ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన
ABN, Publish Date - Jun 15 , 2024 | 11:51 PM
బడి బయట పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు జూలై 11 వరకు చేపట్టిన ‘నేను బడికి పోతా ’ స్పెషల్ డ్రైవ్ శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ప్రారంభమైందని సమగ్ర శిక్షణ జిల్లా ఏపీసీ బి.సోమశేఖర్, డీఈవో అబ్రహం తెలిపారు.
గ్రామాల్లో ‘నేను బడికి పోతా’ ర్యాలీలు
ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 15 : బడి బయట పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు జూలై 11 వరకు చేపట్టిన ‘నేను బడికి పోతా ’ స్పెషల్ డ్రైవ్ శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ప్రారంభమైందని సమగ్ర శిక్షణ జిల్లా ఏపీసీ బి.సోమశేఖర్, డీఈవో అబ్రహం తెలిపారు. తొలిరోజు స్పెషల్ డ్రైవ్ వివరాలను శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ శాఖలను సమన్వయ పరుచుకుని జిల్లాలో 65 మంది బడికి వెళ్లని పిల్లలను గుర్తించామని, వీరిలో 55 మందిని సమీప పాఠశాలల్లో చేర్పించామన్నారు. అన్ని మండలాల్లో ర్యాలీలు నిర్వహించగా పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యా యులు పాల్గొన్నారని వివరించారు. తిరిగి ఈ స్పెషల్ డ్రైవ్ మంగళవారం నుంచి కొనసాగుతుందని తెలిపారు.
ఫ బుట్టాయగూడెం :గ్రామాల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఎంఈవో టి.బాబు రావు సూచించారు. రామన్నగూడెం మండల పరిషత్ ప్రాఽథమి కోన్నత పాఠశాలలో శనివారం జరిగిన ‘నేను బడికి పోతా’ ర్యాలీలో ఎంఈవో పాల్గొన్నారు. ఏఎంవో కె.శిరమయ్య, హెచ్‌ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టి.నరసాపురం : బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలని విద్యాశాఖా ధికారులు టి.రామ్మూర్తి, ఎస్.కళ్యాణి పిలుపునిచ్చారు. ‘నేను బడికి పోతా’ కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రధాన సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
కుక్కునూరు : మండల కేంద్రంలోనేను బడికి పోత కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఎంఈఓ గిరిభగవాన్‌దాస్. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెదపాడు : జిల్లా విద్యాశాఖాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించి బడి ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించామని ఎంఈవోలు సబ్బితి నరసింహామూర్తి, దేవినేని వెంకటరమణ తెలిపారు. హెచ్‌ఎం వెంకటేశ్వరరావు, ఎంఈవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : బడిబయట ఉన్న పిల్లలందరిని బడిలో చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం నేను బడికి పోతా కార్యక్రమాన్ని జూలై 12 వరకు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో–2 జి.రాములు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో–1 బి.రాముడు, మున్సిపల్ కమిషనర్ ఎన్.నరేంద్రకుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కేవీ ప్రసాద్, ప్రధానోపాధ్యాయిరి కేఎస్‌వీ లోవకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కామవరపుకోట : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తహసీల్దార్ జీవీఆర్ రమేష్, ఎంఈఓ డి.సుబ్బారావు తల్లిదండ్రులకు సూచించారు. ఉపాధ్యాయ బృందం కామవరపుకోట, కొత్తూరులో శనివారం నేను బడికిపోతా ర్యాలీని నిర్వహించారు. ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.
Updated Date - Jun 15 , 2024 | 11:51 PM