ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేతలు.. మేతలు

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:05 AM

టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని నాయకులు అభాసుపాలు చేస్తున్నారు. ర్యాంప్‌ల్లో తవ్వకాలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించినా ఫలి తం లేకపోతోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు తీపర్రు ర్యాంప్‌తో పాటు, ఔరంగాబాద్‌ రీచ్‌ను కేటాయించారు. లోడింగ్‌తోపాటు, రవాణా ఛార్జీలను నిర్ధారించారు.

తీపర్రు ర్యాంపులో ఇసుక ట్రాక్టర్ల క్యూ

లారీకి అదనంగా రూ.5 వేలు వసూళ్లు

తీపర్రు ర్యాంప్‌లో ఇదే దందా.. కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌

బిల్లు రూ.2360.. అదనపు సొమ్ములు చెల్లిస్తేనే లోడింగ్‌

కాంట్రాక్టర్‌లకు అప్పగించినా నాయకులదే దందా

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని నాయకులు అభాసుపాలు చేస్తున్నారు. ర్యాంప్‌ల్లో తవ్వకాలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించినా ఫలి తం లేకపోతోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు తీపర్రు ర్యాంప్‌తో పాటు, ఔరంగాబాద్‌ రీచ్‌ను కేటాయించారు. లోడింగ్‌తోపాటు, రవాణా ఛార్జీలను నిర్ధారించారు. అయినా నాయకులు దళారుల అవతారమెత్తి అధిక ధరలకు ఇసుకను సరఫరా చేస్తున్నారు. తీపర్రులో లారీ ఇసుక కోసం అదనంగా రూ.5 వేలు, లోడింగ్‌ కోసం రూ.2,360 వసూలు చేస్తున్నారు. ఆ పైన లారీ యజమా నులు రవాణా చార్జీలు వేసుకుని ఇసుకను సరఫరా చేయాలి. తీపర్రు నుంచి 20 టన్నుల లారీ ఇసుక తాడేపల్లిగూడెం రావా లంటే కేవలం రూ.10 వేలు, భీమవరానికి రూ.15 వేలు దాటి వెళ్లడానికి వీలు లేదు. కాని అదనంగా వసూలు చేస్తున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌

తీపర్రు ర్యాంప్‌ను సోమవారం కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సందర్శించారు. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. ప్రభుత్వం ఇసుక తవ్వకాలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగిం చింది. దీనివల్ల స్థానికుల ప్రమేయం ఉండదని భావించింది. ఇసుక సరఫరాలో జోక్యం చేసుకోకూడదంటూ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు, నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇవేమీ పనిచేయడం లేదు. కాంట్రాక్టర్లను తమ గుప్పిట్లోకి నేతలు తెచ్చుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్లే లారీకి అదనంగా రూ.5 వేలు చెల్లిస్తేనే లోడింగ్‌ చేస్తున్నారు. లేదంటే తిరస్కరిస్తున్నారు. ఫలితంగా లారీ యజమానులు ఆ సొమ్మును చెల్లించి ఇసుకను రవాణా చేస్తున్నారు. దాంతో ఉచిత ఇసుక విధానంలోనూ ధరలు దిగిరావడం లేదు. దీనివల్ల ఉచిత ఇసుక విధానం అభాసుపాలవుతోంది.

స్టాక్‌ పాయింట్‌ వద్ద గందరగోళం

జిల్లాకు కేటాయించిన ఔరంగాబాద్‌ రీచ్‌ నుంచి పడవల ద్వారా నందమూరు అక్విడెక్ట్‌ సమీపంలోని స్టాక్‌ పాయింట్‌ వద్దకు తీసుకువస్తున్నారు. రీచ్‌లో తవ్వకాలు చేయాలంటే ఖర్చు అధికమవుతుంది. దీంతో టన్ను ధర రూ.230గా నిర్ణయించారు. 20 టన్నుల ఇసుక రూ.4,600కు రావాలి. దీనికి అదనంగా రవా ణా చార్జీలు వసూలు చేయాలి. ఔరంగాబాద్‌ ఇసుక నాణ్యత కార ణంగా డిమాండ్‌ ఉంటుంది. నదిలోకి దిగి ఇసుకను తవ్వుకు వస్తారు. దీనివల్ల ధర అధికంగా ఉంటుంది. అయినా సరే లారీ ఇసుక తాడేపల్లిగూడెం రావడానికి రూ.10 వేలకు మించి ఉండ దు. ఔరంగాబాద్‌ వరకు లారీలు వెళ్లే అవసరం లేదు. తాడేపల్లి గూడెం రూరల్‌ మండలం నందమూరు సమీపంలోని స్టాక్‌ పాయింట్‌కు ఇసుక చేరిపోతుంది. అక్కడ టన్నుకు రూ.400 ఇవ్వాలంటూ ఓ నాయకుడు డిమాండ్‌ చేశారు. స్టాక్‌ పాయింట్‌ నిర్వహణ బాధ్యతను ఓ వ్యాపారికి అప్పగించారు. అతను టన్ను కు రూ.400 ఇవ్వాలని పట్టుబడితే లారీ యజమానులు తిరగబ డ్డారు. దీంతో నిర్వాహకుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అదనపు సొమ్ములు ఇవ్వకపోతే తవ్వకాలు నిలిపివేస్తున్నారు. అధికార యంత్రాంగం నిస్సహాయ స్థితిలో ఉంటోంది. అంతి మంగా ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం అభాసుపాలవుతోంది. ధరలను అదుపు చేయడం కోసం ప్రభుత్వ ఆదాయాన్ని వదులు కున్నారు. సీనరేజీ, జీఎస్టీలను తొలగించారు. అయినా ధరలు దిగిరాకపోవడం విస్మయం కలిగిస్తోంది.

తీపర్రులో ఇసుక వివాదం

పెరవలి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి):

తీపర్రు ర్యాంప్‌ నుంచి ఇసుకను స్టాక్‌ పాయింట్‌కు తరలించేందుకు మంగళవారం ఉదయం సుమారు 40 ట్రాక్టర్లు వచ్చాయి. అయితే ఇసుక ఎగుమతికి కాంట్రాక్టర్‌, బంటా కార్మికులు నిరాకరించారు. ఆ పక్కనే వున్న ఉసులుమర్రు వైపు గల ఈ ర్యాంప్‌లో ఉచిత ఇసుక తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌ యజమానులు సిద్ధమయ్యా రు. అయితే తమ ర్యాంప్‌ నుంచి ట్రాక్టర్లు కిందకు దిగడానికి వీల్లేదని కాంట్రాక్టు పొందిన వ్యక్తులు అక్కడ బాటకు అడ్డంగా మట్టిపోశారు. దీంతో వివాదం పెద్దదై.. ఇరు వర్గాలు మాటామాటా అనుకున్నాయి. సమాచారం అందడంతో తహసీల్దార్‌ అచ్యుతకుమారి ఘటనా స్థలానికి చేరుకుని అనుమతి పొందిన ర్యాంప్‌లో మాత్రమే ఉచిత ఇసుక తీసుకోవాలని, వేరొక ర్యాంప్‌ ద్వారా తీసు కెళ్లడం కుదరదన్నారు. అనుమతి పొందిన ర్యాంపులో ఇవ్వకపోవ డం వల్లే ఇక్కడకు వచ్చామని ట్రాక్టర్‌ యజమానులు చెప్పడంతో తహశీల్దార్‌ ఆ కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఉచిత ఇసుక ఎగు మతి అయ్యేలా చూడాలని సూచించారు.

తీపర్రు ఇసుక ర్యాంప్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన లారీలకు ఇసు క ఎందుకు ఎగుమతి చేయడం లేదంటూ తాడేపల్లిగూడెం డిప్యూటీ కలెక్టర్‌ కతీఫ్‌ కౌసర్‌భాను ప్రశ్నించారు. తీపర్రు ఇసుక ర్యాంప్‌ను మంగళవారం పరిశీలించారు. ర్యాంపు నిర్వాహకులపై మండిపడ్డారు. ఇక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లారీలకు ఇసుక ఎగుమతులు జర గాల్సి ఉన్నప్పటికి ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. తగినంత స్టాక్‌ లేకపోవ డం వల్ల గోదావరి నుంచి స్టాక్‌ పాయింట్‌కు ట్రాక్టర్లపై ఇసుక తరలిస్తున్నామన్నా రు. స్టాక్‌ పాయింట్‌కు ఇసుక చేరుకున్న తర్వాత ఎగుమతులు చేస్తామన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:05 AM