ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అకస్మాత్తుగా వర్షం

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:11 AM

అప్పటి వరకు ఎండ వేడి, ఉక్కపోత.. ఒక్క సారిగా వాతావరణం మారి పోయింది. కారుమబ్బులు కమ్ముకున్నాయి. జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది.

ఉరుములు మెరుపులు, ఈదురు గాలులు

అప్పటి వరకు ఎండ వేడి, ఉక్కపోత.. ఒక్క సారిగా వాతావరణం మారి పోయింది. కారుమబ్బులు కమ్ముకున్నాయి. జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుని ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దాదాపు అరగంటకు పైగా భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పోలవరం: పోలవరం మండలంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పాఠశాలలు విడిచిపెట్టే సమయం కావడంతో విద్యార్థులు స్థానిక బస్‌ షెల్టర్‌లో తలదాచుకుని వర్షం తగ్గిన తర్వాత ఇళ్ళకు వెళ్లారు. ఈదురు గాలులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రజానీకం ఇబ్బందులకు గురయ్యారు

పెదపాడు: తీవ్రమైన ఎండవేడితో అల్లాడుతున్నవారికి శుక్రవారం కురిసిన వర్షం కొంత ఉపశమనం కలిగించింది. ఉదయం రెండు గంటల పాటు జల్లులతో కూడిన వర్షం కురవడంతో వేడిగా వున్న వాతావరణం కాస్త చల్లబడింది. వరిసాగు చేసి సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వర్షం కాస్త ఊరటనిచ్చింది.

ద్వారకాతిరుమల: అప్పటివరకూ ఎండతో సతమతమైన భక్తులు ఒక్క సారిగా కురిసిన వర్షంతో సేదతీరారు. ఉరుములు, మెరుపులతో ఆగకుండా వాన దంచి కొట్టింది. ఆలయానికి వచ్చిన భక్తులు వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు.

జీలుగుమిల్లి: జీలుగుమిల్లిలో శుక్రవారం వర్షం కురిసింది. ఇటీవల వరుస తుఫాన్‌లతో వచ్చిన వరదల వల్ల రైతులు నష్టపోయామని, ప్రస్తుతం వర్షాలు కురిస్తే మరింత నష్టం వాటిల్లనున్నట్లు రైతులు వాపోతున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:12 AM