ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:32 AM

పాడి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభు త్వం నూతన విధానాలను తీసుకువచ్చింది.

పశువులకు గన్‌తో సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌ ఇస్తున్న పశు వైద్యాధికారులు

రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వ నూతన విధానం

జిల్లాకు 5 వేల సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌ డోసుల కేటాయింపు

గేదె, ఆవు పెయ్య జననాలకు ప్రాధాన్యం

పెంటపాడు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పాడి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభు త్వం నూతన విధానాలను తీసుకువచ్చింది. కేవలం పాడి రైతులు పెంచుకునే గేదెలు లేదా అవులకు ఆడ పెయ్యలు మాత్రమే పుట్టేవిధంగా కొత్త చర్యలు చేపట్టింది. పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్థక శాఖల ద్వారా సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌ పంపిణీ చేస్తుంది. ఈ డోసులు వేసిన పశువులకు దాదాపు 90 శాతం ఆడదూడలే పుట్టేలా చర్యలు చేపట్టింది. పాడి రైతులకు పాల ఉత్పత్తి పెంచి అదనపు ఆదాయాన్ని సమకూర్చమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇటీవల నిర్వహించిన పశుగణన ప్రకారం జిల్లాలో గేదెలు 1,78,137 ఉండగా, ఆవులు 45,539 ఉన్నట్లు గుర్తించారు.

రెండు డోసులు కేవలం రూ.500

పశువులకు సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌ 2 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. పశువుల గర్భంలోకి గన్‌ ద్వారా సెమన్‌ నేరుగా పంపుతారు. మొదటి డోసు ఇచ్చిన 21 రోజుల తరువాత రెండో డోసు కూడా ఇస్తారు. ఈ రెండు డోసుల విలువ రూ 1,350 కాగా సబ్సిడీ రూ 850 పోను రైతులు కేవలం రూ.500 చెల్లించాలి.

గర్భధారణ కాకుంటే డబ్బులు వాపస్‌

పశువులకు రెండు డోసులు ఇచ్చిన తర్వాత గేదె లేక ఆవు గర్భం దాల్చకుంటే రైతుల వద్ద తీసుకున్న రూ.500 వెనక్కి ఇచ్చేస్తారు. ఒక వేళ ఆడ దూడ కాకుండా మగ దూడ పుట్టిందంటే సబంధిత రైతుకు రూ.250 వెనక్కి ఇస్తారు

40 శాతం అభివృద్ధి

జిల్లాలో గత ఏడాది మొత్తం 1588 డోసులు ప్రవేశ పెట్టారు. ఆయా గ్రామాలలో రైతులకు అవగాహన కల్గించి గేదెలు, ఆవులకు పశు సంవ ర్థక శాఖ అధికారులు, సిబ్బంది డోసులు వేశారు. దీంట్లో 40 శాతానికి పైగా అనుకూల ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది జిల్లాకు 5 వేల డోసులు వచ్చాయి. ఇప్పటివరకూ గేదెలు, ఆవులకు 1800 డోసులు వేశారు. ఈ ఏడాది 90 శాతం పైగా మంచి ఫలి తాలు వస్తాయని అధికారులు భావి స్తున్నారు. గ్రామాలలో రైతులకు అవగాహన కల్గిస్తున్నారు.

పెయ్య దూడ జననం

అధికారుల సూచనల ప్రకారం మా గేదెకు నేను సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌ రెండు డోసులు వేయించాను. వేయించిన వెంటనే సూడిదయ్యింది. ఎటువంటి ఇబ్బంది లేదు. నాలుగు నెలల క్రితం మా గేదెకు పెయ్యదూడ పుట్టింది. చాలా ఆరోగ్యంగా ఉంది. ఇటువంటి పథకాల వల్ల పాడిరైతులకు మేలు జరుగుతుంది.

జామి సత్యనారాయణ రైతు, పెంటపాడు

రైతు ఆదాయం పెంచడమే లక్ష్యం

పాడి రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ సెమన్‌తో 90 శాతం పశువులకు పెయ్యలు పుట్టే అవకాశం ఉంది. ప్రతీచోటా ఇప్పటివరుకూ మంచి ఫలితాలు వస్తున్నాయి. రైతులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. పాడి రైతులు ఇటువంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.

డాక్టర్‌ మహేష్‌, పశువైద్యుడు, పెంటపాడు

Updated Date - Nov 15 , 2024 | 12:33 AM