ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భద్రాచలం–కొవ్వూరు రైల్వే లైన్‌కు మోక్షం

ABN, Publish Date - Dec 13 , 2024 | 12:26 AM

చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కొవ్వూరు–భద్రాచలం రైల్వే లైనుకు కేంద్రం తగినంత బడ్జెట్‌ కేటాయిం చింది. చిన్న మార్పులతోనే ఈ మార్గం పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు సర్వేల పేరిట జరిగిన కాలయాపనకు స్వస్తి పలికింది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది. భారీ అంచనా వ్యయంతో ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్టుగా రైల్వే మంత్రి రాజమహేం ద్రవరం ఎంపీ పురందేశ్వరికి రాత పూర్వకంగా తెలపడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్మాణానికి రూ.2 వేల 155 కోట్లు : ఎంపీ పురందేశ్వరికి రైల్వే మంత్రి లేఖ

ఏజెన్సీ మీదుగా ఇక రైలు కూతలే

రైల్వే మార్గం నిడివి 165 నుంచి 119 కిలోమీటర్లకు తగ్గింది

దశాబ్దాల నిరీక్షణకు.. దాదాపు తెర

ఉమ్మడి పశ్చిమలో హర్షాతిరేకాలు

చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కొవ్వూరు–భద్రాచలం రైల్వే లైనుకు కేంద్రం తగినంత బడ్జెట్‌ కేటాయిం చింది. చిన్న మార్పులతోనే ఈ మార్గం పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు సర్వేల పేరిట జరిగిన కాలయాపనకు స్వస్తి పలికింది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది. భారీ అంచనా వ్యయంతో ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్టుగా రైల్వే మంత్రి రాజమహేం ద్రవరం ఎంపీ పురందేశ్వరికి రాత పూర్వకంగా తెలపడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొవ్వూరు–భద్రాచలం రైల్వేమార్గం ఇన్నాళ్లు ఊగిసలాడుతూ వచ్చింది. సర్వేల పేరిట దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగానే కాల యాపన జరిగింది. కొవ్వూరు–భద్రాచలం మధ్య అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడం, ఈ ప్రాంతం మీదుగా రైల్వే లైను నిర్మించా లంటే కొండ వాగులు, పిల్ల వాగులపై దాదాపు 120 చోట్ల బ్రిడ్జీలు కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సగ భాగం వీటి నిర్మాణానికే ఖర్చయ్యేది. అందుకనే రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రైల్వే మార్గంపై పదేపదే సర్వేలతోనే సరిపుచ్చింది. తొలిసారిగా 1960లో ఈ నూతన మార్గం కోసం సర్వే సాగింది. ఈ మార్గంకు ఉన్న ప్రాధాన్యతను అప్పుడు జరిగిన సర్వేలో నివేదిం చారు. అయినప్పటికి రిజర్వు ఫారెస్టు భాగం ఎక్కువగా ఉండడంతో అటవీ, పర్యావరణ అనుమతులు తప్పవని, దీనికి భిన్నంగా ఏదైనా ఆలోచన చేయవచ్చనన్న ధోరణిని రైల్వే శాఖ ప్రదర్శిస్తూ వచ్చింది. ప్రతీ బడ్జెట్‌లోను ఈ రైల్వే లైను ప్రస్తావన సాగుతున్నా బడ్జెట్‌లో రూపాయి విదల్చడంలేదు. గడిచిన పదేళ్లుగా కేవలం సర్వే, ఇతర పనుల నిమిత్తం 40 కోట్లకు పైగా కేటాయించారు. అయితే ఈ స్వల్ప మొత్తంలో బడ్జెట్‌ కేటాయింపులు జరిగితే రైల్వే ప్రాజెక్టుకు నీళ్ళొదులుకో వాల్సిందేనని అందరూ భావించారు. గతంలో ఎంపీలుగా మాగంటి బాబు, కావూరు సాంబశివరావు, కోటగిరి శ్రీధర్‌, ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్‌ ఈ రైల్వేలైను కోసం పార్లమెంటులో పట్టుపడుతూ వచ్చారు. ప్రధాని దగ్గర నుంచి రైల్వే మంత్రి వరకు వినతులు అందజేశారు. ఈ లైనుకు ఉన్న ప్రాధాన్య తను గుర్తుచేస్తూ వచ్చారు. అయినప్పటికీ రైల్వే శాఖ మాత్రం చూద్దాం.. చేద్దాం అన్నట్టుగానే వ్యవ హరించింది. ఈ పరిస్థితులపై రాష్ట్రం–రైల్వే జనరల్‌ మేనేజర్‌తో ఏటా జరిగే కో–ఆర్డినేషన్‌ కమిటీల్లో ప్రస్తావన కు తెచ్చేవారు. ప్రతీ ఎన్నికల్లోను ఈ రైల్వే లైను అన్ని పార్టీల హామీల అంబులపొదిలో ఉండేది. ఈ క్రమంలోనే గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్ర పరిధిలోని సత్తుపల్లి పరిసరాల్లో బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. దీంతో సింగరేణి కాలరీస్‌ పరిధిలోకి ఈ భూభాగమంతా చేరింది. అప్పటి నుంచి బొగ్గు తవ్వకాలు కాస్తంత వేగం పుంజుకున్నాయి. ఈ తరుణంలో సత్తుపల్లిలో లభించే బొగ్గును ఇతర ప్రాంతాలకు తరలించాలంటే రైల్వేయే అనుకూల రవాణ. దీంతో కొత్తగూడెం–సత్తుపల్లి మధ్య కాస్ట్‌ టూ కాస్ట్‌ షేరింగ్‌ పద్ధతిలో సింగరేణి యాజమాన్యం రూ.706 కోట్లు ఖర్చు భరించగా, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే తన వాటా 85 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో పనులన్నీ పూర్తయ్యి సత్తుపల్లి–కొత్తగూడెం మధ్య రైల్వే మార్గం క్లియర్‌ అయ్యింది. ఇప్పుడు కొవ్వూరు–సత్తుపల్లి మధ్య రైల్వే లైను నిర్మిస్తే కొంత ప్రతిపాదిత వ్యయం తగ్గడమే కాకుండా రాబోయే ఐదేళ్లల్లోనే పనులు పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడు తుందని భావిస్తున్నారు.

కొత్తలైనుకు 2 వేల 155 కోట్లు

కొవ్వూరు–భద్రాచలం రోడ్డు లైను నిర్మాణానికి వీలుగా 2 వేల 155 కోట్లు ప్రతిపాదిత వ్యయం గుర్తించి మంజూరు చేస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. ఈ మేరకు రాజమహేంద్ర వరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి రాతపూర్వ కంగా తెలిపారు. ఇన్నాళ్లు రైల్వే బడ్జెట్‌లో ఈ తరహా పద్దు ఎక్కడా కనిపించకపోగా ఇప్పుడు తాజాగా రైల్వే మంత్రి వైష్ణవ్‌ నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంతో హర్షామోదాలు వ్యక్తమవుతు న్నాయి. ప్రత్యేకించి ఈ రైల్వే మార్గం నిడివి 165 నుంచి 119 కిలోమీటర్లకు తగ్గింది కూడా. ఈ నేపథ్యంలోనే కొంత అలైన్‌మెంట్‌లో మార్పులు, చేర్పులు చేసి సత్తుపల్లి–దేవరపల్లి వరకు ఇప్పటికే గ్రీన్‌ హైవే నిర్మిస్తున్నందున దానికి సమాంతరంగా కొత్త రైల్వే లైనుకు దాదాపు రూటు క్లియర్‌ అయినట్టే. ఎప్పటి నుంచో ఈ లైను కోసం పోరాడుతున్న వారికి తాజా బడ్జెట్‌ కేటాయింపు నిర్ణయం సంతృప్తినిచ్చింది. ఇంతకుముందున్న పరిస్థితులు మారి ఇప్పుడు తాజాగా టి.నర్సాపురం, పుట్టగట్లగూడెం మీదుగా హైవే లైను వెళ్లబోతుంది.

Updated Date - Dec 13 , 2024 | 12:26 AM