ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాయలం గ్రామ పంచాయతీలో రూ.2.30 కోట్లు దుర్వినియోగం

ABN, Publish Date - Dec 10 , 2024 | 01:25 AM

రాయలం గ్రామ పం చాయతీలో రూ.2.30 కోట్లు దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్‌ చర్య లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తహసీల్దార్‌ను ఆదేశించారు.

నిందితులపై క్రిమినల్‌ చర్యలకు కలెక్టర్‌ ఆదేశం

భీమవరం రూరల్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి):రాయలం గ్రామ పం చాయతీలో రూ.2.30 కోట్లు దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్‌ చర్య లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తహసీల్దార్‌ను ఆదేశించారు. పంచాయతీ రిసీప్ట్స్‌ హెడ్‌ కింద భారీగా నిధులు దుర్వి నియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై ఇటీవల కలెక్టర్‌ పంచాయతీ కార్యా లయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని డీపీవో అరుణశ్రీని ఆదేశించారు. ఈ మేరకు ఆమె నరసాపురం డివిజనల్‌ పంచాయతీ అధికారి, సీనియర్‌ సెక్రటరీలతో ఒక విచారణ బృందాన్ని నియమించారు. ఈ బృందం రికార్డులు తనిఖీ చేసి రిసీప్ట్స్‌ హెడ్‌ కింద జమ కావాల్సిన నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. ఇందులో ప్రస్తుత ముత్యాలపల్లి పంచాయతీ సెక్రటరీ ఎస్‌.కె.జి.కృష్ణంరాజు రూ.1,99,50,956, చించినాడ పంచాయతీ సెక్రటరీ డి.జయరాజు రూ.14, 94,224, చినఅమిరం పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌ చి.సుమనాగ్‌ రూ.15,98,455 కలిపి రూ.2,30,43,635 దుర్వినియోగానికి పాల్పడ్డారని, వీరికి ఆడిట్‌ తనిఖీల్లో కొందరు సహకరించారని నివేదించారు. ఈ ముగ్గురు గతంలో రాయలం పంచాయతీలో పనిచేశారు. డీపీవో నివేదిక ఆధారంగా వీరిపై తక్షణం క్రిమినల్‌ చర్యలు తీసుకుని, నివేదిక సమర్పిం చాలని కలెక్టర్‌ భీమవరం తహసీల్దారును ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగంలో పరోక్షంగా సహకరించిన వారిపైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఆడిట్‌ అధికారిని ఆదేశించారు.

విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు

నరసాపురం, డిసెంబరు 9(ఆంధ్ర జ్యోతి):నరసాపురం నుంచి ఒంగోలు 216 జాతీయ రహదారిపై పట్టణంలో లూథరన్‌ చర్చి నుంచి రుస్తుంబాద వరకు కట్టిన దిమ్మలపై అధికారులు విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేశారు. రహదారి నిర్మాణంలో అసంపూర్తి పనులపై ఈ నెల 1న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

Updated Date - Dec 10 , 2024 | 01:25 AM