ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దళారుల దందా.. ఇసుక అధరహో!

ABN, Publish Date - Oct 27 , 2024 | 11:55 PM

తాడేపల్లిగూడెం నుంచి 100 వాహనాలకు అవకాశం ఇవ్వండి. జీపీఎస్‌ పెట్టండి, రీచ్‌లు, ర్యాంప్‌ల నుంచి ఇసుక తెచ్చుకుంటాం. దళారుల ప్రమేయం ఉండదు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని సక్రమంగా అమలయ్యేలా చూస్తాం.

దిగిరాని వైనం

నిస్సహాయ స్థితిలో అధికారులు

లారీ ఇసుక రూ. 22 వేలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెం నుంచి 100 వాహనాలకు అవకాశం ఇవ్వండి. జీపీఎస్‌ పెట్టండి, రీచ్‌లు, ర్యాంప్‌ల నుంచి ఇసుక తెచ్చుకుంటాం. దళారుల ప్రమేయం ఉండదు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని సక్రమంగా అమలయ్యేలా చూస్తాం. ప్రభుత్వంపై మచ్చరాదంటూ జిల్లా కలెక్టర్‌కు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు.

ర్యాంప్‌ల నుంచి ఇసుక తీసుకురావడానికి అవకాశం కల్పించండి. అభివృద్ధి పనులకు ఇసుక అవసరం ఉంటుంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ లేఖ రాశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసే లారీలకు అనుమతి ఇస్తే ఇసుకు తీసుకు వెళతారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతికి జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి లేఖ రాశారు.

జిల్లాలో ఇసుక ఇబ్బందులకు ఇది ఒక ఉదాహరణ. అధిక ధరలతో ఇసుక లభిస్తుండడంతో అభవృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రభుత్వం ఉచిత విధానం అమలు చేస్తున్నా సరే ఇబ్బందులు తొలగడం లేదు. ఇప్పటికీ భీమవరం, తాడేపల్లిగూడెం వంటి దూరప్రాంతాలకు ఇసుక రావాలంటే రూ.22వేలు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రైవేటు కాంట్రాక్టర్‌కు ఇచ్చినప్పుడే రూ.14వేలకు వచ్చేసేది. అప్పట్లో సీనరేజీ, జీఎస్టీ కూడా అమలు చేసేవారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఉచిత విధానం అమలు చేస్తోంది. సీనరేజీ, జీఎస్టీని కూడా తొలగించింది. అయినా సరే ఇసుక లభ్యం కావడం లేదు. ఎవరికి వారే తవ్వుకునే అవకాశం కల్పించారు. ట్రాక్టర్‌ల ద్వారా ఇసుక తీసుకువస్తే అడ్డుకోవద్దంటూ అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. దాంతో కాస్త వెసులుబాటు అయ్యింది. లేదంటే లారీ ఇసుక రూ.30వేల వరకు విక్రయించారు. ట్రాక్టర్లు తవ్వుకునే అవకాశం ఇవ్వడంతో లారీపై రూ. 8వేలు తగ్గింది.

పక్క జిల్లాలో ఇసుక

తూర్పుగోదావరి జిల్లాలోనే ఇసుక ర్యాంప్‌లు, రీచ్‌లు పనిచేస్తున్నాయి. అక్కడ నుంచి జిల్లాకు దిగుమతి అవుతోంది. ఆన్‌లైన్‌ విధానంలో ఇసుక బుక్‌చేసుకునే అవకాశం ఇచ్చారు. లేదంటే ర్యాంప్‌ల వద్ద బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. లారీలతో ఇసుక సరఫరా కావాలంటే ఇప్పుటికీ దళారుల దందానే సాగుతోంది. ఆన్‌లైన్‌ ఎప్పుడు తెరచుకుంటుందో అర్థం కావడం లేదు. ఉద్దేశం పూర్వకంగానే దళారులకు ముందుగా సమాచారం ఇస్తున్నారు. అందువల్లే కొన్ని లారీలకే ఇసుక లభిస్తుంది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయంటూ నిర్మాణదారులు గగ్గోలు పెడుతున్నారు. ట్రాక్టర్‌ల ద్వారా ఇసుక రావాలంటే దూరప్రాంతాలకు కష్టతరమవుతోంది. దగ్గరలోనే ట్రాక్టర్‌ల ద్వారా ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ రూ.2500 వరకు అమ్ముతున్నారు. అంటే యూనిట్‌ ఇసుక రూ.2500కు లభ్యమవుతోంది. అదే లెక్కన లారీ ఇసుక అయితే రూ.12500లకు రావాలి. లారీలకు అటువంటి అవకాశం ఉండడం లేదు. ముందుగా బుకింగ్‌ చేసుకోవాల్సి వస్తోంది. దూరప్రాంతాలకు ట్రాక్టర్‌లు రావడం లేదు. కేవలం లారీలపైనే ఆధారపడాల్సి వస్తోంది.

దళారులు వెనుక ఎవ్వరు..

దళారులు ఇప్పటికీ ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. వారి వెనుక ఎవరి హస్తం ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇసుక నిల్వల విషయంలోనే దళారుల దందా సాగింది. కొందరి నేతల జోక్యం వల్ల ధరలు అదుపులోకి రావడం లేదన్న విమర్శలున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక కేవలం రూ. 10వేలకే వచ్చేసేది. అదే ఇప్పుడు రూ. 22వేలకు విక్రయిస్తున్నారు. ఉచిత విరివిగా లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఎవ్వరు వచ్చినా ఇసుక ఇచ్చేలా తవ్వకాలను ప్రైవేటు ఏజన్సీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం ఆదిశగా ఆలోచిస్తోంది. లారీలపై ఆంక్షలు లేకుండా అందరికీ ఇసుక లభించినప్పుడే అధిక ధరలకు అడ్డుకట్ట పడుతోంది. ఉచిత కొరత తీరుతుంది.

జిల్లాలో తెరుచుకోని ర్యాంప్‌లు

జిల్లాలో ర్యాంప్‌లు, రీచ్‌లు ఇంకా తెరచు కోలేదు. ప్రభుత్వానికి జిల్లా అధి కారులు లేఖరాశారు. పర్యావరణపర మైన అవరోధాలున్నాయి. లేదంటే కొంతమేర ఇసుక కొరత తగ్గేది. గతంలో కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల ర్యాంపులు అన్నీ జిల్లా పరిధిలో ఉండేది. జిల్లా పునర్విభజనలో రెండు నియోజకవర్గాలు తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లిపోయాయి. ముందుగా అక్కడ అవసరాలు తీరుస్తున్నారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకునే అవకాశం లేదు. కేవలం అక్కడ అధికారులకు లేఖలు రాసేందుకే పరిమితం కావాల్సి వస్తోంది. అదే ఇప్పుడు జిల్లాలో ఇసుక ఇబ్బం దులకు కొంత కారణమవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం పైన జిల్లాలో ఇసుక ర్యాంప్‌లు తెరచుకోక పోవడం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Updated Date - Oct 27 , 2024 | 11:58 PM