ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లాలో వర్షాలు..

ABN, Publish Date - Dec 02 , 2024 | 12:11 AM

ఫెంగల్‌ తుపాను తీరం దాటినా ఆ ప్రభావం ఉంది.

తుఫాన్‌ తీరం దాటినా తగ్గని ప్రభావం

ఏలూరు సిటీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఫెంగల్‌ తుపాను తీరం దాటినా ఆ ప్రభావం ఉంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల చిన్న జడి పడినా పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కొనసాగడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. ఒక ప్రాంతంలో వర్షం ఉంటే మరో ప్రాంతంలో లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎండ కని పించినా మధ్యాహ్నం నుంచి వర్షాలు కురు స్తూనే ఉన్నాయి. ఏలూరు నగరంతో పాటు నూజివీడు, కైకలూరు, జంగారెడ్డిగూడెం, పెద వేగి, పెదపాడు, దెందులూరు, ఉంగుటూరు, నిమడర్రు, బుట్టాయగూడెం. కొయ్యలగూడెం, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, భీమడోలు, ద్వారకాతిరుమల, జీలుగుమిల్లి, పోలవరం, చాట్రాయి, ముదినేపల్లి, మండవల్లి తదితర ప్రాంతాలలో వర్షం పడింది. జిల్లాలో గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఏలూరు రూరల్‌ మండలంలో 11.2 మిల్లీమీటర్లు వర్ష పాతం నమోదైంది. కైకలూరు, కలిదిండి మండ లాల్లో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి హబీబ్‌ బాషా పర్యటించి రైతులలో అవగాహన కల్పిం చారు. జేసీ సూచనలతో రైతులు వరి కోతలను రెండు రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. వివిధ మండలాల్లో రైతులు స్థానిక వ్యవసాయ అధికారులు వరి పంటను రక్షించుకోడానికి సూచ నలు ఇచ్చారు. ఫెంగల్‌ తుఫాను ప్రభా వం మరో రెండు రోజులు ఉంటుందని చెబుతు న్నారు. కోసిన వరి పంటను ఎక్కడకు తీసుకు వెళ్లాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కల్లాలు, ఓదెలలో కుప్పలుగా వేసిన ధాన్యాన్ని రైతులు రక్షించుకుంటున్నారు. రహదారులపై ఆరబోసిన ధాన్యానికి బరకాలు కప్పినా కిందికి నీరు చేరి ధాన్యం తడిసి పోతోందని రైతులు చెబుతున్నారు. జాతీయ రహదారుల పక్కన ఆరబెట్టిన ధాన్యం ఈ తడుస్తోందని రైతులు చెబుతున్నారు.

జిల్లాలో 3.4 మి.మీ. వర్షపాతం

గడచిన 24 గంటల్లో జిల్లాలో సరాసరి వర్షపాతం 3.4 మిల్లీమీటర్లు నమోదైంది. ఏలూ రు రూరల్‌ మండలంలో 11.2 మిల్లీమీటర్లు, ఉంగుటూరు 9.8, నిడమర్రు 9.2, కలిదిండి 8.6, ఏలూరు అర్బన్‌ 8.2, కైకలూరు 6.4, మం డవల్లి 6.2, ముదినేపల్లి 5.6, దెందులూరు 5.4, పెదవేగి 4.8, భీమడోలులో 4, పెదపాడు 4, నూజివీడు 3.2, ఆగిరిపల్లిలో 3 మి.మీ. వర్షపా తం నమోదైంది. జిల్లాలో వర్షం కురిసిన మిగి లిన మండలాల్లో 2 మిమీ కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

రహదారులపై 12,765 మెట్రిక్‌ టన్నుల ధాన్యం

జిల్లాలో 1,91,379 ఎకరాల్లో సార్వా సాగు చేపట్టగా ఇప్పటివరకు 97,523 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. 31,423 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో రైతులు విక్రయించారు. 12,765 మెట్రిక్‌ టన్నుల ధాన్యా న్ని రహదారులపై ఆరబోశారు. 3314 టన్నుల ధాన్యాన్ని ఓదెలపై నిల్వ చేశారు. 5086 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లటానికి సిద్ధంగా ఉంది. కుప్పలపై ఉన్న వరి నుంచి 10,687 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాసూలవుతుంది. 51,603 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల సొంత ఆవసరాలకు నిల్వ చేసుకున్నారు. ఇప్పటివరకు 1,51,742 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఇప్పటివరకు 45 శాతం చేలల్లో వరి కోతలు పూర్తయినట్లు జిల్లా వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. పంట చేతి కందే సమయంలో ఈదురు గాలులు, వర్షాలు రైతులను కుంగదీశాయి. కంటిపై కునుకు లే కుండా కుప్పలు, రాశుల వద్ద కాపలా ఉన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 12:11 AM