ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోదారి రోడ్లపై కొత్త ప్రయోగం

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:36 AM

గోదావరి జిల్లాల్లో గుంతలు పడిన.. కుంగిపోయిన.. ప్రయాణానికి అనువుగా లేని ఛిద్రమైన రహదారులు ఇక కనిపించకూడదని కూటమి ప్రభుత్వ లక్ష్యం.

జిల్లాలో దెబ్బతిన్న రహదారులెన్నో

ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమాలోచన

శాశ్వత పరిష్కారానికి చర్యలు

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తరచూ దెబ్బతింటున్న రోడ్లతో ప్రయాణం నిత్యం నరకంగా మారింది. అంతకంటే మించి ఊహించనలవి కాని ప్రమాదాలు, ప్రాణనష్టం కలవర పరుస్తోంది. వీటన్నింటికీ పరిష్కారానికి ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఎక్కువకాలం మన్నేలా, ప్రయాణం సుఖవంతంగా జరిగేలా అనువైన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదన చేయనుంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో పాటిస్తున్నట్టుగానే ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యంతో కొత్తరోడ్ల నిర్మాణానికి ఇకముందు చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో కూటమి సర్కార్‌ ఉంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఎమ్మెల్యేల భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించడం అందరినీ ఆకర్షిస్తోంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

గోదావరి జిల్లాల్లో గుంతలు పడిన.. కుంగిపోయిన.. ప్రయాణానికి అనువుగా లేని ఛిద్రమైన రహదారులు ఇక కనిపించకూడదని కూటమి ప్రభుత్వ లక్ష్యం. కొత్త విధానంలో రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు చేస్తుంది. తరచు రహదారులు దెబ్బతినడంతో మరమ్మతులు, నిర్మాణానికి ప్రభుత్వం కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలూరు జిల్లాలో ఆర్‌అండ్‌బి పరిధిలోని 1900 కిలో మీటర్ల నిడివి గల మార్గంలో సగానికి సగం 950 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఆ మార్గంలో ప్రయాణించడం నరకప్రాయంగానే మారింది. దాదాపు ఐదేళ్లపాటు ఏలూరు–భీమవరం మార్గంలో 56 కిలో మీటర్ల మేర ప్రయాణించాలంటే సరాసరి రెండున్నర నుంచి మూడు గంటల సమయం పట్టేది. ఉమ్మడి పశ్చిమలో ఇలా దెబ్బతిన్న మార్గం ఇంకొకటి లేనేలేదు. అన్నిటికంటే మించి కొల్లేరు మీదుగా సాగే మార్గంలో తరచూ రోడ్లు మరమ్మతులు చేయడానికి పెద్ద ఎత్తునే ప్రభుత్వాలు ఖర్చుపెట్టాయి. అయినప్పటికీ తరచూ గొప్పులు గోతులతో వాహనాల రాకపోకలకు ఆటంకమే. జిల్లాలోని మరికొన్ని మార్గాల్లో కూడా భూమి అను కూలంగా లేకపోవడంతో కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన తారు రోడ్లు గోతులు పడడం సర్వసాధారణం. ఈ తరహా సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలను కూటమి ప్రభుత్వం శోధిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన 150 రోజుల్లో రోడ్ల మరమ్మతుకు, రోడ్లకు గుంతలు పూడ్చేందుకే ఏలూరు జిల్లాలోనే రూ.70 కోట్లు వెచ్చిస్తుంది. గడిచిన ఐదేళ్ళుగా పూర్తిగా దెబ్బతిన్న రోడ్లకు రూ.120 కోట్లకు పైగానే ఖర్చు చేస్తుంది. ఏడు నియోజకవర్గాలున్న కొత్త జిల్లాల పరిధిలోనే ఈ తరహా పరిస్థితులు ఉండడం, దీనికితోడు ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలకు రోడ్లు ఛిద్రం కావడంతో ప్రత్యామ్నాయాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏటా కోట్లాది రూపాయలు రోడ్లపై ఖర్చు చేయడం, తిరిగి కొద్ది నెలల వ్యవధిలోనే మరమ్మతులకు గురికావడం, కాంటాక్టు ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పం దానికి అనువుగా కొద్దిరోజులు మరమ్మతులు జరిగినా ఆ తదుపరి నిలిచిపోవడం వంటి పరిణామాలను ప్రభు త్వం పరిశీలనలోకి తీసుకున్నట్టయింది. ఇకముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా దీర్ఘకాలంగా మన్నే రహదారుల నిర్మాణం వైపు ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇది సఫలీకృతమైతే ఇదేవిధానాన్ని పొరుగు జిల్లాలకు కూడా అన్వయించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఇకముందు పీపీపీ యోచన?

ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులను అందుబా టులోకి తెచ్చేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానం అమలు చేయాలని ప్రభుత్వం యోచి స్తున్నట్టు కనిపిస్తుంది. ఎన్‌డీఏ కూటమి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు దీనిపై సమాలోచన చేశారు. గోదావరి జిల్లాల్లో నల్లమట్టి నేలల్లో పట్టులేకపోవడం, తరచూ కుంగడం వంటి పరిణామాలతో రోడ్లపై ఖర్చంతా వృధా అవుతుం దని, పీపీపీ భాగస్వామ్యంతో నిర్మించే రోడ్లు పక్కాగా ఉండేలా చూడాలని భావిస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈ విధానం గోదావరి జిల్లాల్లో విజయవంతమైతే పొరుగున కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ప్రయోగించవచ్చని సీఎం ఆలోచన. ముఖ్యమంత్రి మదిలో ఆలోచనను కొద్దిరోజుల వ్యవధిలోనే ఆచరణలోకి తీసుకువచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఏలూరు జిల్లాలో ఆర్‌అండ్‌బితో పాటు పంచాయతీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిలో ముఖ్యమైన ఒకటి లేదా రెండు, మూడు మార్గాలను పీపీపీ కింద ఎంపికచేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఈ రెండు శాఖలు తొలుత అంచనా వేస్తాయి. ఉదాహ రణకు ఏలూరు–జంగారెడ్డిగూడెం మార్గం అత్యంత క్లిష్టత రమైనది కాగా, ఏలూరు–భీమవరం మార్గంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వీటిని ప్రయోగాత్మకంగా కొత్త విధానంలోకి చేర్చవచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Nov 13 , 2024 | 12:36 AM