అర్జీలు సత్వరం పరిష్కరించాలి
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:25 AM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
ఏలూరు రూరల్, అక్టోబరు 21: (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో డీఆర్వో పుష్పమణి, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయ్‌రాజు, ఆర్డీవో అచ్యుత అంబరీష్ అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు క్షుణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. రీఓపెన్ కాకుండా అర్జీల పరిష్కారం ఉండాలన్నారు. మొత్తం 284 అర్జీలు స్వీకరిం చారు. భూ తగాదాలు, పోలీస్, పంచాయతీరాజ్, హౌసింగ్, పారిశుధ్యం, విద్యుత్ తదితర వాటికి సంబంధించిన అర్జీలు స్వీకరించారు.
తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, భార్య పిల్లలు ఎవరూ లేరని, జీవనం కష్టంగా ఉందని, పింఛన్ ఇప్పించాలని కోరుతూ ధర్మాజిగూడెంకు చెందిన ఏ.రాంబాబు అర్జీ అందచేశారు. భూ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలని ఉంగు టూరుకు చెందిన పొట్టు అంజమ్మ ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగానికి ఒరిజినల్ సర్టిఫికెట్లు అందజేశానని, ప్రస్తుతం ఉద్యోగం ఇష్టం లేదని, ఒరిజినల్ సర్టిఫికెట్లు అడిగితే ఇవ్వడం లేదని ఏలూరుకు చెందిన రత్నాల వనజ విజ్ఞప్తి చేశారు. సుమారు 60ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న ప్రభుత్వ పట్టా భూమిని వైసీపీ నాయకుడు కబ్జా ప్రయత్నం చేశాడని బాధి తులు ముంగ మూరి వెంకటేశ్వర రావు, ఎం.మురారి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండ లం యాదవోలు గ్రామానికి చెంది న ఎం.వెంకటేశ్వరరావు, ఎం.మురా రికి కొయ్యలగూడెం మండలం రాజవరంలో 2.44 ఎకరాల భూమికి వైసీపీ నా యకుడు సాధనాల సుబ్బారావు తప్పుడు పత్రా లు సృష్టించాడని తెలిపారు. తమ పొలంలో కొబ్బరిమొక్కలు కిరాయి గూండాలతో వైసీపీ నరికివేశాడని, పొలంలోకి వస్తే చంపేస్తామని బెదిరించాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అదే గ్రామంలో వైసీపీ నాయకుడు డి.విష్ణు మూర్తి చెరువును పూడ్చి దాల్వా పంట పండిస్తున్నాడని పేట సప్తగిరి బాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
బుట్టాయగూడెం: మండలంలోని యర్రా యిగూడెంకు చెందిన గిరిజన కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం జారీకి 10 నెలలుగా రెవెన్యూ అధికారులు తిప్పించుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కబ్బాడి పోతయ్య, కబ్బాడి దారమ్మకు పిల్లలు లేకపోవడంతో చిన్నప్పుడే దత్తత తీసుకుని పెంచుకున్నారని, ఇటీవల తల్లిదండ్రులు చనిపోవడంతో కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదన్నారు.
భర్త మరణ ధ్రువీకరణ పత్రం కోసం 10 నెలలుగా తిరుగుతన్నా పట్టించుకోవడం లేదని యర్రాయిగూడెంకు చెందిన కబ్బాడి గంగా చల్ల మ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ భూమిని వేరే వారి పేరున తప్పుడు ఆన్‌లైన్ చేసిన రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటూ తామా పెదకన్నయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
అధికారుల పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్‌తో జాగ్రత్త : ఎస్పీ
ఏలూరు క్రైం: సీబీఐ అధికారుల పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కేపీఎస్ కిశోర్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో అర్జీలు స్వీకరించారు. పరిష్కారానికి సంబం ధిత అధికారులకు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశా రు. కుటుంబ అవసరాల కోసం అప్పు చేసి వడ్డీతో సహా చెల్లించినా ఇంకా కట్టాలని వేధి స్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. జిల్లాలో వడ్డీ వ్యాపారులు వడ్డీ పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - Oct 22 , 2024 | 12:25 AM