ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గురుకుల పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీలు

ABN, Publish Date - Nov 16 , 2024 | 12:41 AM

పోలసానపల్లి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, కళాశాలలో జరుగుతున్న జోనల్‌ స్పోర్ట్స్‌మీట్‌ శుక్రవారం రెండోరోజుకు చేరుకున్నాయి.

పోలసానపల్లి గురుకుల పాఠశాల ఆవరణలో కబడ్డీలో తలపడుతున్న క్రీడాకారులు

భీమడోలు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలసానపల్లి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, కళాశాలలో జరుగుతున్న జోనల్‌ స్పోర్ట్స్‌మీట్‌ శుక్రవారం రెండోరోజుకు చేరుకున్నాయి. మొదటి రోజు రెండవ రోజు నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొన్న విజేతలను శుక్రవారం ప్రకటించారు. సర్కిల్‌ విభాగంలో 1500 మీటర్ల పరుగు పందెంలో జంగారెడ్డిగూడానికి చెందిన వి.ఇందు, పోల సానపల్లి గురుకుల పాఠశాలకు చెందిన నిత్యశ్రీ, జంగారెడ్డిగూడానికి చెందిన పూజ ప్రథమ, ద్వితీ య, తృతీయ స్థానాల్లో నిలిచారు. షార్ట్‌ఫుట్‌ విభాగంలో ముత్తళ్ళకు చెందిన పి.కీర్తన, కొవ్వూ రుకు చెందిన పి.కృష్ణవేణి, వి.శ్రీలత ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. కాలేజీ విభాగం ష్టార్ట్‌ఫుట్‌లో తునికి చెందిన లావణ్య, ముత్తళ్ళకు చెందిన లిఖిత, కె.రమ్య ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. డిస్కస్‌ త్రోలో తునికి చెందిన లావణ్య, పుట్టముక్కలకు చెందిన కె.నిధి, ముత్తళ్ళకు చెందిన వి.నిఖిత ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. మిగిలిన విభాగాల్లోని కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్‌, చెస్‌ పోటీల్లో తొలి రౌండ్‌ ముగిసి ఫైనల్స్‌ జరగాల్సి ఉంది. పీఈటీలు, క్రీడా విభాగం అధికా రులు పోటీలను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:41 AM