ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చినుకు..వణుకు!

ABN, Publish Date - Dec 18 , 2024 | 12:20 AM

అల్పపీడన ప్రభావంతో వాతావరణం అకస్మా త్తుగా మారిపోయింది. మంగళవారం వర్షాబావ పరిస్థితులు కనబడడంతో రైతులు పంటలు రక్షించుకునే పనిలో పడ్డారు.

పోలవరంలో రోడ్డు పక్కన ఆరబెట్టిన ధాన్యాన్ని బస్తాల్లోకి నింపిన రైతులు..

మారిన వాతావరణంతో రైతుల్లో ఆందోళన

అల్పపీడన ప్రభావంతో కమ్ముకున్న మబ్బులు

అక్కడక్కడా తేలికపాటి వర్షాలు

హడావుడిగా ధాన్యాన్ని ఇళ్లకు చేరుస్తున్న రైతులు

కొన్నిచోట్ల ధాన్యాన్ని ఒబ్బిడి చేసి బరకాలు కప్పుతున్న వైనం

ఏలూరు సిటీ/పోలవరం/ఆకివీడు రూరల్‌/ ఆచంట/ఉండి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : అల్పపీడన ప్రభావంతో వాతావరణం అకస్మా త్తుగా మారిపోయింది. మంగళవారం వర్షాబావ పరిస్థితులు కనబడడంతో రైతులు పంటలు రక్షించుకునే పనిలో పడ్డారు. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని హడావుడిగా ఇళ్లకు తరలిస్తున్నారు. పోలవరం మండలంలో ఇప్పటికే కోతలు కోసి నూర్చిన పంటలు పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ ఛానల్‌, పట్టిసీమ శివక్షేత్రం ఫెర్రీ పాయింట్‌ ఆవరణ లోను, గూటాల, కొత్తపట్టిసీమ వీధుల్లో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం, కళ్ళాల్లో ధాన్యాన్ని ఒబ్బిడి చేసి బరకాలు కప్పే పనిలో పడ్డారు. మరి కొందరు బస్తాలకెత్తి ధాన్యం దాచుకునే గోదాములు లేక వచ్చిన ధరలకు దళారులకు అమ్ముకుంటున్నారు. ఆకివీడు మండలంలో మంగళవారం ఉదయం నుంచి మేఘావృతమై చలిగాలి ఎక్కువగా ఉండ టం, సాయంత్రం సమయంలో చిరు జల్లులు పడుతుండటంతో మాసూలు అయిన రైతులు ఆందోళనలో పడ్డారు. ఆలస్యంగా పంటలు రావ డం, తేమ శాతం తగ్గించుకునేందుకు ధాన్యం రాశులుగా పోసి ఆరబెడుతున్నారు. అకస్మాత్తు మార్పుతో రైతులు రాశులపై బరకాలు కప్పి భద్రపరుచుకుంటున్నారు. సిద్దాపురం ప్రాంతంలో రైతులు ఎక్కువగా రాశులపై ధాన్యాన్ని పోగు పెట్టి ఉంచారు. ఆచంట మండలంలో సార్వా మాసూళ్ళు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రాత్రి, పగలు వరి యంత్రాలు ద్వారా రైతులు మాసూళ్ళు చేస్తున్నారు. మాసూళ్ళు అయిన ధాన్యం అనేక చోట్ల కల్లాలు, రోడ్లపైన ఉంది. మబ్బులు, మేఘాలతో తమ ధాన్యాన్ని తూకం తూసి మిల్లులకు పంపే పనుల్లో హడావుడిగా ఉన్నారు. సార్వా సాగులో మాసూళ్ల పర్వం చివరి దశకు చేరింది. ఏలూరు జిల్లాలో సాగు చేసిన పంట పొలాల్లో ముమ్మరంగా వరి మాసూ ళ్ళ కార్యక్రమం జరుగుతోంది. ఈ దశలో వర్షాలు కురిస్తే పంట మొత్తం నాశనం అయిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడన ద్రోణి కారణంగా రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో రైతులలో ఆందోళన మొదలైంది. దీనికి తగ్గట్టుగానే సోమ వారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పు లు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఏలూరు జిల్లాలో 1.91 లక్షల ఎకరాల్లో సార్వా వరి సాగు చేయటం జరిగింది. వరి కోతలు 1.49 లక్షల ఎకరాల్లో పూర్తయింది. ఉండి, వెలివర్రు, చిలుకూరు, యండగండి, ఉప్పులూరు తదితర గ్రామాలలో అకాల వర్షంతో రైతులు అవస్థలు పడ్డారు. ఉండి గ్రామంలో ఇంకా పలుచోట్ల మాసూళ్లు పూర్తి కాలేదు. యండగండి, ఉప్పులూ రులలో పట్టుబ డులు పట్టి రహదారులపై ఉంచారు. వీటిపై తడవకుండా బరకాలు కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు.

ధాన్యం భద్రతకు ముందస్తు చర్యలు: జేసీ

వాతావరణ శాఖ హెచ్చరికల నేపఽథ్యంలో కోతలు కాబడి కళ్ళాల్లో ఉన్న ధాన్యం రక్షణకు ఇప్పటికే 2వేల టార్ఫాలిన్‌లు రైతులకు పంపిణీ చేశామని, మరో 500 టార్ఫాలిన్‌ లు ముందస్తుగా సిద్దం చేసినట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి ధాత్రిరెడ్డి తెలిపారు. వర్షాలకు ధాన్యం తడవకుండా కప్పేందుకు ఇంకా అవసరమైన టార్ఫాలిన్స్‌ కొనుగోలు చేసి అందింస్తామన్నారు. రైతులు తమ సమస్యలను 18004256453 లేదా 08812–230448, 7702003584 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలియజేసినట్లయితే అధికారులు తగు పరిష్కార చర్యలు తీసుకుంటారన్నారు.

దాళ్వా నారుమడులకు గండం

భీమవరం రూరల్‌, డిసెంబర్‌ 17 (ఆంధ్ర జ్యోతి): దాళ్వా నారుమడులకు వాతావరణ మార్పులు గండంగా మారుతున్నది. వారం రోజుల క్రితం అల్పపీడన ప్రభావంతో దాళ్వా నారుమడులకు ఆదిలోనే కొంత వరకు ఇబ్బం దులు ఏర్పడ్డాయి. ఇంతలో అల్పపీడనం నుం చి గట్టెక్కాములే, నారుమడులు బతికాయి మిగిలిన నారుమడులు వేసుకోవచ్చన్న రైతులకు మరో అల్పపీడనం కంగారు పడేలా చేస్తున్న ది. మంగళవారం అల్పపీడన ప్రభావంతో మ బ్బులు, చిన్నపాటి చినుకులు పడ్డాయి. దీంతో రైతులు వాతావరణం సార్వా నారుమడులు మాదిరిగా దాళ్వా నారుమడులు నష్టం చేకూరుస్తాయన్న ఆందోళనలో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా లో దాళ్వా పంట 2 లక్షల 25 వేల ఎకరాల్లో సాగనుంది. దానికి సంబంధించి పది వేల ఎక రాల్లో నారుమడులు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 1500 ఎకరాల్లో మాత్రమే నారుమడులు వేసిన ట్లు వ్యవసాయాధికారులు లెక్క చెబుతున్నారు. ఇంకా 8 వేల 500 ఎకరాల్లో నారుమడులు వేయాల్సి ఉంది. అన్నిచోట్ల నారుమడులు విత్తన చల్లిక కోసం ఏర్పాట్లు చేశారు. ఈ రెండు మూడు రోజుల్లోనే చాలా వరకు నారుమడులు వేయడం జరుగుతుంది. ఈ సమయంలో వర్షాలు పడితే నారుమడుల్లో నీటిని బయటకు తోడటంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. నారుమడులు కూడా దెబ్బతీనే అవకాశం ఉంది. దీంతో రైతులకు అప్పపీడనం భయంగా మారింది.

Updated Date - Dec 18 , 2024 | 12:20 AM