యాన్ని సీఎం చెవిన వేశారు. ఈనెల 9న జరగాల్సిన సీఎంతో పార్టీ నేతల భేటీ దాదా పు జరగకపోవచ్చునని సంకేతాలు అందుతు న్నాయి. బడేటి కుటుంబం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండడమే కాకుండా ప్రతిసారి ముక్కుసూటిగానే వ్యవహరిస్తుంది. నాని రాక విషయంలోను అదే జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు సీనియర్‌ నేత, మంత్రి అచ్చెన్నాయుడును, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావును కలిసి పార్టీ కేడర్‌ ఏమను కుంటున్నారో, ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సోదాహరణంగా వివరించినట్టు సమాచారం.

Updated Date - Dec 06 , 2024 | 12:09 AM