ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లేవ్‌

ABN, Publish Date - Nov 24 , 2024 | 01:05 AM

సాఫ్ట్‌వేర్‌ రంగం మందగమనంలో ఉండడంతో ఇంజనీరింగ్‌ పూర్తయిన అభ్యర్థులు నిరుద్యోగులుగా మిగులుతున్నారు.

ఉద్యోగం వేటలో ఇంజనీరింగ్‌ విద్యార్థులు

పాత కంపెనీలలో ఉద్యోగ పొడిగింపు లేదు

జిల్లాలో ఏటా 10 వేల మంది ఇంజనీరింగ్‌ అభ్యర్థులు

రెండేళ్లుగా 10 శాతం దాటని ప్లేస్‌మెంట్స్‌

సాఫ్ట్‌వేర్‌ రంగం మందగమనంలో ఉండడంతో ఇంజనీరింగ్‌ పూర్తయిన అభ్యర్థులు నిరుద్యోగులుగా మిగులుతున్నారు. రెండేళ్లుగా క్యాంపస్‌ ఎంపికలు 50 నుంచి 10శాతానికి పడిపోయింది. ఇంజనీరింగ్‌ పూర్తయిన వారికి ఆఫ్‌ క్యాంపస్‌ ఆన్‌లైన్‌ ఎంపికలు కష్టంగా మారాయి. జిల్లాలో రెండేళ్లుగా ఇంజనీరింగ్‌ పూర్తయిన వారిలో 18వేల మంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నట్లు అంచనా.

భీమవరం ఎడ్యుకేషన్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో 15 ఇంజనీరింగ్‌ కళాశాలల నుంచి ఏడాదికి 10 వేల మంది విద్యార్థు లు ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్‌తో బయటకు వస్తున్నా రు. 2023లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగావకాశాలు తగ్గిపో వడంతో 10శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందారు. 90 శాతం మంది ఉద్యోగ వేటలో ఉన్నారు. ఈ ఏడాది ఈనెలలోపే క్యాంపస్‌ ఇంటర్వ్యూల ప్రక్రియ దాదాపు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం క్యాంపస్‌ ఎంపికలకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు పెద్దగా రాలేదు. ఈసారి విద్యార్థులు ఆఫ్‌ క్యాంపస్‌లలో ఉద్యోగాలు వెతుక్కోవాల్సిందే.

ఉద్యోగాల పొడిగింపు లేదు

గడిచిన ఏడు, ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ రంగం లో ఉద్యోగాలు చేస్తున్న సీనియర్ల కొలువుకు భద్రత లేదు. వారు ఉద్యోగం పొందిన కంపెనీలో ఒప్పంద గడువు ముగిసిన తర్వాత సంబంధిత కంపెనీలు ఒప్పంద పొడిగించడానికి సుముఖం గా లేవు. దీంతో సీనియర్‌ ఉద్యోగులు సైతం తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. జిల్లాలో వందల సంఖ్యలో ఉద్యోగావకాశం కోల్పేయే పరిస్థితులు నెలకొన్నాయి.

కొత్త ప్రాజెక్ట్‌లు లేవు

ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరంలోనే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ 50శాతం వరకు వచ్చేవి. రెండేళ్లుగా క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు కంపెనీలు ఆసక్తి చూప డం లేదు. ఇంజనీరింగ్‌ పూర్తయిన వారు ఉద్యో గాలు సాధించలేకపోతున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగం లో పెద్ద ప్రాజెక్టులు లేకపోవడంతో ఉపాధి కల్పనకు గండి పడింది. కోట్ల రూపాయలలో ఉండే ప్రాజెక్టులు ఇప్పుడు లక్షలతో కూడిన ప్రాజెక్టులుగా మారాయి. ఉన్న ఉద్యోగులకు జీతాలు ఎలా అనే ఆలోచనలో పెద్ద కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అందువలన కొత్తవారిని తీసుకురావడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే పెద్ద ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు కనబడడం లేదు. దీని వలన కొత్త ఉద్యోగాలు అందుబాటులో లేవు.

ఏ ఉద్యోగానికైనా రెడీ..!

ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారు నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ఏ ఉద్యోగానికైనా రెడీ అంటున్నారు. కొన్ని రోజులు క్రితం భీమవరంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఆక్వా, బ్యాటరీ కంపెనీలలో పనిచేసే ఉద్యోగాలు అందుబాటులో ఉండగా 20 మంది పైగా ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారు హాజరయ్యారు. నెల జీతం రూ.14,500. ఉద్యోగ మేళా నిర్వాహకులు మీకు సంబంధించిన ఉద్యోగం కాదని వారిని పంపించేశారు. చిన్న తరహా బ్యాంకులు, కళాశాలలో బోధనల పనుల్లో చేరుతున్నారు.

నో రికమండేషన్‌

సాఫ్ట్‌వేర్‌ రంగంలో రెండేళ్ల క్రితం వరకు ప్రముఖ కంపెనీలలో పనిచేసే హెచ్‌వోడీలు, సీనియర్‌ ఉద్యోగులు తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేవారు. మరి కొంతమంది ఆ కళాశాల విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేసేవారు. వేల సంఖ్యలో కొత్త వారికి ఉద్యోగాలు రికమండేషన్‌తో వచ్చేవి. ప్రస్తుతం సీనియర్ల రికమండేషన్‌ తో ఒక్క ఉద్యోగం కూడా పొందే అవకాశం లేదు.

ఆఫర్‌ లెటర్‌ వచ్చినా..!

గత ఏడాది ఇంజనీరింగ్‌ పూర్తయిన వారికి క్యాంపస్‌, ఆన్‌ క్యాంపస్‌లలో ఎంపికైన వారికి పలు కంపెనీల ఆఫర్‌ లెటర్‌ ఇచ్చాయి. ఏడాది గడిచినా వారికి సంబంధిత కంపెనీల నుంచి పిలుపు రాలేదు. వేల మంది ఈ తరహాలో ఉద్యోగాలలో చేరేదెప్పుడు అని ఎదురు చూస్తు న్నారు. గతంలో కంపెనీ ఆఫర్‌ లెటర్‌ ఇచ్చిన 6 నెలలు వ్యవధిలోపే పిలవడం ఉద్యోగంలో చేర్చుకోవడం జరిగేది. ప్రస్తుతం ఆఫర్‌ లెటర్‌ చేతిలో ఉన్నా ఉద్యోగానికి పిలుపు లేదు.

రెండేళ్ల ఒప్పందం ముగిసింది

ఐదేళ్ల క్రితం క్యాంపస్‌ ఇంటర్య్వూలో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల ఒప్పందం తో వెళ్లాను. తర్వాత మూడేళ్లు ఒప్పందం పొడిగించుకున్నాను. ఇప్పుడు ప్రాజెక్టు అయిపోయింది. తిరిగి ఒప్పందం పొడిగించడానికి కంపెనీ ఒప్పకోలేదు. ప్రస్తుతం ఖాళీ అయ్యాను. కొత్త ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నాను.

బి.నరేష్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లు లేవు

సీఎస్‌ఈ గ్రూపుతో ఇంజనీరింగ్‌ ఈ ఏడాదితో పూర్తయింది. రెండు క్యాంపస్‌ ఇంటర్వ్యూలను ఫేస్‌ చేశాను. రెంటింటిలో కూడా ఎంపిక చేసుకోలేదు. మూడేళ్ల క్రితం మా కాలేజీలో 50 శాతం ప్లేస్‌మెంట్స్‌ అయ్యాయి. నేను ఇంజనీరింగ్‌ ఆఖరి సంవత్సరంలో ఉండగా 10శాతం కూడా ప్లేస్‌మెంట్‌ లేదు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వారు తీసుకోవడానికి ఆసక్తిగా ఉండడం లేదు.

ప్రణీత్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థి

పెద్ద ప్రాజెక్ట్‌లు లేక..

సాఫ్ట్‌వేర్‌ రంగంలో పెద్ద ప్రాజెక్టులు లేవు. అందుకే ఉద్యోగావకాశాలు తక్కువ. విద్యార్థులు కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌, కోడింగ్‌ నాలెడ్జ్‌ పై పట్టు సాధించాలి. సెమిస్టర్‌ పర్సంటెజ్‌ 75 పైన ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఉద్యోగావకాశం సులభం.

సీహెచ్‌.రామకిశోర్‌, ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌, డీఎన్నార్‌ కళాశాల

తగిన నైపుణ్యం ఉండాలి

ఇంజనీరింగ్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాను. సాఫ్ట్‌వేర్‌ రంగం స్లోగా ఉన్నా బయటకు వచ్చేసరికి ఉద్యోగం సాధించే నైపుణ్యంతో ఉంటా. కంపెనీ వాళ్లకు కావల్సిన కంప్యూటర్‌ కోర్సులు, ఇండివిడ్యువల్‌ సర్టిఫికెట్‌ కోర్సులు చేస్తాను.

– డి.భవాని వర్షిత, డిఎన్నార్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిని

చదువుతూనే ఇంటర్న్‌షిప్‌ చేస్తా

ప్రస్తుతం ఉద్యోగావకాశాలు తక్కువ. నేను ఇంజనీరింగ్‌ పూర్తయ్యే సరికి సెమిస్టర్‌లలో 80శాతం పైగా మార్కులు సాధించాలనుకుంటున్నాను. చదువుతూనే ఇంటర్న్‌షిప్‌ చేస్తా. స్కిల్స్‌ ఉంటే కంపెనీలలో ఉద్యోగం సాధించవచ్చు.

– సీహెచ్‌.లక్ష్మీ శ్రావ్య, డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిని

Updated Date - Nov 24 , 2024 | 01:05 AM