ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెత్త వాహనాల బంద్‌

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:21 AM

మునిసిపాలిటీల్లో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న క్లాప్‌ వాహనాల సిబ్బంది విధులకు హాజరు కాకపోవటంతో వాహనాలు మూలకు చేరాయి.

మునిసిపాలిటీల్లో చెత్త సేకరణను నిలిపివేసిన క్లాప్‌ వాహనాలు

మూడు నెలలుగా సిబ్బందికి జీతాలు నిల్‌

ప్రత్నామ్నాయ ఏర్పాట్లలో మునిసిపాలిటీలు

జిల్లావ్యాప్తంగా నిలిచిన 121 వాహనాలు

భీమవరం టౌన్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి) : మునిసిపాలిటీల్లో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న క్లాప్‌ వాహనాల సిబ్బంది విధులకు హాజరు కాకపోవటంతో వాహనాలు మూలకు చేరాయి. భీమవరం మునిసిపాలిటీలో వారం రోజులుగా నిలుపుదల చేశారు. జిల్లాలోని మిగతా మునిసిపాలిటీల్లో రెండు రోజులుగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వార్డుల వారీగా చెత్తసేకరణ నిలిచిపోయింది. క్లాప్‌ వాహనాలు (చెత్తసేకరణ వాహనాలు) సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో విధులకు హాజరు కావటంలేదు. దీంతో చెత్తసేకరణ పూర్తిస్థాయిలో జరగటంలేదు. ఈ వాహనాలు 2022 అక్టోబరు నెల నుంచి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలలో వినియోగంలోకి వచ్చాయి. జిల్లామొత్తం మీద 121 వాహనాలు ఉన్నాయి. వీటి నిర్వహణ తదితర వాటికి సంబంధించి దాదాపు 600 మంది వరకు సిబ్బంది ఉంటారని చెబుతున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

క్లాప్‌ వాహనాలు నిలిచిపోవటంతో చెత్త సేకరణకు మునిసిపాలిటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం మునిసిపాలిటీల వద్ద ఉన్న వాహనాలకు తోడు మరికొన్ని అద్దెకు తీసుకుని చెత్తసేకరణ చేపడుతున్నారు. వాస్తవంగా క్లాప్‌ వాహనాలు వచ్చిన తరువాత మునిసిపాలిటీలు సొంతగా వాహనాలను ఏర్పాటు చేసుకోవటంలేదు. దీనితో ఇప్పుడు అద్దె వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది.

గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా క్లాప్‌ వాహనాలు విషయంలో ఒప్పందం కుదుర్చుకోవటంతో మునిసిపాలిటీలకు అదనపు భారంగా మారింది. 5ఏళ్ళగా వాహన యజమానులకు లక్షలాది రూపాయిలు చెల్లిస్తూనే ఉన్నారు. వీటికి సొమ్ములు చెల్లించేందుకు ప్రజల నుంచి చెత్తపన్ను వసూలుకు చర్యలు చేపట్టారు. అది చిరవకు ప్రజా వ్యతిరేకతకు దారితీయటంతో మునిసిపాలిటీల నుంచే సొమ్ములను ఇప్పటి వరకు చెల్లిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చెత్తపన్నును తొలగించారు. కానీ వాహనాలకు సంబందించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటంతో ఇప్పటి వరకు వాహనాల ద్వారానే చెత్తసేకరణ చేస్తున్నారు. ఇప్పుడు సిబ్బంది విధులకు హాజరు కాకపోవటంతో పరిస్థితి మారింది. జీతాలు చెల్లించే వరకు విధులకు హాజరు కామని సిబ్బంది చెబుతున్నారు. ప్రతి మునిపాలిటీలోను ఓక్కొక్క వాహనానికి రూ.56వేలు చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - Oct 20 , 2024 | 12:21 AM