ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం సేకరించిన 24 గంటల్లో నగదు

ABN, Publish Date - Nov 05 , 2024 | 12:31 AM

రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 24 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమవుతుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు.

పెదపాడు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 24 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమవుతుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు. కొక్కిరపాడులో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను సోమవారం ఆయన ప్రారంభించారు. రైతు బాగుండాలి, వ్యవసాయం లాభసాటిగా ఉండా లనే నినాదంతో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. కూటమి నాయకులు, వ్యవసాయ, వివిధ శాఖల అధికారులు, పెద్దసంఖ్యలో రైతులు హాజరయ్యారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

దెందులూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్య లు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక(మీకోసం) కార్యక్రమంలో అర్జీలు స్వీకరించారు. అనంతరం మండల స్థాయి అధికా రులతో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్లు నమోదపై చర్చించారు. టీడీపీ మండల అధ్యక్షుడు మాగం టి మిల్లుబాబు, అధికారులు పాల్గొన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం

కామవరపుకోట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ఎప్పటి కప్పుడు తెలుసుకుని పరిష్కరించడంతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ అన్నారు. పీహెచ్‌సీ ఆవరణలో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. సర్పంచ్‌ కరిపోతు అనూష, టీడీపీ మండల అధ్యక్షుడు కిలారు సత్య నారాయణ, కోనేరు వెంకట సుబ్బారావు, ఘంటా సుధీర్‌బాబు, ఘంటా సత్యంబాబు, డోలా విజ య్‌, కరిపోతు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: లక్కవరం పీహెచ్‌సీలో అదనపు గదులు నిర్మాణానికి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ శంకుస్ధాపన చేశారు. ఆసుపత్రి లో ప్రసూతి వైద్య సేవలను పరిశీలించారు. టీడీపీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారా యణ, గద్దే బాబి, చిక్కాల ఆంజనేయులు, ఆసు పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 12:31 AM