విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పర్వతరావు కన్నుమూత
ABN, Publish Date - Dec 12 , 2024 | 01:00 AM
ఉంగుటూరుకు చెందిన విశ్రాంత ఉమ్మడి ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుంకవల్లి పర్వతరావు (90) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు.
ఉంగుటూరు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఉంగుటూరుకు చెందిన విశ్రాంత ఉమ్మడి ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుంకవల్లి పర్వతరావు (90) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఈయన గత కొంత కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాదు లో మృతి చెందారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈయన స్వగ్రామమైన ఉంగుటూరులో 35 ఎకరాల భూమిని గౌతమి సేవా సంస్ధకు అందించారు. 5 ఎకరాలలో గోశాల (గోపాలకృష్ణ గోఽశాల) నిర్మించారు. సొంత నిధులతో ఉంగు టూరులో భారతీయ విద్యా కేంద్రంను నిర్మించి విశాఖ పట్నం లోని బి.వి.కే.కు అప్పగించా రు. ఆయన మృతికి స్థానిక భారతీయ విద్యాభవన్స్ శాఖ కరస్పాండెంటు పాతూరి వంశీ కృష్ణ సంతాపం తెలిపారు.
Updated Date - Dec 12 , 2024 | 01:01 AM