ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘భావి పౌరులకు రాజ్యాంగాన్ని పరిచయం చేద్దాం’

ABN, Publish Date - Nov 03 , 2024 | 11:57 PM

‘భావిపౌరులకు రాజ్యాంగాన్ని పరిచయం చేద్దాం’ అని విశ్రాంత ప్రిన్సిపాల్‌ సంకు మనోరమ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని తరగతి గదుల్లో విద్యార్థులకు సులభంగా బోధించే పద్ధతిపై ఆదివారం ఎస్‌సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తణుకులోని విద్యా సంస్థల అధ్యాపకులతో వర్క్‌ షాపు నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న విశ్రాంత ప్రిన్సిపాల్‌ సంకు మనోరమ

తణుకు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ‘భావిపౌరులకు రాజ్యాంగాన్ని పరిచయం చేద్దాం’ అని విశ్రాంత ప్రిన్సిపాల్‌ సంకు మనోరమ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని తరగతి గదుల్లో విద్యార్థులకు సులభంగా బోధించే పద్ధతిపై ఆదివారం ఎస్‌సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తణుకులోని విద్యా సంస్థల అధ్యాపకులతో వర్క్‌ షాపు నిర్వహించారు. తణుకు స్టడీ సర్కిల్‌ కార్యదర్శి డాక్టర్‌ రమేష్‌ చంద్రబాబు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రచార సమన్వయ కర్త డీవీవీఎస్‌ వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల నుంచి వచ్చిన స్పందన రాజ్యాంగ విలువల పరిరక్షణకు దోహ దం చేస్తుందన్నారు. దీనిలో భాగంగా ‘రాజ్యాంగ పీఠిక–పద పరిచయం’ అంశాన్ని విశ్రాంత ప్రిన్సిపాల్‌ సంకు మనోరమ, ప్రాఽథమిక హక్కులు అంశాన్ని సామాజిక న్యాయపోరాట సమితి వ్యవస్థాపకుడు పేరూరి మురళీకుమార్‌, ప్రాథమిక అంశాన్ని శ్రీశ్రీసేవాసమితి కన్వీనర్‌ దక్షిణమూర్తి, ఆదేశిక సూత్రాలు అంశాన్ని డిగ్రీ కాలేజీ అధ్యాపకులు విష్ణువర్దన్‌ వివరించారరు. వర్క్‌షాపునకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలకు చెందిన కళాశాలలు, హైస్కూల్స్‌కి ప్రాతినిధ్యం వహించే 25 సంస్థల నుంచి 40 మంది అధ్యాప కులు 15 మంది ఇతర ప్రముఖులు హాజర య్యారు. సమావేశంలో విశ్రాంత ప్రిన్సిపాల్స్‌ చల్లా హైమావతి, అడ్డాల సత్యనారాయణ, బెల్లం కొండ బుచ్చిబాబు, ఎస్వీఐఎం వైస్‌ ప్రిన్సిపాల్‌ ఏడుకొండలు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 11:57 PM