ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

515.160 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

ABN, Publish Date - Nov 06 , 2024 | 12:35 AM

జిల్లాలో ఇంతవరకు రూ. 1.31 కోట్లు విలువైన 515.160 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జరిగిందని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ వి.శ్రీలక్ష్మి తెలిపారు.

ఏలూరు సిటీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంతవరకు రూ. 1.31 కోట్లు విలువైన 515.160 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జరిగిందని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ వి.శ్రీలక్ష్మి తెలిపారు. చింతలపూడి తదితర ప్రాంతాల్లో మంగళవారం పర్యటించినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో 250 రైతు సేవా కేంద్రాలను ధాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. కామన్‌ రకానికి క్వింటాల్‌కు రూ. 2300, గ్రేడ్‌–ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ. 2320 చొప్పున అందించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు వారి సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలని, ప్రభుత్వ సిబ్బం ది స్వయంగా రైతులకు చెందిన కళ్లాల వద్దే వారు పండించిన ధాన్యాన్ని పరీక్షించి, నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తారన్నారు. రైస్‌మిల్‌కు ధాన్యం తరలించిన 48 గంటల్లోనే రైతు ఆధార్‌ అనుసంధానిత బ్యాంకు ఖాతాకు ధాన్యం సొమ్ములు జమ చేయటం జరుగుతుందని ఆమె తెలిపారు.

Updated Date - Nov 06 , 2024 | 12:35 AM