జిల్లాలో సోలార్ రూ్‌ఫ్‌కు 8 వేల దరఖాస్తులు
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:08 AM
పీఎం సూర్య ఘర్ యోజనలో పీఎం లంక(నరసాపురం), ఆగర్తిపాలెం (పాలకొల్లు), కొవ్వాడ(భీమవరం) గ్రామాలను నోడల్ విలేజ్ లుగా ఎంపిక చేసినట్లు ఈపీడీసీఎస్ ఎస్‌ఈ రఘునాధ్‌బాబు చెప్పారు.
నోడల్ విలేజ్‌లుగా మూడు గ్రామాల ఎంపిక : ఈపీడీసీఎల్ ఎస్‌ఈ రఘునాఽఽథ్‌బాబు
నరసాపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి):పీఎం సూర్య ఘర్ యోజనలో పీఎం లంక(నరసాపురం), ఆగర్తిపాలెం (పాలకొల్లు), కొవ్వాడ(భీమవరం) గ్రామాలను నోడల్ విలేజ్ లుగా ఎంపిక చేసినట్లు ఈపీడీసీఎస్ ఎస్‌ఈ రఘునాధ్‌బాబు చెప్పారు. మంగళవారం ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సోలార్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం, బ్యాంకులందించే రుణాలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘500 విద్యుత్ కనెక్షన్లు ఉండే ఈ మూడు గ్రామాల్లో నూరు శాతం సోలార్ రూప్‌ను ఏర్పాటు చేయాల ని ప్రతిపాదించాం. ఈ స్కీమ్ విజయవంతమైతే ఆ మూడు గ్రామాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున గ్రాంట్ విడుదల చేస్తుంది. కిలోవాట్స్‌కు రూ.30 వేలు, 2 కిలో వాట్స్ రూ.60 వేలు, 3 కిలో వాట్స్‌కు రూ.75 వేలు వినియోగదారుడు చెల్లిం చాలి. ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత సబ్సిడీ వినియోగ దారుల ఖాతాల్లో జమవుతుంది. జిల్లాలో సోలార్ రూప్‌కు 8 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు 250 మందికి సబ్సిడీపై సోలార్ ప్లాంట్‌లందించాం. పది రోజుల్లో సర్వే చేసి 245 మందికి ఇస్తాం. ట్రాన్స్‌కో ఈఈ మఽధుకుమార్ మాట్లాడుతూ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల ఖర్చును తగ్గించుకోవచ్చు’ అని తెలపారు. సమావేశం లో డీఈ ఓంకార్, ఏఈలు ప్రభాకరావు, కె.సుధాకర్, సిబ్బంది మునికోటి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 13 , 2024 | 12:08 AM