ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వండకుండానే బొక్కేస్తున్నారు..!

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:37 AM

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 850 బియ్యం కార్డులు ఉన్నాయి.

రేషన్‌ బియ్యం అమ్మినా.. కొన్నా నేరమే..

మోటారు సైకిళ్లపై ఇంటింటా సేకరణ

కిలో రూ.15 కొనుగోలు..

గోదాముల్లో నిల్వలు.. అరకొర దాడులు

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 850 బియ్యం కార్డులు ఉన్నాయి. ప్రతీ నెలా 830 మంది కార్డుదారులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం తీసుకుంటారు. వీరిలో పాతిక శాతం మంది వరకు ఈ బియ్యాన్ని వండుకుని తింటారు. మరికొందరు మరపట్టించి పిండి వంటలు, జావ తదితర వాటికి వినియోగిస్తారు. అధిక శాతం మంది ఆ బియ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు కిలో రూ.15 నుంచి 18కి విక్రయిస్తున్నారు. ఆపై నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసి తింటారు. ప్రభుత్వమే పేదలు తినేందుకు వీలుండే బియ్యం అందిస్తే ఈ బియ్యం పక్కదారి పట్టే పరిస్థితి తగ్గుతుంది.

తాడేపల్లిగూడెం రూరల్‌, అక్టోబరు 24(ఆంధ్ర జ్యోతి):‘ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం తినడానికి వీలుగా ఉంటే బాగుంటుంది. దీనివల్ల ఈ పీడీఎస్‌ వ్యాపారం తగ్గించవచ్చ’ని తాడేపల్లిగూడెంకు చెందిన విజ య్‌ చెబుతున్నారు. ప్రస్తుతం తెల్ల రేషన్‌ కార్డుదా రులకు సంపత్‌ స్వర్ణ రకం బియ్యాన్ని అందిస్తు న్నారు. అయితే ఆ రకం ఇష్టపడి తినేవారు తక్కు వ. తప్పక తినేవారు మాత్రమే తింటారు. ప్రభు త్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యంలో కొంత మేర మిల్లింగ్‌ చేసి ప్రజలకందించే ఏర్పాటు చేస్తోంది. గత వైసీపీ సర్కార్‌ పేదలకందించేం దుకు సన్న రకం బియ్యం అందిస్తామని చెప్పి.. తర్వాత ‘సన్న రకం కాదు.. నాణ్యమైన రకం ఇస్తా మని చెప్పామని’ మాట తప్పింది. ఏది ఏమైనా ప్రజలకు ఉపయోగపడే బియ్యం అందిస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం.

పట్టపగలే తరలింపు.. అరకొర దాడులు

పేదలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యమే లక్ష్యంగా కొన్నేళ్లుగా మాఫియా చెలరేగి పోతోంది. రేషన్‌ బియ్యం కొనేందుకు గ్రామాలు, పట్టణాల్లో మోటారు సైకిళ్లపై ఇంటింటికి వస్తు న్నారు. రోజూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు చేపడుతున్నా మాఫియా లెక్క చేయడం లేదు. విజిలెన్స్‌ అధికారులు అర కొర దాడులు నిర్వహిస్తున్నా ఈ మాఫియా ఆగడాలు ఆగడం లేదు. ఇంటింటి నుంచి సేకరిం చిన బియ్యాన్ని వ్యాపారులు రీ సైకిల్‌ చేసేందుకు ఉమ్మడి తూర్పుగోదావరిలోని రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. మరికొందరు బియ్యాన్ని నూకలు గా మార్చి కోళ్ల ఫారాలు, చెరువులకు పంపిస్తు న్నారు. ఇటీవల ఓ ముఠా తాడేపల్లిగూడెం ప్రాంతంలోని ఓ గోదాములో పీడీఎస్‌ బియ్యాన్ని భారీ స్థాయిలో నిల్వ చేసింది. దీనిపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి బియ్యాన్ని సీజ్‌ చేశారు. కృష్ణాయపాలెంలో ఓ వ్యాపారి తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకుని వ్యాన్‌తోపాటు స్వాధీనం చేసుకున్నారు. అరకొరగా దాడులు చేస్తుండడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. బియ్యం కొనుగోలుకు వ్యాపారులు ప్రతీ నెలా ఒకటి నుంచి 15వ తేదీ మధ్య వందల సంఖ్యలో మోటారు సైకిళ్లపై ఇళ్లకు వెళుతుంటారు. ఒక్కో మోటారు సైకిల్‌పై రెండు క్వింటాళ్లకు పైగా కొనుగోలు చేసి తరలి స్తారు. చెక్‌ పోస్టుల్లో వీరిని కనీసం నిలువ రించరు. ఇలా సేకరించిన వ్యక్తి పెద్ద వ్యాపా రికి, అక్కడి నుంచి రైస్‌ మిల్లులకు తరలిస్తుం టారు. ఆ బియ్యం మొత్తం జాతీయ రహదా రిపై నుంచే తరలించడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎక్కడా వారిని అడ్డుకోరు. ఇలా ఎవరు తరలిస్తున్నారో, ఎక్కడికి తరలి స్తున్నారో అధికారులకు తెలిసినా పట్టించుకో వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

చట్టం ఏం చెబుతుంది ?

ప్రజా పంపిణీ వ్యవస్థలో పేదలకందించే బియ్యం అమ్మినా, కొనుగోలు చేసినా చట్ట ప్రకారం నేరం. ప్రభుత్వాన్ని మోసం చేయ డంతోపాటు ప్రజలను మభ్యపెట్టినందుకు 420 కేసుతోపాటు, ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రత్యేకమైన నేరం కింద 7 క్లాజ్‌ 1లో కేసు నమోదు చేస్తారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, రవాణా చేస్తున్న వాహనాన్ని సీజ్‌ చేస్తారు. నేరం రుజువైతే జరిమానా విధిస్తారు. ఈ కేసుల్లో జైలు తక్కువగా పడుతుండడంతో ఈ దందా చేసే వారు చట్టాన్ని లెక్కచేయడం లేదు.

Updated Date - Oct 29 , 2024 | 12:37 AM