ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బరి తెగించారు!

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:49 AM

ఇసుక దోపిడి ఆగలేదు. కష్టాలు తీరలేదు. ఇసుకాసురులు బరితెగించారు. ఇపుడు దళారులకు పలువురు ప్రజా ప్రతినిధులు దోపిడికి ఊతమిస్తున్నారు.

ఇసుక దోపిడీ ఆగలేదు

దళారులకు ప్రజా ప్రతినిధుల ఊతం

నాయకులకు టన్నుకు రూ.150

రీచ్‌లలో లారీ ఇసుకకు రూ. 8000

పాత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికి ప్రజాప్రతినిధుల పగ్గాలు

పాలకొల్లు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

పార్టీ మారినా... ప్రభుత్వం మారినా నేతల తీరు మారలేదు. ఇసుక దోపిడి ఆగలేదు. కష్టాలు తీరలేదు. ఇసుకాసురులు బరితెగించారు. ఇపుడు దళారులకు పలువురు ప్రజా ప్రతినిధులు దోపిడికి ఊతమిస్తున్నారు. రాజమండ్రి, రాజమండ్రి రూరల్‌, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు నేరుగా ఇసుక దోపిడిలోకి వచ్చేశారు. టన్నుకు 150 రూపాయలు చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేశారు. పాత తూర్పు పశ్చిమలో జగన్‌ రెడ్డి ప్రభుత్వంలో గుంటూరు ప్రాంతానికి చెందన ఆర్‌కె అనే వ్యక్తి ఈ రెండు జిల్లాలోనూ ఇసుక దందా కొనసాగించారు. అప్పట్లో ఈ వ్యక్తి ద్వారా జగన్‌ పేషీకి నెలకు రూ.11 కోట్లు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుని ఆ మేరకు దందా కొనసాగించారని అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది.

పడవ ర్యాంప్‌లలో ఐదు యూనిట్లకు రూ. 4,580 వసూలు చేస్తున్నారు. దీనితో పాటు టన్నుకు పడవ కార్మికులకు రూ.200 చొప్పున చెల్లిస్తారు. వీటితో పాటు 20 టన్నుల ఇసుక (ఐదు యూనిట్ల ఇసుక) టన్నుకు రూ.150 చొప్పున రూ.3 వేలు దళారులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో గుంటూరుకు చెందిన వ్యక్తి దందా చేస్తూ కొంత కమిషన్‌ తీసుకుని మిగిలిన మొత్తాన్ని ఎప్పటికపుడు ప్రజా ప్రతినిధులకు అందించే విధంగా ఒప్పదం చేసుకున్నట్లు సమాచారం.

లారీలు ర్యాంప్‌లలోకి వెళ్ళి ఎగుమతి చేసుకునే అవకాశం ఉన్న ర్యాంప్‌లలోసైతం లారీకి రూ. 8 వేల నుంచి 10 వేలు వసూలు చేస్తున్నారు. ఈ ఇసుక లారీల్లో వినియోగదారుడి ఇంటికి చేరేసరికి రూ.20వేలు ఖర్చు అవుతున్నది. తీపర్రులో ర్యాంప్‌లో నీరు రావడంతో రెండు రోజులుగా ఎగుమతులు ఆగాయి. పెండ్యాల, పందలపర్రు ర్యాంప్‌లలో ట్రాక్టర్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎగుమతి చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ట్రాక్టర్‌లు ర్యాంప్‌లోకి నేరుగా వెళ్ళి ఇసుక తెచ్చుకోవచ్చునని ప్రకటించడంతో దానిని అలుసుగా తీసుకుని రోజుకు 200 నుంచి 300 ట్రాక్టర్‌లకు ఇసుక అందజేస్తున్నారు. ట్రాక్టర్‌లు ఇసుకకు అధికారికంగా రూ.200 ఖర్చు చెబుతూ మరో 800 దళారులు నొక్కేస్తున్నారు. ఈ ర్యాంప్‌లలో సైతం లారీలకు ఎగుమతి చేయడం లేదని లారీ యజమానులు చెబుతున్నారు.

ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పటికి ఇసుక కష్టాలు తీరలేదు. ఐదు యూనిట్ల ఇసుక రూ.20 వేలు పైబడి అమ్ముతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గత ఏడాది ఇదే రోజులలో లారీ ఇసుక రూ.13వేల నుంచి 15 వేల మధ్యలోలభించేది. ఇపుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇంకా ర్యాంప్‌లు సిద్ధం కానందున జిల్లా అవసరాలకు రోజుకు వంద లారీలు ఇసుక ఇమ్మని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా అధికారులు మాటలు సైతం దళారులు లెక్క చేయడం లేదు. ఇపుడు నేరుగా ప్రజా ప్రతినిధుదులే ఇసుక అక్రమ అమ్మకాలకు తెరతీయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

సీఎం హెచ్చరికలు బేఖాతర్‌

ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు చెబుతుండగా అదే పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ఇసుకను అమ్మి బొక్కేద్దామని చూడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక వ్యవహారం తలనొప్పిగా మారనుంది. వివిధ పథకాలకు సొమ్ములు ఏ నెలకు ఆ నెల వెతుక్కునే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉండగా ఇసుక లొల్లి ప్రభుత్వానికి తలపోటుగా మారింది. ప్రభుత్వ పెద్దలు ఇసుక అక్రమాలపై దృష్టి సారించాలని నియోజకవర్గాల వారీగా కూటమి శ్రేణులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటినప్పటికి ఇసుక సరఫరా మెగరుపడినప్పటికి ఇంకా అదే కష్టాలు కొనసాగుతుండటం ఉచితంగా తవ్వి తెచ్చుకునే ఇసుకను వేలాది రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకోవడం పట్ల మేథావి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం దృష్టి పెట్టి సంబంధిత శాఖను అప్రమత్తం చేసి సొంత పార్టీకి చెందినవారైనా హద్దు దాటితే శిక్షించాలని వినియోగదారులతోపాటు సామాన్య పౌరులు కోరుతున్నారు

Updated Date - Nov 20 , 2024 | 12:49 AM